Gold Price Today: తగ్గేదిలే అంటున్న బంగారం, వెండి ధరలు.. తులం ధర ఎంత? ఇక కొనడం కష్టమేనా?

Gold Price Today: మళ్లీ బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. బంగారం ఒక ప్రధాన పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. వివాహాలు, పండుగలలో అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ సంఘటనలు, డిమాండ్, సరఫరా వంటి అనేక కారణాల వల్ల ఈ ధరలు మారుతూ ఉంటాయి. ప్రపంచ మార్కెట్‌లో..

Gold Price Today: తగ్గేదిలే అంటున్న బంగారం, వెండి ధరలు.. తులం ధర ఎంత? ఇక కొనడం కష్టమేనా?

Updated on: Apr 11, 2025 | 6:42 AM

బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత వారం రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు నిన్నటి నుంచి రికార్డ్‌ సృష్టిస్తోంది. రూ.89 వేల వరకు వెళ్లిన తులం బంగారం ధర.. నిన్న ఉదయం ఏకంగా రూ.3000 వరకు ఎగాకి రూ.93,000 వరకు చేరుకుంది. ఇప్పుడు కూడా అదే రేంజ్‌లో కొనసాగుతోంది. నిన్నటి నుంచి భారీగా పెరుగూనే ఉంది. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.93,390 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్ మార్కెట్ రేట్లు మన దేశంలో బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. ఇంకా అమెరికా డాలర్, రూపాయి మారక విలువ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు కూడా బంగారం ధరలను నిర్ణయిస్తాయి. అందుకే గోల్డ్ ధరలు స్థిరంగా ఉండవు. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బంగారు ఆభరణాల దిగుమతులపై సుంకాలు విధించడంతో పసిడి పరుగు ఆగింది. అది కాస్త ఇప్పుడు రివర్స్ అవుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధర 17 సార్లు ఆల్ టైమ్ రికార్డులను తాకింది. ఇక్కడి నుంచి బంగారం ధర రూ. లక్ష దిశగా దూసుకువెళుతున్న సమయంలో ఆగింది. కానీ కొందరేమో రూ.56 వేలకు దిగి వస్తుందని చెబుతుండగా, మరి కొంత మంది నిపుణులు లక్ష మార్క్‌ దాటే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇక ఏప్రిల్‌ 11వ తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  1. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.85,610 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,390 వద్ద ఉంది.
  2. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.85,610 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,390 వద్ద ఉంది.
  3. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.85,760 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,540 వద్ద ఉంది.
  4. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.85,610 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,390 వద్ద ఉంది.
  5. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.85,610 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,390 వద్ద ఉంది.
  6. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.85,610 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,390 వద్ద ఉంది.
  7. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.85,610 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,390 వద్ద ఉంది.
  8. ఇక వెండి విషయానికొస్తే బంగార బాటలోనే పయనిస్తోంది. ఇది కూడా భారీగానే పెరిగింది. కిలో వెండి ధర రూ.97,100 వద్ద ఉంది. కొన్ని ప్రాంతాల్లో లక్షకుపైనే ఉంది.
  9. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి