SBI Alert: మీకు ఎస్‌బీఐ ఖాతా ఉందా.? అయితే సెప్టెంబర్ 30లోపు ఇలా చేయండి.. లేదంటే కష్టమే!

ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు ముఖ్యమైన అలెర్ట్ ఇచ్చింది. సెప్టెంబర్ 30వ తేదీలోగా...

SBI Alert: మీకు ఎస్‌బీఐ ఖాతా ఉందా.? అయితే సెప్టెంబర్ 30లోపు ఇలా చేయండి.. లేదంటే కష్టమే!
Sbi Bank
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 10, 2021 | 5:10 PM

ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు ముఖ్యమైన అలెర్ట్ ఇచ్చింది. సెప్టెంబర్ 30వ తేదీలోగా పాన్ కార్డు-ఆధార్ కార్డు లింక్ చేయాలని.. లేనిపక్షంలో బ్యాంకింగ్ సదుపాయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.

ఆధార్‌తో పాన్‌ కార్డును లింక్ చేయడం తప్పనిసరి. సెప్టెంబర్ 30లోపు పాన్ కార్డు, ఆధార్‌లను లింక్ చేయకపోతే, పాన్ కార్డు ఇన్‌యాక్టివ్ కావడమే కాకుండా.. మరే ఇతర లావాదేవీలకు పని చేయదు. కరోనా, ఇతరత్రా కారణాల వల్ల పాన్ కార్డు, ఆధార్ లింక్‌ను సెప్టెంబర్ 30వ తేదీ వరకు బ్యాంక్ పొడిగించిన సంగతి తెలిసిందే. అకౌంట్ ఓపెనింగ్, నగదు జమ చేయడం, డీమ్యాట్ ఖాతాలు తెరవడం, స్థిరాస్తుల లావాదేవీలు, ఇతరత్రా ఆర్థిక లావాదేవీలన్నింటికీ పాన్ కార్డు తప్పనిసరి అని బ్యాంకు స్పష్టం చేసింది.

SMS ద్వారా లింక్ చేయండి..

మీరు SMS ద్వారా పాన్-ఆధార్‌ను లింక్ చేయవచ్చు. UIDPAN అని టైప్ చేసి<SPACE> 12 అంకెల ఆధార్ నెంబర్ <SPACE> 10 అంకెల PAN నెంబర్ టైప్ చేసి 567678 లేదా 56161కు మెసేజ్ చేయండి.

Also Read:

సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!

బైక్ డూమ్ నుంచి వింత శబ్దాలు.. తెరిచి చూస్తే షాక్.. నెట్టింట వైరల్!