Vande Bharat Sleeper: ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంటుందో తెలుసా?

Vande Bharat Sleeper Train: వందే భారత్ స్లీపర్ ప్రత్యేకంగా సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇందులో కుషన్డ్ బెర్త్‌లు, ఆటోమేటిక్ డోర్లు, తక్కువ శబ్దం కలిగిన సస్పెన్షన్ సిస్టమ్, ఆధునిక డ్రైవర్ క్యాబ్, ఏరోడైనమిక్ డిజైన్ ఉన్నాయి. ఈ..

Vande Bharat Sleeper: ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంటుందో తెలుసా?
Vande Bharat Sleeper

Updated on: Jan 12, 2026 | 8:22 AM

భారత రైల్వేలు ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. సరికొత్త ట్రైన్‌లను ప్రవేశపెడుతోంది. సరికొత్త టెక్నాలజీతో సరికొత్త హైస్పీడ్‌ రైళ్లను ప్రవేశపెడుతోంది. అయితే భారతీయ రైల్వేలు వచ్చే వారం జనవరి 17 శనివారం వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తోంది. ఇది రైలు ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా మార్చే విధంగా ఉంటుంది. ఈ కొత్త రైలులో ప్రయాణికులు ఒక పెద్ద మార్పును గమనించవచ్చు. RAC (Reservation Against Cancellation) ఇకపై అందుబాటులో ఉండదు. దీని అర్థం ఈ రైలులో కన్ఫర్మ్‌ టిక్కెట్లు మాత్రమే జారీ అవుతాయి. వెయిటింగ్ లిస్ట్‌లు లేదా పాక్షికంగా కన్ఫర్మ్‌ సీట్లు ఉండవు.

కన్ఫర్మ్ టిక్కెట్లు మాత్రమే.. RAC ఉండదు:

జనవరి 9న రైల్వే బోర్డు జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. వందే భారత్ స్లీపర్ రైలులో అందుబాటులో ఉన్న అన్ని బెర్త్‌లు అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP) మొదటి రోజు నుండి బుకింగ్ కోసం తెరిచి ఉంటాయి. ఈ రైలులో RAC, వెయిటింగ్ లిస్ట్ లేదా పాక్షికంగా ధృవీకరించిన టిక్కెట్లు ఉండవు. సాధారణంగా ఇతర రైళ్లలో, RAC కింద ఇద్దరు ప్రయాణికులు సైడ్ లోయర్ బెర్త్‌ను పంచుకోవాలి. కానీ వందే భారత్ స్లీపర్‌లో ఇది జరగదు.

ఇది కూడా చదవండి: Petrol, Diesel Prices: ఫిబ్రవరి 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయా?

ఛార్జీ కొంచెం ఎక్కువ.. కానీ ప్రయాణం వేగంగా..

రాజధాని ఎక్స్‌ప్రెస్ వంటి ప్రస్తుత ప్రీమియం రైళ్ల కంటే వందే భారత్ స్లీపర్ రైలు ఛార్జీలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ప్రయాణం తక్కువగా ఉన్నప్పటికీ, ప్రయాణికులు కనీసం 400 కిలోమీటర్ల దూరానికి చెల్లించాల్సి ఉంటుంది.

  • 3AC ఛార్జీ: కి.మీ.కు రూ.2.40
  • 2AC ఛార్జీ: కి.మీ.కు రూ.3.10
  • 1AC ఛార్జీ: కిమీకి రూ.3.80 (GST అదనం)

కనీస, సుదూర ఛార్జీలు:

  • 400 కి.మీ (కనీస ఛార్జీ)
  • 3AC: రూ.960
  • 2AC: రూ.1,240
  • 1AC: రూ.1,520
  • 1000 కి.మీ (హౌరా–గౌహతి మార్గం)
  • 3AC: రూ.2,400
  • 2AC: రూ.3,100
  • 1AC: రూ.3,800

2000 కి.మీ

  • 3AC: రూ.4,800
  • 2AC: రూ.6,200
  • 1AC: రూ.7,600

ధరలను పోల్చి చూస్తే రాజధాని ఎక్స్‌ప్రెస్ కిలోమీటరుకు ఛార్జీ కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ వందే భారత్ స్లీపర్, ఆధునికమైనది. అలాగే వేగవంతమైనదిగా ఉండటం వల్ల కాస్త ఛార్జీలు ఎక్కువగానే ఉంటాయి. అందులోనూ సదుపాయాలు కూడా లగ్జరీగా ఉంటాయి.

రూట్ 1, సమయం ఆదా చేసుకోండి:

మొదటి వందే భారత్ స్లీపర్ రైలు హౌరా-గువహతి మార్గంలో నడుస్తుంది. దీనిని వచ్చే వారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. ఈ రైలు ప్రస్తుత ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే దాదాపు మూడు గంటలు ముందుగానే ప్రయాణిస్తుంది. ఇది రాత్రిపూట ప్రారంభమై ఉదయం దాని గమ్యస్థానానికి చేరుకుంటుంది.

రైలు ఎక్కడ ఆగుతుంది?

ఈ రైలు పశ్చిమ బెంగాల్‌లోని 7 జిల్లాలు – హౌరా, హుగ్లీ, తూర్పు బుర్ద్వాన్, ముర్షిదాబాద్, మాల్డా, జల్పైగురి, కూచ్ బెహార్, అస్సాంలోని కామరూప్ మెట్రోపాలిటన్, బొంగైగావ్‌లలో మొత్తం 10 స్టాప్‌లలో ఆగుతుంది.

రైలు కోచ్‌లు:

  • ఈ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి.
  • 11 కోచ్ 3AC
  • 4 కోచ్‌లు 2AC
  • 1 కోచ్ 1AC

ఈ రైలు వేగం గంటకు 180 కి.మీ. వేగంతో డిజైన్‌ చేశారు. కానీ భద్రతా కారణాల దృష్ట్యా, ఇది ప్రస్తుతం గంటకు 130 కి.మీ. వేగంతో నడుస్తుంది. రాజధాని రైళ్లు సగటున గంటకు 80–90 కి.మీ.

లగ్జరీ, భద్రత కొత్త స్థాయి:

వందే భారత్ స్లీపర్ ప్రత్యేకంగా సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇందులో కుషన్డ్ బెర్త్‌లు, ఆటోమేటిక్ డోర్లు, తక్కువ శబ్దం కలిగిన సస్పెన్షన్ సిస్టమ్, ఆధునిక డ్రైవర్ క్యాబ్, ఏరోడైనమిక్ డిజైన్ ఉన్నాయి. ఈ రైలులో షీల్డ్ ప్రొటెక్షన్ సిస్టమ్, ఎమర్జెన్సీ టాక్-బ్యాక్ సిస్టమ్, మెరుగైన పారిశుధ్యం కోసం క్రిమిసంహారక వంటి సాంకేతికత కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Gold Price Today: ఏపీ, తెలంగాణలో 10 గ్రాముల బంగారం ధర ఎంత ఉందో తెలుసా? వెండి పరిస్థితి ఏంటి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి