Cheapest Electric Car: ఎలక్ట్రిక్ కార్ ప్రియులకు శుభవార్త.. అత్యంత తక్కువ ధరలో MG E230..

Cheapest Electric Car: రోజురోజుకూ ఇంధన ధరలు పెరిగిపోవటంతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. దీనికి తోడు వాతావరణ కాలుష్యంపై ప్రజల్లో అవగాహన పెరగటం వల్ల వాహనాల విషయంలో వారి అభిరుచులను మార్చుకుంటున్నారు.

Cheapest Electric Car: ఎలక్ట్రిక్ కార్ ప్రియులకు శుభవార్త.. అత్యంత తక్కువ ధరలో MG E230..
Electric Car

Updated on: Mar 14, 2022 | 12:13 PM

Cheapest Electric Car: రోజురోజుకూ ఇంధన ధరలు పెరిగిపోవటంతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. దీనికి తోడు వాతావరణ కాలుష్యంపై ప్రజల్లో అవగాహన పెరగటం వల్ల వాహనాల విషయంలో వారి అభిరుచులను మార్చుకుంటున్నారు. ఎలక్ట్రిక్ టూవీలర్ల కన్నా ఎలక్ట్రిక్ కార్ల వినియోగం చాలా మెల్లగా ఉండనుందని తెలుస్తోంది. ఎందుకంటే వాటి తయారీ తక్కువ స్థాయిలో ఉండటంతో పాటు ప్రస్తుతం ధరలు అధికంగా ఉండటమే ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. ఈ పరిణామాలు రానున్న కాలంలో మారనుంది. ఈ తరుణంలో కార్ల దిగ్గజ కంపెనీ ఎంజీ తన కొత్త E230 ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకొచ్చించిది. నగర వినియోగదారులే లక్ష్యంగా దీనిని రూపొందించినట్లు వెల్లడించింది. దీని ధర రూ. 10 లక్షలకంటే తక్కువగానే ఉండనుంది. దేశీయ మార్కెట్లో ఇది ఇప్పటివరకు అత్యంత తక్కువ ఖరీదైన ఎలక్ట్రిక్ కారుగా నిలవనుంది.

MG E230 EV SAIC-GM-వులింగ్ గ్లోబల్ స్మాల్ ఎలక్ట్రిక్ కార్ (GSEV) ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడుతోంది. ఇది కేవలం రెండు-సీట్ల వాహనం అయినప్పటికీ.. పెద్ద వీల్‌బేస్ కలిగి ఉంది. వాహనం 20kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉండటం వల్ల 150 కిమీల మైలేజ్ అందించనుందని కంపెనీ వెల్లడించింది. ఈ కారును 2023 సంవత్సరం ప్రారంభంలో మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు భారత విభాగం మ్యానేజింగ్ డైరెక్టర్ రాజీవ్ ఛాబ వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు ప్రస్తుతం దేశంలో అత్యంత తక్కువ ధరలో టాటా టిగర్ ఈవీ రూ.12 లక్షల ధరలో అందుబాటులో ఉంది.

ఇవీ చదవండి..

Vehicle Registration: ఆ వాహనాల రెజిస్ట్రేషన్ రేట్ల పెంపు.. అక్కడి వాహనదారులకు వెసులుబాట్లు..

Money Saving Ideas: డబ్బు సేవ్ చేయటంలో ఈ టిప్స్ పాటించండి.. ఆర్థిక మెరుగుదలకు ఇలా చేయండి..

Market Opening: స్వల్ప లాభాల్లో ప్రారంభమైన భారత మార్కెట్లు.. పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగిస్తున్న FPIలు..