Vivo v21 5g: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు శుభవార్త.. నేడే వివో వి21 5జీ మొబైల్ లాంచ్.. అద్భుతమైన ఫీచర్స్..

Vivo V21 5g launch Today: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో నుంచి మరో సరికొత్త 5జి స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. దేశంలో ఈ రోజు మధ్యాహ్నం వివో వి21 5జీ స్మార్ట్

Vivo v21 5g: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు శుభవార్త.. నేడే వివో వి21 5జీ మొబైల్ లాంచ్.. అద్భుతమైన ఫీచర్స్..
Vivo V21 5g Mobile

Updated on: Apr 29, 2021 | 10:30 AM

Vivo V21 5g launch Today: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో నుంచి మరో సరికొత్త 5జి స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. దేశంలో ఈ రోజు మధ్యాహ్నం వివో వి21 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. రెండు రోజుల క్రితమే.. వివో వి21 గురించి సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే. వివో వి21 5జి ఫోన్ మధ్యాహ్నం నుంచి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి భారతదేశంలో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. ఈ వివరాలన్నింటినీ వెల్లడించిన స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో.. ధర గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే.. వివో v20 ధర ప్రస్తుతం దేశంలో.. 22,990 గా ఉంది. కాగా.. వివో వి 21 5 జి ధర కొంచెం అదనంగా ఉంటుందని పేర్కొంటున్నారు.

వివో వి21 5జి ఫీచర్స్..

ఈ ఫోన్‌కు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తోపాటు 44 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లభిస్తుంది.
వాటర్ డ్రాప్ నాచ్ డిస్ ప్లేతో వస్తుంది.
వివో వి21లో సింగిల్ లెన్స్‌తో రానుంది.
వివో వి21లో బ్యాక్ కెమెరా ట్రిపుల్ రియర్ సెటప్‌ అందించారు. దీనిలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు తోడ్పడుతుంది.
ఈ ఫోన్‌కు ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11 లభిస్తుంది.
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అందించారు.
ఫోన్‌లో 5జీకి సపోర్ట్ కూడా ఉంటుంది.
వివో వి 21 5 జి ఆర్కిటిక్ వైట్, డర్క్ బ్లూ, సన్‌సెట్ డాజిల్ కలర్ ఆప్షన్లలో లభించనుంది.
కాగా.. దీని అసలు ధర మధ్యాహ్నం తరువాత వెలువడనుంది.

Also Read:

Indian Stock Market: ఉదయం నుంచే జోరుమీదున్న దేశీయ మార్కెట్లు.. 600 పాయింట్లు లాభంతో ఎగబాకి సెన్సెక్స్

India Covid-19: దేశంలో కరోనా విలయం.. 30 లక్షలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు.. రికార్డు స్థాయిలో..