Electric scooter: ఈ బండికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు.. లైసెన్స్‌తో పనే లేదు.. ధర కూడా కేవలం రూ. 50వేలే.. పూర్తి వివరాలు
టున్వల్ స్పోర్ట్స్ 63 మినీ పేరుతో వచ్చిన ఈ బైక్ కేవలం రూ. 50,000లోపు ధరలో అద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది. దీనిలో మరో విశేషం ఏమిటంటే ఈ బైక్ ను డ్రైవ్ చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

భారతీయ ఆటో రంగంలో ఎలక్ట్రిక్ బైక్‌లు, స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో వినియోగదారులు పర్యావరణ హితమైన విద్యుత్ శ్రేణి వాహనాల వైపు చూస్తున్నారు. దీంతో దిగ్గజ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లను లాంచ్ చేస్తున్నాయి. అయితే ఈ శ్రేణి బైక్ ల ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. అనువైన బడ్జెట్ లో తమ అవసరాలకు అనుగుణంగా ఉన్నవాటి కోసం వినియోగదారులకు వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో అతి తక్కువ ధరలో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతీయ మార్కెట్లో లాంచ్ అయ్యింది. టున్వల్ స్పోర్ట్స్ 63 మినీ పేరుతో వచ్చిన ఈ బైక్ కేవలం రూ. 50,000లోపు ధరలో అద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది. దీనిలో మరో విశేషం ఏమిటంటే ఈ బైక్ ను డ్రైవ్ చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
సామర్థ్యం.. టున్వల్ స్పోర్ట్స్ 63 మినీ స్కూటర్‌లో 48V/26Ah సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిని పూర్తిగా చార్జ్ చేస్తే 70 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. బ్యాటరీ సాధారణ ఛార్జర్‌తో దాదాపు 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. దీనిలో బీఎల్‌డీసీ మోటార్ ఉంటుంది. ఇది తక్కువ బరువుతో పాటు డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది.
భద్రతకు భరోసా.. ఈ స్మార్ట్ ఈ-బైక్‌లో రెండు చక్రాలకు డ్రమ్ బ్రేక్‌లు ఇచ్చారు. ట్యూబ్ లెస్ టైర్లు ఉంటాయి. డిజిటల్ కన్సోల్‌ను అందించారు. ఒకే వేరియంట్‌లో ఇది లభిస్తుంది. స్లో స్పీడ్ బైక్ కాబట్టి దీనిని డ్రైవ్ చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. అలాగే రిజస్ట్రేషన్ కూడా అవసరం లేదు.



ఫీచర్లు.. డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ ట్రిప్ మీటర్, పుష్ బటన్ స్టార్ట్, ఈబీఎస్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ధర భారతదేశంలో రూ. 49,999గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




