Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి రైతు బంధు డబ్బులు పోస్టాఫీసులో కూడా.. ఇలా చేస్తే క్షణాల్లో ..

|

Jun 19, 2021 | 11:43 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా అందించేందుకు రైతు బంధు పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద రైతులకు రూ.5000

Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి రైతు బంధు డబ్బులు పోస్టాఫీసులో కూడా.. ఇలా చేస్తే క్షణాల్లో ..
Rythu Bandhu
Follow us on

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా అందించేందుకు రైతు బంధు పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద రైతులకు రూ.5000 పెట్టుబడి మద్దతను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు డబ్బులను విడుదలను చేసింది. దాదాపు 7.05 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ కానుంంది. అంటే… 58.85 లక్షల ఎకరాలకు సంబంధించి రూ.2,942.27 కోట్లు జమ చేయనుంది. అయితే ఇప్పుడు రైతులకు మరో శుభవార్త అందించింది తెలంగాణ పోస్టల్ శాఖ. ఇక పై పోస్టాఫీసులో కూడా రైతు బంధు డబ్బులు తీసుకున్న సౌలభ్యాన్ని కల్పించినట్లుగా తపాలా శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ఎలాంటి అదనపు రుసుం లేకుండా.. రైతు బంధు డబ్బులను తీసుకోవచ్చని ఆయన తెలిపారు. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5.794 తపాలా కార్యాలయాల్లో మైక్రో ఏటీఎంలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లుగా శ్రీనివాస్ తెలిపారు.

అయితే ఈ రైతు బంధు డబ్బులను ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్న ఏ బ్యాంక్ ఖాతా ఉన్న మైక్రో ఏటీఎంల నుంచి డ్రా చేసుకోవచ్చని తెలిపారు. ఆధార్ కార్డుతోపాటు .. ఆధార్ నంబర్ రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ కూడా తీసుకెళ్లాలని శ్రీనివాస్ తెలిపారు. మైక్రో ఏటీఎంలో ఫింగర్ ప్రింట్ వేయగానే రిజిస్టర్‌ అయిన ఫోన్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ మైక్రో ఏటీఎంల ద్వారా ఒక ఖాతా నుంచి రోజుకు గరిష్ఠంగా రూ.10 వేలు డ్రా చేసుకోవచ్చు. రబీ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 1.73 లక్షల మంది రైతులకు రూ.169 కోట్ల రైతు బంధు డబ్బును అందచేసినట్లుగా తెలిపారు.

Also Read: ముంబై ఫేక్ వ్యాక్సినేషన్ క్యాంప్ కేసులో బాలీవుడ్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ రమేష్ తౌరానీపైనా అనుమానపు నీలి నీడలు

Salaar Movie: ‘సలార్’ మూవీ నుంచి క్రేజీ అప్‏డేట్.. ప్రభాస్ సినిమాకు రూ.100 కోట్లకు పైగే..