అత్యాధునిక టెక్నాలజీతో, సదుపాయాలతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ టికెట్ ధర కాస్త ఎక్కువైనా అతి తక్కువ సమయంలోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది మోడీ సర్కార్. రానున్న రెండు మూడు నెలల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ఈ రైళ్లను ప్రవేశపెట్టనుంది. అయితే మామూలుగా రైళ్ల టికెట్స్‌ను తీసుకోవడం అందరికి తెలిసిందే. కానీ ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు టికెట్ ఎలా తీసుకోవాలనే అనుమానం చాలా మందికి వస్తుంటుంది. ఇతర టికెట్ల మాదిరిగానే ఈ రైలు టికెట్ తీసుకోవచ్చు. ఢిల్లీ – వారణాసి వందే భారత్ రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించింది. 12 గంటల నుండి 8 గంటలకు తగ్గించడానికి ఢిల్లీ-కత్రా వందే భారత్ రైలును ప్రారంభించింది.
రైలు ప్రయాణికులు రైల్వే స్టేషన్‌లలో ఉన్న టికెట్ కౌంటర్లు లేదా ఐఆర్‌సీటీసీ వెబ్ పోర్టల్, రైల్ కనెక్ట్ యాప్ ద్వారా కూడా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ముందుగా irctc.co.inలో ఐఆర్‌సీటీసీ ఇ-టికెటింగ్ వెబ్‌సైట్‌కి వెళ్లి లాగిన్ కావాలి. అపై టికెట్ బుక్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడికి అనే వివరాలపై క్లిక్ చేయండి. అలాగే మీ ప్రయాణ తేదీని ఎంచుకోండి. తర్వాత వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఎంచుకోండి. అలాగే మీరు ప్రయాణించే రైలులో AC చైర్ కారు లేదా ఎగ్జిక్యూటివ్‌ని ఎంచుకోండి. తర్వాత ప్రయాణికుల వివరాలను నమోదు చేసి సమీక్షించండి. చివరగా చెల్లింపు ఆప్షన్‌పై క్లిక్ చేసి టికెట్ ఛార్జీ ఎంత ఉంటే అంత చెల్లించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి