Hyundai Tucson: హ్యూందాయ్‌ నుంచి మరో సరికొత్త ఎస్‌యూవీ.. ఫీచర్లు, స్పెక్స్‌ ఇవి..

| Edited By: TV9 Telugu

Nov 25, 2023 | 5:27 PM

కొరియన్‌ కార్‌ మేకర్‌ హ్యుందాయ్ కూడా సరికొత్త ఎస్‌యూవీని మన దేశంలో లాంచ్‌ చేసింది. దానిపై టక్సన్‌ ఫేస్‌లిఫ్ట్‌. అదేంటి ఇప్పటికే ఇది ఉంది కదా అని ఆలోచిస్తున్నారా. నిజమే హ్యూందాయ్‌ కంపెనీ టక్సన్‌ ఫేస్‌లిఫ్ట్‌ మన దేశంలో 2022లో ఆవిష్కరించింది. ఇప్పుడు ఈ ఆటోమేకర్ గ్లోబల్ మార్కెట్ కోసం ఈ ఎస్‌యూవీని అప్‌డేట్‌ చేసి 2024 మోడల్‌గా రీలాంచ్‌ చేసింది.

Hyundai Tucson: హ్యూందాయ్‌ నుంచి మరో సరికొత్త ఎస్‌యూవీ.. ఫీచర్లు, స్పెక్స్‌ ఇవి..
Hyundai Tucson Facelift
Follow us on

గ్లోబల్‌ వైడ్‌గా ఎస్‌యూవీ వాహనాలకు డిమాండ్‌ పెరుగుతోంది. సౌకర్యాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు, ఎక్కువ దూరాలు తరచూ ప్రయాణం చేసేవారు ఎస్‌యూవీ కార్లను కోరుకుంటున్నారు. ఈ క్రమంలో అన్ని దిగ్గజ బ్రాండ్లు ఎస్‌యూవీల ఉత్పత్తిపై దృష్టిపెట్టాయి. ఇదే క్రమంలో ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం, కొరియన్‌ కార్‌ మేకర్‌ హ్యుందాయ్ కూడా సరికొత్త ఎస్‌యూవీని మన దేశంలో లాంచ్‌ చేసింది. దానిపై టక్సన్‌ ఫేస్‌లిఫ్ట్‌. అదేంటి ఇప్పటికే ఇది ఉంది కదా అని ఆలోచిస్తున్నారా. నిజమే హ్యూందాయ్‌ కంపెనీ టక్సన్‌ ఫేస్‌లిఫ్ట్‌ మన దేశంలో 2022లో ఆవిష్కరించింది. ఇప్పుడు ఈ ఆటోమేకర్ గ్లోబల్ మార్కెట్ కోసం ఈ ఎస్‌యూవీని అప్‌డేట్‌ చేసి 2024 మోడల్‌గా రీలాంచ్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఈ సరికొత్త అప్‌డేటెట్‌ టక్సన్ ఫేస్‌లిఫ్ట్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

టక్సన్ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్‌టీరియర్‌..

ఈ కారు ఫీచర్లను హ్యూందాయ్‌ అధికారికంగా వెల్లడించలేదు. అయితే మార్కెట్‌ వర్గాల అంచనా ప్రకారం ఈ మార్పులుండవచ్చని అంచనా.. అవేంటంటే.. ఈ టక్సన్‌ ఫేస్‌ లిఫ్ట్‌ కారులో డిజైన్, స్టైలింగ్ పరంగా కొద్దిపాటి మార్పులు మనం గమనించవచ్చు. సిగ్నేచర్ పారామెట్రిక్ డిజైన్‌తో కొత్త ఫ్రంట్ గ్రిల్‌ ఉంది. దీని వల్ల ఇది మరింత షార్ప్‌, బోల్డ్‌గా కనిపిస్తుంది. అలాగే మోడిఫై చేసిన ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌ ఉంది. ముందువైపు బంపర్ ట్వీక్ చేసి ఉంది. కొత్త స్కిడ్ ప్లేట్‌ అమర్చారు. కొత్త సెట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

టక్సన్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్..

ఈ కారు లోపల అత్యంత ముఖ్యమైన మార్పు ఎంటంటే కొత్త డ్యాష్‌బోర్డ్ లే అవుట్. ఇది ఒక జత 12.3-అంగుళాల స్క్రీన్‌లను పొందుతుంది. డ్రైవర్ డిస్‌ప్లే కోసం, ఇంకోటి ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ కోసం ఏర్పాటు చేశారు. గేర్ లివర్‌తో కొత్త త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను పొందుతుంది. తద్వారా సెంటర్ కన్సోల్‌లో మరింత నిల్వ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. అంతేకాక ఎయిర్‌కాన్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ల కోసం ఫిజికల్‌ కంట్రోల్స్‌ ను ఇచ్చారు. ఈ ఫీచర్లను హ్యుందాయ్‌ అధికారికంగా వెల్లడించలేదు. అయితే

ఇవి కూడా చదవండి

ఇంజిన్, స్పెసిఫికేషన్లు..

ఇప్పటి వరకూ హ్యూందాయ్ తన తాజా ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ఇంజిన్, స్పెక్స్‌ను వెల్లడించలేదు. అంతర్జాతీయ మార్కెట్ కోసం, ఫేస్‌లిఫ్టెడ్ ఎస్‌యూవీ అవుట్‌గోయింగ్ మోడల్ వలె అదే పవర్‌ట్రెయిన్‌లతో కొనసాగుతుందని అంచనా. ఇది పెట్రోల్, డీజిల్, మైల్డ్-హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఇంజిన్ ఎంపికలతో కొనసాగే అవకాశం ఉంది. 2.0-లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వరుసగా ఆరు-స్పీడ్, ఎనిమిది-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.
దీని ధర రూ. 29లక్షలు(ఎక్స్‌ షోరూం) ఉంటుందని అంచనా.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..