Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. దేశంలో పలు నగరాల్లో పెరిగిన సిల్వర్‌ రేట్స్‌..

|

Dec 27, 2021 | 7:07 AM

Silver Price Today: దేశంలో వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. డిసెంబర్‌ 19 నుంచి 21 వరకు వరుసగా సిల్వర్ రేట్స్‌లో తగ్గుదల కనిపించగా, మళ్లీ 22, 23 తేదీల్లో ఏకంగా కేజీ సిల్వర్‌పై వరుసగా..

Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. దేశంలో పలు నగరాల్లో పెరిగిన సిల్వర్‌ రేట్స్‌..
Follow us on

Silver Price Today: దేశంలో వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. డిసెంబర్‌ 19 నుంచి 21 వరకు వరుసగా సిల్వర్ రేట్స్‌లో తగ్గుదల కనిపించగా, మళ్లీ 22, 23 తేదీల్లో ఏకంగా కేజీ సిల్వర్‌పై వరుసగా 600, 400 పెరిగింది. ఆ తర్వాత మళ్లీ తగ్గుదల కనిపించింది. ఇక గడిచిన రెండు రోజుల్లో పెరుగుతూ వచ్చిన సిల్వర్‌ రేట్స్‌.. తాజాగా సోమవారం కూడా మరోసారి పెరిగాయి. అయితే ఈ పెరుగుదల కేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితమైంది. ఈరోజు దేశంలోని కొన్ని నగరాల్లో కిలో వెండిపై మరోసారి రూ. 100 పెరిగింది. నేడు దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

* దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇక్కడ కిలో వెండిపై రూ. 62,300వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కూడా సిల్వర్‌ రేట్స్‌లో తేడా కనిపించలేదు. ఇక్కడ సోమవారం కిలో వెండి ధర రూ. 62,300గా నమోదైంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలోలో సిల్వర్‌ రేట్‌లో పెరుగుదల కనిపించింది. ఇక్కడ కిలో వెండిపై రూ. 100 పెరిగి, రూ. 66,200 గా ఉంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో వెండి ధరలో నేడు ఎలాంటి మార్పు లేదు. ఇక్కడ కిలో వెండి ధర రూ. 62,300గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో కూడా వెండి ధరలో పెరుగుదల కనిపించింది. ఇక్కడ సోమవారం కిలో వెండి ధర రూ. 66,200గా ఉంది.

* విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 66,200గా ఉంది.

* విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 66,200 వద్ద కొనసాగుతోంది.

Also Read: PM Narendra Modi: నేడు హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రధాని పర్యటన.. రూ. 11వేల కోట్ల ప్రాజెక్టులకు శంఖుస్థాపనలు

Bigg Boss 5 Telugu Shanmukh: దీప్తి నన్ను బ్లాక్ చేసింది.. బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చిన షణ్ముఖ్..

Radhe Shyam: రాధేశ్యామ్‌ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్.. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కోసం రంగంలోకి..