Telugu News Business US India Trade Deal: Tariffs Cut to 18 Percent Boosting Bilateral Ties and Economy
Tariff Relief: భారత్ అమెరికా మధ్య డీల్ సెట్! ఒక్క ఫోన్ కాల్‌తో రాత్రికి రాత్రే మారిపోయిన 5 అంశాలు!
నెలల అనిశ్చితి తర్వాత అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం కుదిరింది. మోదీ-ట్రంప్ చర్చల ఫలితంగా, అమెరికా భారత వస్తువులపై సుంకాలు 25 శాతం నుండి 18 శాతానికి తగ్గించింది. రష్యా చమురు కొనుగోళ్ల ప్రభావం కూడా తగ్గింది. ఇంజనీరింగ్, వస్త్ర రంగాలకు ప్రయోజనం.
నెలల తరబడి అనిశ్చితి ఎండ్ కార్డ్ పడింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం సోమవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన ఫోన్ కాల్ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్ష ప్రకటనతో ముగిసింది . ట్రంప్ స్వయంగా ఒప్పందానికి సంబంధించిన విషయాలు వెల్లడించారు. వ్యక్తిగత దౌత్యం, తక్షణ చర్యల ఫలితంగా ఈ డీల్‌ను రూపొందించారు.
ఈ ఉదయం భారత ప్రధాని మోదీతో మాట్లాడటం గౌరవంగా ఉంది. ఆయన నా గొప్ప స్నేహితులలో ఒకరు. ఆయన దేశానికి శక్తివంతమైన, గౌరవనీయ నాయకుడు. ప్రధానమంత్రి మోదీతో స్నేహం, ఆయనపై గౌరవం కారణంగా ఆయన అభ్యర్థన మేరకు వెంటనే అమలులోకి వచ్చేలా మేం అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకరించాం. డీల్ తర్వాత సుంకాలు తగ్గిస్తున్నాం. 25 శాతం నుండి 18 శాతానికి తగ్గిస్తున్నాం అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో వేదికగా వెల్లడించారు.
ఈ వాణిజ్య ఒప్పంద ఐదు ముఖ్య విషయాలు ఇవే
భారత్‌పై అమెరికా విధించిన సుంకాలు 18 శాతానికి తగ్గాయి. ఇక అమెరికా దిగుమతి చేసుకునే భారతీయ వస్తువులపై నిర్దిష్ట సుంకాన్ని 25 శాతం నుండి 18 శాతానికి తగ్గించింది.
రష్యా చమురు కొనుగోలును నిలిపివేయడానికి భారత్ అంగీకరించినందున, భారత దిగుమతులపై విధించిన అదనంగా 25 శాతం సుంకాలను కూడా అమెరికా తగ్గించింది.
భారత్, రష్యా చమురు కొనుగోళ్లను కొనసాగిస్తోందని పేర్కొంటూ, అమెరికాకు ఎగుమతి చేసిన భారతీయ వస్తువులపై 50 శాతం వరకు సుంకాలను ట్రంప్ ప్రకటించిన ఆగస్టు 2025లో కనిపించిన పెరుగుదలను ఈ ఒప్పందం తగ్గించింది. దీంతో ఇంజనీరింగ్ వస్తువులు, వస్త్రాలు, రసాయనాలు, ఆటో భాగాలు వంటి రంగాలకు ప్రయోజనం చేకూరనుంది.
500 బిలియన్ డాలర్లకు పైగా విలువైన అమెరికా వస్తువులను భారత్ కొనుగోలు చేయనుంది. టారిఫ్ రిలీఫ్ కోసం అమెరికా నుండి పెద్ద ఎత్తున కొనుగోళ్లకు మోడీ కట్టుబడి ఉన్నారని ట్రంప్ అన్నారు. భారత్ 500 బిలియన్ డాలర్ల విలువైన US ఇంధనం, సాంకేతికత, వ్యవసాయం, బొగ్గు, అనేక ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని ట్రంప్ ప్రకటించారు.
ఈ ఒప్పందాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. సుంకాలను తగ్గించినందుకు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నా ప్రియమైన స్నేహితుడు అధ్యక్షుడు ట్రంప్‌తో ఈరోజు మాట్లాడటం చాలా బాగుంది. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై ఇప్పుడు 18 శాతం తగ్గిన సుంకం ఉంటుందని తెలిసి సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన ప్రకటన చేసినందుకు 1.4 బిలియన్ల భారతీయుల తరపున అధ్యక్షుడు ట్రంప్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు అని ఆయన అన్నారు.