Import duty on EVs: ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకం తగ్గించే దిశలో ప్రభుత్వం.. “టెస్లా”కు రూటు క్లియర్ అయినట్టేనా?

|

Aug 10, 2021 | 4:07 PM

ఇటీవల కాలంలో ఆటోమొబైల్ రంగంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఎలక్ట్రిక్ కార్లు. మరీ ముఖ్యంగా టెస్లా కార్ల గురించి. ఎందుకంటే.. విదేశీ ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతిపై భారీ సుంకాన్ని విధించింది భారత ప్రభుత్వం.

Import duty on EVs: ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకం తగ్గించే దిశలో ప్రభుత్వం.. టెస్లాకు రూటు క్లియర్ అయినట్టేనా?
Import Duty On Evs
Follow us on

Import duty on EVs: ఇటీవల కాలంలో ఆటోమొబైల్ రంగంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఎలక్ట్రిక్ కార్లు. మరీ ముఖ్యంగా టెస్లా కార్ల గురించి. ఎందుకంటే.. విదేశీ ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతిపై భారీ సుంకాన్ని విధించింది భారత ప్రభుత్వం. దీంతో అంతర్జాతీయంగా పేరుపొందిన టెస్లా వంటి కంపెనీల ఎలక్ట్రిక్ కార్లు మన దేశంలోకి వచ్చే అవకాశాలు సన్నగిల్లాయి. కానీ, స్వదేశీ తయారీని ప్రోత్సహించడం కోసమే ఈ దిగుమతి సుంకాన్ని ఎక్కువగా విధించినట్టు ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల టెస్లా కంపెనీ సిఈవో ఎలాన్ మస్క్ ప్రభుత్వం తన విధానంపై పునరాలోచించుకోవాలని కోరారు. కానీ, అప్పట్లో ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించలేదు. అయితే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఎలక్ట్రిక్ వాహనాలను దిగుమతి చేసుకునేందుకు 40,000 డాలర్ల లోపు ఖరీదు ఉన్నవాటికి ఇప్పటివరకూ విధిస్తున్న 60 శాతం పన్నును 40 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా అంతకు మించి ఖరీదైన ఎలక్ట్రిక్ వాహనాల పై దిగుమతి సుంకం ఇప్పటివరకూ 100 శాతంగా ఉంది. దీనిని 60 శాతానికి తగ్గించాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది.  ఈ విషయాన్ని  ప్రభుత్వ అధికారులు రాయిటర్స్‌కి చెప్పారు. ఇది ఇంకా పూర్తిగా నిర్ణయించలేదు. ప్రస్తుతం ఈ సుంకాల తగ్గింపుపై  పరిశీలన జరుగుతోంది.

దేశంలో లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకం చాలా తక్కువ.

భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద కార్ల మార్కెట్. ప్రతి సంవత్సరం దాదాపు 30 లక్షల వాహనాలు ఇక్కడ అమ్ముడవుతాయి. వీటిలో చాలా వరకు 20 వేల డాలర్ల కంటే తక్కువ ఖరీదైనవి.  పరిశ్రమ అంచనాల ప్రకారం, మొత్తం వాహన విక్రయాలతో పోలిస్తే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఏమీ లేవు. లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాలు ఇక్కడ నామమాత్రపు ధరలకు విక్రయాలు జరుగుతాయి.

టెస్లా విషయానికొస్తే, ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాన్ని 40%కి తగ్గించడం ద్వారా, వారి వాహనాలు ఆర్థికంగా అనుకూలంగా మారతాయని, వాటి అమ్మకాలు పెరుగుతాయని ఇటీవల చెప్పింది. అయితే, దేశీయ ఆటోమొబైల్ కంపెనీలలో ప్రభుత్వం అలా చేయడం వలన దేశీయ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించే ఆలోచనకు విరుద్ధంగా ఉంటుందా అనే సందేహం నెలకొంది.

నీతి ఆయోగ్ ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోంది

కేవలం ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతి సుంకం తగ్గించాలనే ఆలోచన ఉందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. అందువల్ల, పెట్రోల్, డీజిల్ వాహనాలను తయారు చేసే స్థానిక ఆటోమొబైల్ కంపెనీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆర్థిక, వాణిజ్య మంత్రిత్వ శాఖలతో పాటు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని థింక్ ట్యాంక్ అయిన నీతి ఆయోగ్ ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోందని ఆయన చెప్పారు.

దేశీయ కంపెనీలకు ప్రయోజనం లభిస్తే ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గించవచ్చు

దేశంలో టెస్లా వంటి కంపెనీల వాహనాల రాక దేశీయ కంపెనీలకు ఎలక్ట్రిక్ వాహనాల దేశీయ ఉత్పత్తిని ప్రారంభించడానికి సహాయపడటం లేదా దానికి కాల పరిమితిని నిర్ణయించడం వంటి ప్రయోజనాలను అందిస్తే, ప్రభుత్వం దిగుమతులను కొంతవరకూ ప్రోత్సహించే ఆలోచన చేయవచ్చు. అందుకోసమే దిగుమతి సుంకం తగ్గింపు పై కసరత్తులు చేస్తోందని అధికారులు అంటున్నారు.

దిగుమతి చేసుకున్న వాహనాలపై వ్యాపారం నిర్వహిస్తే, టెస్లా భారతదేశంలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయవచ్చు

టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ గత నెలలో చేసిన ట్వీట్‌లో, దిగుమతి చేసుకున్న వాహనాల ద్వారా తమ వ్యాపారం ఇక్కడ వృద్ధి చెందినట్లయితే, భారత్‌లో తమ కార్ల ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఆలోచిస్తామని చెప్పారు. ప్రస్తుతం ముందడుగు వేయడానికి ఇక్కడ ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకం చాలా ఎక్కువ ఉందని ఆయన అన్నారు.

Also Read: Vivad Se Vishwas Scheme: వివాద్ సే విశ్వాస్ పథకం అంటే ఏమిటి.. ప్రభుత్వానికి రూ .53,684 కోట్ల ఆదాయం..!

Best Recharge Plans: కేవలం రూ.1999కే ఏడాది పాటు వ్యాలిడిటీ.. అన్ లిమిటెడ్ కాలింగ్.. 600 జీబీ డేటా..!