Fuel Rates: ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి సంబంధించిన వార్తలే తప్ప.. తగ్గినట్లు ఎక్కడా వినిపించలేదు. ప్రతి రోజూ ఎంతోకొంత ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో వినియోగదారులు వాహనాన్ని బయటకు తీయాలంటే భయపడే పరిస్థితులు వచ్చాయి. అయితే వాహనదారులకు ఆదివారం ఒక శుభవార్త వచ్చింది. అదే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం, 35 రోజుల తర్వాత ఇంధన ధరలు తగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై 20 పైసలు, డీజిల్‌పై 18 పైసలు తగ్గింది. చాలా కాలంపాటు స్థిరంగా కొనసాగిన ఇంధన ధరలు తాజాగా తగ్గడం విశేషం. ఇక దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
* దేశరాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.64 కాగా, డీజిల్ రూ. 89.07 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.66 వద్ద ఉండగా, డీజిల్ రూ. 96.64 గా ఉంది.
* చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.32 కాగా, డీజిల్ రూ. 93.66 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.13 గా ఉండగా, డీజిల్ రూ. 94.49 గా ఉంది.
* హైదరాబాద్‌లో ఆదివారం లీటర్ పెట్రోల్ ధర రూ. 105.69 గా ఉండగా, డీజిల్ రూ. 97.15 వద్ద కొనసాగుతోంది.
* కరీంనగర్‌లో ఈ రోజు లీటర్ పెట్రోల్ రూ. 105.42 కాగా, డీజిల్ రూ. 96.60గా ఉంది.
* విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.65 పలకగా, డీజిల్ రూ. 98.63 వద్ద కొనసాగుతోంది.
* సాగర నగరం విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.67 గా ఉండగా, డీజిల్ ధర రూ. 97.67 వద్ద ఉంది.
Also Read: Chicken Rates: అక్కడ చికెన్ అగ్గువ..! కిలో కొంటే 6 కోడి గుడ్లు ఉచితం..? ఎందుకు ఇలా అంటే..
Tirumala News: బీ కేర్ ఫుల్.. తిరుమలలో రెచ్చిపోతున్న దళారులు.. 2 నెలల్లో 45 మంది అరెస్ట్
PM Garib Kalyan Anna Yojana: మీకు ఉచిత రేషన్ అందడం లేదా?.. అయితే ఇలా చేయండి..