TRAI USSD Charges: మొబైల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఆ ఛార్జీలను ఎత్తివేసిన ట్రాయ్‌..!

|

Apr 08, 2022 | 5:45 AM

TRAI USSD Charges: కరోనా కాలం నుంచి డిజిటల్‌ చెల్లింపులు పెరిగిపోయాయి. టెక్నాలజీ పెరిగిపోవడంతో డిజిటల్‌ చెల్లింపులు వేగవంతం అవుతున్నాయి. అయితే..

TRAI USSD Charges: మొబైల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఆ ఛార్జీలను ఎత్తివేసిన ట్రాయ్‌..!
Follow us on

TRAI USSD Charges: కరోనా కాలం నుంచి డిజిటల్‌ చెల్లింపులు పెరిగిపోయాయి. టెక్నాలజీ పెరిగిపోవడంతో డిజిటల్‌ చెల్లింపులు వేగవంతం అవుతున్నాయి. అయితే డిజిటల్‌ చెల్లింపులే లక్ష్యంగా ఫీచర్‌ ఫోన్లలో యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకుగానూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) యూపీఐ123పే (UPI123Pay)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సర్వీసుల నేపథ్యంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (TRAI) యూజర్లకు శుభవార్త అందించింది.

దేశ వ్యాప్తంగా మొబైల్‌ యూజర్లకు ఆన్‌స్ట్రక్చర్డ్‌ సప్లిమెంటరీ సర్వీస్‌ డేటా (USSD) మెసేజ్‌లపై ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు గురువారం ట్రాయ్‌ ప్రకటించింది. దీంతో ఇంటర్నెట్‌ యాక్సెస్‌ లేని ఫీచర్‌ ఫోన్లతో పాటు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సర్వీసు కోసం వాడే యూఎస్‌ఎస్‌డీ సందేశాలను మొబైల్‌ యూజర్లు ఉచితంగా పొందే అవకాశం లభించింది. కాగా, మళ్లీ ఛార్జీల విధింపు అనేది రెండు సంవత్సరాల తర్వాత ట్రాయ్‌ సమీక్షించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఛార్జీలను ఎత్తివేసింది. ప్రస్తుతం టెలికాం ఆపరేటర్లు గరిష్టంగా రూ. 1.50 నుంచి 50 పైసల మేర ఛార్జీలను వసూలు చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

BSNL-MTNL విలీనం వాయిదా.. కారణం ఏమిటో పార్లమెంట్‌లో తెలిపిన కేంద్ర మంత్రి..!

Indian Railway: ఈ రైలు వారంలో ఆరు రోజులు నడుస్తుంది.. ఈ హైస్పీడ్‌ ట్రైన్‌లో ప్రత్యేక సదుపాయాలు..!

Bank Account Aadhaar Link: మీ ఆధార్‌ ఏయే బ్యాంకు అకౌంట్లకు అనుసంధానం అయ్యిందో తెలుసుకోవడం ఎలా..?