ఐఐటీ అమ్మాయిల వినూత్న ఆలోచన.. ఆన్‌లైన్‌లో వాటిని అమ్ముతూ రూ.500 కోట్లు సంపాదన.
ఐఐటీల్లో చదువుకున్న వారు సాధారణంగా ఏం చేయాలనుకుంటున్నారు.? ఏముంది అంతర్జాతీయ ఐటీ కంపెనీలో ఉద్యోగం సాధించి, నెలకు ఆరెంకల జీతాన్ని పొందాలని ఆశిస్తుంటారు. దాదాపు చాలా మంది ఆలోచన ఇలాగే ఉంటుంది. అయితే ఓ ఇద్దరు యువతులు మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించారు...

ఐఐటీల్లో చదువుకున్న వారు సాధారణంగా ఏం చేయాలనుకుంటున్నారు.? ఏముంది అంతర్జాతీయ ఐటీ కంపెనీలో ఉద్యోగం సాధించి, నెలకు ఆరెంకల జీతాన్ని పొందాలని ఆశిస్తుంటారు. దాదాపు చాలా మంది ఆలోచన ఇలాగే ఉంటుంది. అయితే ఓ ఇద్దరు యువతులు మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించారు. అసలు ఊహకు కూడా అందని విధంగా ఆలోచించి కోట్లు గడిస్తున్నారు. ఎవరి కిందో పనిచేసే కంటే తామే నలుగురికి ఉద్యోగాలు ఇవ్వాలని డిసైడ్ అయి సత్తా చాటుతున్నారు. ఇంతకీ ఎవరా యువతులు.? వారి కథ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
నీతూ యాదవ్, కీర్తి జంగ్రా అనే ఇద్దరు యువతులు ఢిల్లీ ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కాలేజీ సమయంలో వీరిద్దరూ ఒకే రూమ్ మేట్స్. చదువు పూర్తి చేసిన అనంతరం ‘యానిమల్ టెక్నాలజీస్’ అనే సంస్థను స్థాపించారు. ఆన్‌లైన్‌లో అన్ని రకాల వస్తువులను అమ్ముతున్న తరుణంలో పశువులను ఎందుకు అమ్మకూడదనే ఆలోచనతో ఈ కంపెనీని ప్రారంభించారు. బెంగళూరులోని ఒక చిన్న అద్దె గదిలో ఉంటూ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా యానిమాల్ అనే యాప్‌ను రూపొందించారు.
ఈ యాప్ ద్వారా పశువుల అమ్మకాలు, కొనుగోలు జరుపుతారు. రైతులు ఆన్‌లైన్‌లోనే తమ పశువులను అమ్ముకోవచ్చు, కొనుగోలు సైతం చేయొచ్చు. యానిమల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సేవలు అందిస్తున్న ఈ కంపెనీలో షాదీ.కామ్ ఫౌండర్ అనుపమ్ మిట్టల్, జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయెల్ వంటి ప్రముఖులు పెట్టుబడులు పెట్టడం విశేషం. ప్రస్తుతం ఈ కంపెనీ ఆదాయం ఏకంగా రూ. 565 కోట్లకు చేరడం విశేషం.



మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..