Komaki LY: ఆ ఈవీ స్కూటర్‌పై అదిరే డిస్కౌంట్… ఏకంగా రూ.19 వేల నగదు తగ్గింపు
తాజాగా కొమాకీ ఈవీ స్కూటర్ కొనుగోలు ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది. కొమాకీ తన ఎల్‌వై స్కూటర్‌పై ఏకంగా రూ.18,968ను తగ్గింపు అందిస్తున్నట్లు వివరించింది. ఈ స్కూటర్ ధర రూ.96,968 కాగా ప్రస్తుతం తగ్గింపుతో ఈ స్కూటర్ రూ.78000కే కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ తగ్గింపు కేవలం పరిమిత కాలం వరకే ఉంటుదని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. అయితే బ్రాండ్ డిస్కౌంట్ లభ్యతకు సంబంధించిన సరైన సమయ ఫ్రమ్‌ను మాత్రం ప్రకటించలేదు.
భారతదేశంలో ఈవీ వాహనాల జోరు పెరిగింది. అన్ని కంపెనీలు తమ మోడల్స్ ఈవీలను జోరుగా లాంచ్ చేస్తున్నాయి. పెరిగిన డిమాండ్ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ఈవీలపై కొనుగోలుపై సరికొత్త డిస్కౌంట్స్‌ను అందిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం భారతదేశంలో పండుగల సీజన్ నేపథ్యంలో ప్రత్యేక తగ్గింపులను ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా కొమాకీ ఈవీ స్కూటర్ కొనుగోలు ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది. కొమాకీ తన ఎల్‌వై స్కూటర్‌పై ఏకంగా రూ.18,968ను తగ్గింపు అందిస్తున్నట్లు వివరించింది. ఈ స్కూటర్ ధర రూ.96,968 కాగా ప్రస్తుతం తగ్గింపుతో ఈ స్కూటర్ రూ.78000కే కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ తగ్గింపు కేవలం పరిమిత కాలం వరకే ఉంటుదని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. అయితే బ్రాండ్ డిస్కౌంట్ లభ్యతకు సంబంధించిన సరైన సమయ ఫ్రమ్‌ను మాత్రం ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో కొమాకీ ఎల్‌వై గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
కొమాకీ ఎల్‌వై నగర ప్రయణానికి అనువుగా ఉండే హై స్పీడ్ ఎలక్ట్రిక స్కూటర్‌గా వస్తుంది. ఈ స్కూటర్ సింగిల్, డ్యుయల్ బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. సింగిల్ బ్యాటరీతో వచ్చే ఈ స్కూటర్ 85 కిలో మీటర్ల పరిధిని అందిస్తుంది. అలాగే డ్యుయల్ బ్యాటరీతో వచ్చే ఓ సారిచార్జ్ చేస్తే 200 కిలో మీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. స్వాపబుల్ బ్యాటరీతో వచ్చే ఈ స్కూటర్ నాలుగు గంట 55 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ చేయవచ్చు. అయితే ప్రస్తుతం సింగిల్ బ్యాటరీ వెర్షన్‌పై మాత్రమే రూ.19,000 తగ్గింపును అందిస్తుంది.
కొమాకీ ఎల్‌వై ఈవీ స్కూటర్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ కోసం టీఎఫ్‌టీ స్క్రీన్‌తో వస్తుంది. ముఖ్యంగా నావిగేషన్ వివరాలను చూపుతుంది. అలాగే ఆన్‌బోర్డులో సౌండ్ సిస్టమ్ ఉంది. ముఖ్యంగా బ్లూటూత్ కనెక్టవిటీ ద్వారా ప్లే చేసుకోవచ్చు. ఇది హెడ్ ల్యాంప్, టర్న్ ఇండికేటర్, టెయిల్ లైట్‌లతో సహా ఎల్‌ఈడీ లైట్లతో వస్తుంది. కొమాకీ ఎల్‌వై చెర్రీ రెడ్, మెటల్ గ్రే, జెట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఈ తాజా తగ్గింపుతో కొమాకీ కచ్చితంగా ఈవీ ప్రియుల మనస్సును దోచుకుంటుందని కొమాకీ ఎలక్ట్రిక్ డివిజన్ డైరెక్టర్ గుంజన్ మల్హోత్రా తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..