Tork Kratos Bikes: ఆలోచించినా ఆశాభంగం.. ఇదే లాస్ట్ ఛాన్స్.. జనవరి 1 నుంచి భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ బైక్స్ ధరలు..
కొత్త సంవత్సరంలో ఎలక్ట్రిక్ బైక్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకిది పెద్ద షాకింగ్ న్యూసే. చాలా మంది న్యూఇయర్, పండుగ ఆఫర్లు వస్తాయని, తక్కువ ధరకే బైక్ కొనుగోలు చేయొచ్చని భావిస్తుంటారు.
కొత్త సంవత్సరంలో ఎలక్ట్రిక్ బైక్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకిది పెద్ద షాకింగ్ న్యూసే. చాలా మంది న్యూఇయర్, పండుగ ఆఫర్లు వస్తాయని, తక్కువ ధరకే బైక్ కొనుగోలు చేయొచ్చని భావిస్తుంటారు. కానీ, అందుకు రివర్స్‌గా కస్టమర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి కంపెనీలు. వాహనాల తయారీ కంపెనీలు ధరలను పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఇటీవల పూణెకు చెందిన వాహనాల తయారీ సంస్థ టోర్క్ మోటార్స్ తన కంపెనీకి చెందిన రెండు ఎలక్ట్రిక్ బైక్స్ క్రాటోస్, క్రాటోస్ ఆర్ ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించింది. ఈ బైక్‌ల కొత్త ధరలు జనవరి 1, 2023 నుండి అమలులోకి వస్తాయి.
అంటే ఈ కంపెనీకి చెందిన కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను మీరు కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. ఈ నెల మాత్రమే అవకాశం ఉంది. కంపెనీ ప్రకటన ప్రకారం కొత్త ఏడాదిలో ఏ కంపెనీ ధర ఎంత ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Kratos బైక్ ధర..
ఈ ఏడాది జనవరిలో క్రాటోస్ బైక్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశారు. దీని ధర రూ. 1,22,499 (ఎక్స్ షోరూమ్ ప్రైజ్) గా ప్రకటించారు. అయితే, ఈ ధర వచ్చే ఏడాది నుంచి మారనుంది. అంటే జనవరి 1, 2023 నుంచి ధీన ధర మరింత పెరగనుంది. కంపెనీ ప్రకటన ప్రకారం.. జనవరి 1 నుంచి ఈ బైక్ ధర రూ. 1,32,499(ఎక్స్ షోరూమ్ ప్రైజ్) గా ఉండనుంది. అంటే దీని ప్రస్తుత ధరపై రూ. 10 వేలు అదనంగా పెంచింది కంపెనీ.
Kratos R బైక్ ధర..
ఈ బైక్ ధర ప్రస్తుతం రూ. 1,37,499 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అయితే జనవరి 1, 2023 నుండి ఈ బైక్ ప్రారంభ ధర రూ. 1,47,499 (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. దీనిపై కూడా కంపెనీ రూ. 10 వేలు పెంచింది. Tork Kratos, Kratos R రెండూ ఒకసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..