Dare to Dream 2021: టీవీ9 భారత్‌వర్ష ఆధ్వర్యంలో భారతదేశపు అతిపెద్ద ఎంటర్ ప్రెన్యూరియల్ అవార్డ్స్ ఉత్సవం నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా నవంబర్ 30 వతేదీన నిర్వహించే మొదటి కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ(MSME) కార్యదర్శి బీబీ స్వైన్ కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ విషయాన్ని ఎంఎస్ఎంఈ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది.
టీవీ9, శాప్ (TV9, SAP)తో కలిసి ఆత్మనిర్భర్ భారత్‌ను ప్రారంభించే దిశగా పెద్ద అడుగు వేస్తోంది. భారతదేశంలోని ఎంఎస్ఎంఈ (MSME) రంగం అనిశ్చితులు, అంతరాయాలను నావిగేట్ చేయడంలో ఇతరులకు రోల్ మోడల్‌గా ఉంది. ఈ సాధకులను గుర్తించి, రివార్డ్ చేయడానికి, గ్లోబల్ భారత్ మూవ్‌మెంట్ క్రింద – గ్లోబల్ భారత్, డేర్2డ్రీమ్ అవార్డ్స్ ను టీవీ9 భారత్ వర్ష ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా టీవీ9 భారత్ వర్ష ఆధ్వర్యంలో భారతదేశపు అతిపెద్ద ఎంటర్ ప్రెన్యూరియల్ అవార్డ్స్ ఉత్సవం నిర్వహిస్తారు.
ఈ అవార్డుల 3వ సీజన్ ప్రతికూలతను అడ్వాంటేజ్‌గా మార్చిన పరిశ్రమ రత్నాలను గుర్తించడానికి ఉద్దేశించారు. ఇందులో భాగంగా 10 విభాగాల్లో 150 అవార్డులు ఇస్తారు.
స్వదేశీ సంస్థల విజయాన్ని పురస్కరించుకుని, ఈ కల్లోల సమయంలో తమ సంస్థలను ముందుకు నడిపించడంలో అగ్రగాములుగా నిలిచినా వ్యాపార నాయకులను గుర్తిస్తూ, స్వదేశీ సంస్థల విజయాన్ని పురస్కరించుకుని డేర్ టు డ్రీం (Dare2Dream) అవార్డ్స్ మూడో సీజన్ నిర్వహించనున్నారు.
ఈ అవార్డులు పరిశ్రమ వ్యాప్త అంతరాయాన్ని ఎదుర్కొన్నప్పుడు కూడా నిరంతర విజయాన్ని సాధించడానికి ఉత్పత్తి ఆవిష్కరణ, డిజిటల్ పరివర్తన, కొత్త మార్కెట్ అభివృద్ధి వ్యూహాలు, సాంకేతిక విస్తరణను ఎలా ఉపయోగించాయో ప్రదర్శించడానికి వ్యాపారాలు, ఆ వ్యాపార నాయకులకు అవకాశాన్ని అందిస్తాయి. ఒక నెల రోజుల నామినేషన్ దశ తర్వాత, ఇప్పుడు లైవ్ అవార్డ్‌ల వేడుక ప్రారంభం కాబోతోంది. నవంబర్ 30 నుండి, భారతదేశం అంతటా 8 ప్రాంతాలలో, Dare2Dream అవార్డులు వివిధ TV9 నెట్‌వర్క్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో వెబ్‌కాస్ట్ చేయబడటమే కాకుండా భారతదేశంలోని ప్రముఖ న్యూస్ ఛానెల్ TV9 Bharatvarshలో ప్రసారం చేస్తారు.
ఎంఎస్ఎంఈ ట్వీట్ ఇదే..
Watch Shri B.B. Swain, Secretary(MSME) deliver keynote address at India’s biggest Entrepreneurial Awards @TV9Bharatvarsh on 30.11.2021 at 01.00 PM pic.twitter.com/cGNCCGDfHn
— Ministry of MSME (@minmsme) November 27, 2021
ఇవి కూడా చదవండి: Tomato Price: దక్షిణాదిలో కాస్త తగ్గిన టమాటా ధర.. అక్కడ మాత్రం అదిరిపోయే రేంజిలోనే.. ఎక్కడ ఎంత రేటు ఉందంటే..
Sensex: వారాంతంలో మదుపర్లకు బిగ్ షాక్.. భారీగా పడిపోయిన సెన్సెక్స్.. కారణాలు ఇవే..