
ప్రస్తుతం ఏ అవసరం వచ్చిన టక్కున గుర్తొచ్చేది లోన్. చాలా మంది ఏదో ఒక అవసరం కోసం లోన్ తీసుకుంటున్నారు. ఈ లోన్స్‌కు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వడ్డీ వసూల్ చేయడం కామన్. అయితే వడ్డీ లేని లోన్స్ కూడా ఉంటాయని మీకు తెలుసా…? అవును సామాన్యులకు, చిన్న వ్యాపారులకు, చేతివృత్తుల వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు రకాల రుణ పథకాలను అమలు చేస్తోంది. 2026లో కూడా ఈ పథకాలు లక్షలాది మంది జీవితాల్లో మార్పు తెస్తున్నాయి. ప్రధానంగా వడ్డీ లేని రుణాలు, వడ్డీ సబ్సిడీ పథకాల ద్వారా ప్రభుత్వం బలహీన వర్గాల అభ్యున్నతికి బాటలు వేస్తోంది.
పట్టణ ప్రాంతాల్లోని తోపుడు బండ్లు, వీధి వ్యాపారం చేసుకునే వారి కోసం ఈ పథకం వరం. ప్రారంభంలో రూ.10,000 ఇస్తారు. దీన్ని సకాలంలో చెల్లిస్తే రూ.20,000, ఆపై రూ.50,000 వరకు రుణం పొందవచ్చు. ఇందులో 7శాతం వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. దీనికి తోడు డిజిటల్ లావాదేవీలు చేయడం ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్ కలిపితే.. ఈ రుణం దాదాపు సున్నా వడ్డీ కిందకే వస్తుంది.
కుమ్మరులు, వడ్రంగులు, స్వర్ణకారులు వంటి 18 రకాల సాంప్రదాయ వృత్తుల వారికి ఈ పథకం వర్తిస్తుంది. కేవలం 5శాతం మాత్రమే. వాస్తవానికి మార్కెట్ వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ, మిగిలిన భాగాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది. ఎటువంటి ఆస్తి పూచీకత్తు లేకుండానే ఈ రుణం పొందవచ్చు. దీనితో పాటు శిక్షణ, పనిముట్ల కొనుగోలుకు ఆర్థిక సాయం కూడా అందుతుంది.
వ్యవసాయం, అనుబంధ రంగాల కోసం ప్రభుత్వం ఇచ్చే అతిపెద్ద వడ్డీ రాయితీ పథకం ఇది. సాధారణంగా వడ్డీ 9శాతం ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో అది 7శాతానికి తగ్గుతుంది. ఒకవేళ రైతు తీసుకున్న రుణాన్ని ఏడాది లోపు సకాలంలో తిరిగి చెల్లిస్తే, మరో 3శాతం అదనపు రాయితీ లభిస్తుంది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాల ప్రోత్సాహకంతో కలిపి ఇది వడ్డీ లేని రుణంగా మారుతుంది.
ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం సెంట్రల్ సెక్టార్ వడ్డీ సబ్సిడీ పథకం అందుబాటులో ఉంది. విద్యార్థి చదువుకుంటున్న కాలంలో బ్యాంకులు వసూలు చేసే వడ్డీని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అంటే చదువు పూర్తయ్యే వరకు విద్యార్థికి అది వడ్డీ లేని రుణంతో సమానం.
ప్రభుత్వ రుణాల కోసం ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.
జనసమర్త్ పోర్టల్: అన్ని రకాల ప్రభుత్వ రుణ పథకాల కోసం ఒకే చోట దరఖాస్తు చేసుకునేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది.
అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా, వృత్తి ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ వంటివి సిద్ధంగా ఉంచుకోవాలి.
ఈ పథకాలన్నీ వడ్డీ రాయితీతో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఒక్క వాయిదా ఆలస్యమైనా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రద్దు అయ్యే అవకాశం ఉంది. ఫలితంగా పూర్తి వడ్డీ, జరిమానా భారం మీపై పడుతుంది. .