AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్కటి వేస్తే చాలు.. బట్టలు తెల్లగా మెరిసిపోవడం ఖాయం.. లిక్విడ్లను మించి..

ఖరీదైన డిటర్జెంట్లు, ఖరీదైన లిక్విడ్లు వాడుతున్నా మీ బట్టలు తెల్లగా కావడం లేదా? ఉతికిన తర్వాత కూడా బట్టలు గరుకుగా మారి, ఒక రకమైన వాసన వస్తున్నాయా? అయితే ఇకపై వేల రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు.. మీ వంటగదిలో ఉండే ఒకే ఒక్క పదార్థంతో పాత బట్టలను కూడా కొత్తవాటిలా మెరిపించవచ్చు. అది ఏంటో.. ఇప్పుడు తెలుసుకుందాం..

వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్కటి వేస్తే చాలు.. బట్టలు తెల్లగా మెరిసిపోవడం ఖాయం.. లిక్విడ్లను మించి..
White Vinegar For Clothes Cleaning
Krishna S
|

Updated on: Feb 06, 2026 | 11:58 AM

Share

మనం ఎంత ఖరీదైన డిటర్జెంట్లు వాడినా కొన్నిసార్లు తెల్ల బట్టల మీద పసుపు మరకలు వదలవు. మరికొన్ని సార్లు ఉతికిన బట్టలు గరుకుగా మారి, రంగు మసకబారినట్లు అనిపిస్తాయి. వీటన్నింటికీ పరిష్కారం మీ వంటగదిలోనే ఉందని మీకు తెలుసా? కేవలం తెల్ల వెనిగర్ ఉపయోగించి మీ పాత బట్టలను కూడా కొత్తవాటిలా మార్చుకోవచ్చు. మనం వాడే డిటర్జెంట్ పొడి మురికిని తీస్తుంది కానీ, బట్టలపై ఒక జిడ్డు పొరను వదిలేస్తుంది. దీనివల్ల బట్టలు మృదుత్వాన్ని కోల్పోయి గరుకుగా మారుతాయి. అంతేకాదు చెమట ద్వారా వచ్చే బ్యాక్టీరియాను ఇవి పూర్తిగా తొలగించలేవు. ఫలితంగా ఉతికిన తర్వాత కూడా బట్టల నుంచి ఒక రకమైన అసహ్యకరమైన వాసన వస్తుంది.

వెనిగర్ చేసే అద్భుతాలు ఇవే

వెనిగర్‌లో ఉండే తేలికపాటి ఆమ్ల గుణాలు బట్టలకు సహజమైన ఫాబ్రిక్ సాఫ్ట్‌నర్‌లా పనిచేస్తాయి. సాక్సులు, జిమ్ బట్టలు, తువ్వాళ్ల నుంచి వచ్చే బ్యాక్టీరియాను, వాసనను వెనిగర్ పూర్తిగా పోగొడుతుంది. తెల్లటి బట్టలు పసుపు రంగులోకి మారకుండా రంగు బట్టలు వెలిసిపోకుండా వెనిగర్ కాపాడుతుంది. బట్టల్లో చిక్కుకున్న సబ్బు అవశేషాలను వెనిగర్ కరిగించి, ఫైబర్‌లను వదులు చేస్తుంది. దీంతో బట్టలు మృదువుగా మారుతాయి.

ఎలా ఉపయోగించాలి..?

వెనిగర్‌ను ఎప్పుడూ డిటర్జెంట్ పౌడర్‌తో కలపకూడదు. బట్టలు ఉతికే చివరి దశలో మాత్రమే దీనిని వాడాలి. మెషీన్‌లోని ఫాబ్రిక్ సాఫ్ట్‌నర్ కంపార్ట్‌మెంట్‌లో అర కప్పు వైట్ వెనిగర్ పోయండి. ఇది బట్టలతో పాటు మెషీన్ డ్రమ్, పైపులలో ఉన్న సబ్బు ఒట్టును కూడా శుభ్రం చేస్తుంది. బట్టలు పిండే చివరి సమయంలో బకెట్ నీటిలో పావు కప్పు వెనిగర్ కలపండి. 10 నిమిషాల పాటు బట్టలను అందులో ఉంచి ఆ తర్వాత ఆరబెట్టండి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

వెనిగర్‌ను బ్లీచ్‌తో కలిపితే ప్రమాదకరమైన వాయువులు విడుదలవుతాయి. అదేవిధంగా పట్టు, ఉన్ని, తోలు వంటి బట్టలపై వెనిగర్ వాడకపోవడమే మంచిది.