TV9 Sweet Home Expo: మీ సొంతింటి కల నెరవేరేందుకు అద్భుతమైన వేదిక టీవీ9 స్వీట్ హోమ్ ఎక్స్‌పో

TV9 Sweet Home Real Estate and Interiors Expo: సంపాదించే ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత పొదుపు చేయాలని భావిస్తుంటారు. దీంతో డబ్బును వివిధ రంగాల్లో ఇన్వెస్టమెంట్లు చేస్తుంటారు. ఇలాంటి వాటిలో రియల్‌ ఎస్టేట్‌ మొదటి వరుసలో ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టిన వారు నష్ట పోయిన సందర్భాలు లేవని చెబుతుంటారు..

TV9 Sweet Home Expo: మీ సొంతింటి కల నెరవేరేందుకు అద్భుతమైన వేదిక టీవీ9 స్వీట్ హోమ్ ఎక్స్‌పో

Updated on: Mar 12, 2025 | 4:00 PM

TV9 Sweet Home Real Estate and Interiors Expo: దశాబ్ద కాలంగా మీ రియల్ ఎస్టేట్ కలలకు దిక్సూచి గా వున్న టీవీ9 స్వీట్‌హోమ్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది. హైటెక్ సిటీలో జరిగే ఈ ఎక్స్‌పోకి వచ్చి మీ సందేహాలన్నీ తీర్చుకోవచ్చు. నచ్చిన ప్రాపర్టీ సెలక్ట్‌ చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో జరగనున్న అతిపెద్ద రియల్‌ ఎస్టేట్‌ ఎక్స్‌పో టీవీ9 స్వీట్‌హోమ్. మీ సొంతింటి కలను నిజం చేసేందుకు అద్భుతమైన వేదిక. ఈ ఎక్స్‌పోలో అపార్ట్‌మెంట్లు, ఓపెన్‌ ప్లాట్లు, విల్లాస్‌, ఫామ్‌ ల్యాండ్స్‌, రెసిడెన్షియల్ & కమర్షియల్ ప్రాపర్టీస్‌పై… మీ ఛాయిస్‌కి చక్కని గైడెన్స్ దొరుకుతుంది. ప్రాపర్టీస్‌కి సంబంధించిన లోన్‌ సౌకర్యం కూడా ఈ ఎక్స్‌పోలో అందుబాటులో ఉంది.

సంపాదించే ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత పొదుపు చేయాలని భావిస్తుంటారు. దీంతో డబ్బును వివిధ రంగాల్లో ఇన్వెస్టమెంట్లు చేస్తుంటారు. ఇలాంటి వాటిలో రియల్‌ ఎస్టేట్‌ మొదటి వరుసలో ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టిన వారు నష్ట పోయిన సందర్భాలు లేవని చెబుతుంటారు. అందుకే మీ వద్ద డబ్బు ఉంటే ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాలని సూచిస్తుంటారు. ఇల్లు, స్థలం, అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌.. ఇలా ఏదోఒకదానిలో ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచనలో చాలా మంది ఉంటారు. అయితే చాలా మంది డబ్బు ఉంటుంది. కానీ ఎక్కడ పెట్టుబడి పెట్టాలి..? ఎలాంటి మార్గాల్లో పెట్టాలి? ఇలాంటి సందేహాలు చాలా మందిలో వస్తుంటాయి. అలాంటి వారి సందేహాలను నివృత్తి చేసేందుకు Tv9 తెలుగు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

2025 మార్చి 22, 23వ తేదీలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు హైదరాబాద్‌లో TV9 స్వీట్ హోమ్ ఎక్స్‌పో నిర్వహిస్తోంది.  ఇది రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో “ఎగ్జిబిషన్‌ సెంటర్‌” (Hitex Exhibition Centre)లో కొనసాగనుంది. హైటెక్స్‌లో జరిగే ఈ ఎక్స్‌పోకి ప్రవేశం ఉచితం. 22, 23 తేదీల్లో జరిగే ఎక్స్‌పోను సద్వినియోగం చేసుకోండి.

ఇది హైదరాబాద్‌లో బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో. ఇందులో రియల్ ఎస్టేట్ కు సంబంధించి మీకున్న అన్ని అనుమానాలను క్లియర్‌ చేసుకోవచ్చు. అలాగే వివిధ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. ఇందులో అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్లు, విల్లాలు, ఓపెన్ ప్లాట్‌లు, రెసిడెన్షియల్ & కమర్షియల్ ప్రాపర్టీలు ఈ ఎక్స్‌పోలో తెలుసుకునే అవకాశం దక్కించుకోవచ్చు.

అలాగే మీరు పెట్టే పెట్టుబడులను సైతం ఎంపిక చేసుకోవచ్చు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో స్థలం కొనుగోలు చేయడం నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు కస్టమర్లకు వివిధ దశల్లో అవసరమయ్యే అన్ని రకాల సేవలకు సంబంధించిన కంపెనీల సమాచారాన్ని ఈ టీవీ9 స్వీట్‌ హోమ్‌ ఎక్స్‌పో ద్వారా తెలుసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి