
టీవీఎస్ మోటార్ భారత మార్కెట్‌లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ కంపెనీ ఇటీవల రిలీజ్ చేసిన టీవీఎస్ ఐ క్యూబ్ దేశంలో ప్రారంభించిన తర్వాత ఆ స్కూటర్‌కు మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో కంపెనీ కొత్త స్కూటర్లను రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ కొత్త స్కూటర్ బహుశా జూపిటర్ పెట్రో స్కూటర్‌కు ఎలక్ట్రిక్ వెర్షన్ కావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే టీవీఎస్ కంపెనీ జూపిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ పేటెంట్ కోసం కూడా దరఖాస్తు చేసిందని పేర్కొంటున్నాయి. త్వరలోనే టీవీఎస్ జూపిటర్ ఎలక్ట్రిక్ వెర్షన్ భారతదేశంలో ప్రారంభించే అవకాశం ఉంది. కొత్త టీవీఎస్ జూపిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఉంటుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ స్కూటర్జనవరి 2024లో పరిచయం చేస్తారని అంచనా వేస్తున్నారు.
టీవీఎస్ జూపిటర్ ఈ-స్కూటర్ గురించి లీకైన వివరాలను బట్టి ఈ-స్కూటర్‌కు ఐ-క్యూబ్ మాదిరిగానే బ్యాటరీ లైఫ్ ఉంటుందని భావిస్తున్నారు. అంటే దాదాపు 2.25 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంటుంది, ఇది 3.0 కేడబ్ల్యూ శక్తిని, 140 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఐ క్యూబ్ 4.4 కేడబ్ల్యూ సెటప్‌ను కలిగి ఉంది. అంటే ఈ స్కూటర్ కేవలం 4.2 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మార్కెట్‌లో ఏర్పడే భారీ పోటీ కారణంగా జూపిటర్ ఈ-స్కూటర్‌కు కంపెనీ పెద్ద బ్యాటరీని అందించే అవకాశం ఉంది. ఇందుకోసం కంపెనీ కొత్త మిడ్-మౌంటెడ్ మోటార్‌ను అభివృద్ధి చేస్తోందని నివేదికలు వెల్లడిస్తున్నయి. ఈ మోటర్ కొత్త ఈ-స్కూటర్‌లో ఉంటుందని భావిస్తున్నారు. కంపెనీ కొత్త మోటారు కోసం పేటెంట్ కూడా దాఖలు చేసింది. ఇవన్నీ కొత్త టీవీఎస్ జూపిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ 5 కేడబ్ల్యూ నుంచి 25 కేడబ్ల్యూ వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. టీవీఎస్ జూపిటర్ ఎలక్ట్రిక్ కొత్త మిడ్-మౌంటెడ్ మోటారుతో మెరుగైన మొత్తం రైడ్ అనుభవాన్ని అందిస్తుందని పేర్కొంటున్నారు.
టీవీఎస్ జూపిటర్ ఎలక్ట్రిక్‌లో పిల్లర్ గ్రాబ్ రైల్, ఫ్లాట్ ఫుట్‌బోర్డ్‌తో కూడిన ఫ్లాట్-టైప్ సీటు ఉండవచ్చని అంచనా. ఈ స్కూటర్ మౌంటెడ్ ఫ్రంట్ ఆప్రాన్ కలిగి ఉంటుంది. ఇది ఎల్ఈడీ లైటింగ్, అల్లాయ్ వీల్ సెటప్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ డ్యాష్‌బోర్డ్, హ్యాండిల్‌బార్‌పై హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌లు, సింగిల్-పీస్ శాడిల్, కమ్యూటర్ స్కూటర్ విజువల్ అప్పీల్ వంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. భారతదేశంలో కొత్త టీవీఎస్ జూపిటర్ ఎలక్ట్రిక్ ధర, లభ్యతను వాహనం ఆవిష్కరణ సమయంలో కంపెనీ వెల్లడిస్తుంది. అయితే ఈ స్కూటర్ ధర సుమారు రూ. లక్ష వరకు ఉంటుందని అంచనా. పెట్రోల్ స్కూటర్ సెగ్మెంట్ లానే యాక్టివా జూపిటర్ కూడా ఈవీసెగ్మెంట్‌లో ప్రత్యర్థిగా కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి