Electric Truck: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తు్న్నాయి. గత కొంత కాలంగా చమురు ధరలు పెరుగుతుండటంతో వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక వాహనదారులు కూడా ఆ వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కార్లు, స్కూటర్లు అందుబాటులోకి రాగా, ఇప్పుడు దేశంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు అందుబాటులోకి రాబోతున్నాయి. అమెరికాకు చెందిన కంపెనీతో జతకట్టిన గుజరాత్ (Gujarat) కంపెనీ ట్రిటాన్.. దేశంలోనే మొట్టమొదటి ఈ-ట్రక్కును గుజరాత్‌లో తయారు చేయనుంది. ఇందుకోసం గుజరాత్ ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. కంపెనీ వ్యవస్థాపకులు హిమాన్షు పటేల్ (Himanshu Patel)ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలను తెలిపారు. ఈ ఏడాది నుంచే ఉత్పత్తులను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ తయారీ యూనిట్ ఏర్పాటు వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.
దీనికి సంబంధించిన అన్ని విడిభాగాలను దేశీయంగానే తయారు చేయనున్నట్లు వివరించారు. ఇందుకోసం బ్యాటరీలు, సర్క్యూట్‌లు, సెమీకండక్టర్‌లు, కాంపోనెంట్‌లతో సహా 9 కంపెనీల విడిభాగాల తయారీ సంస్థలతో జతకట్టినట్లు ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.10,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు కూడా చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 10 వేల మందికిపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించనున్నట్లు కంపెనీ తెలిపింది. త్వరలోనే ఈ-ట్రక్కులను దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు. ఇందుకోసం 3.7 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో ఈ తయారీ ప్లాంట్ ఉంటుందని తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: