Gold Price Today: పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతో తెలుసా?
Today Gold Price: బంగారం ఒక ప్రధాన పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. వివాహాలు, పండుగలలో అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ సంఘటనలు, డిమాండ్, సరఫరా వంటి
బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లి షాకిస్తున్నాయి. దీపావళి తర్వాత పెరుగుతూ తగ్గుతూ వచ్చిన గోల్డ్ ధర.. తాజాగా నవంబర్ 9న పెరిగింది. అయితే బంగారం ధర తగ్గిందన్న ఆనందం పసిడి ప్రియుల్లో ఒక్కరోజు మాత్రమే ఉంది. మరోసారి భారీగా పెరగడంతో భవిష్యత్తులో బంగారం ధర లక్ష దాటడం ఖాయమనే భావిస్తున్నారు. ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ ప్రకారం, వివాహాలు, పండుగల కోసం స్థానిక నగల వ్యాపారులు, రిటైలర్లు తాజా కొనుగోళ్ల కారణంగా ధరలు పెరిగాయి. శనివారం స్వల్పంగా పెరుగుదల నమోదైంది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,860 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,480 వద్ద ఉంది. ఇక వెండి విషయానికొస్తే.. కిలోకు రూ.94,800 ఉంది. నిన్న కిలో ధర రూ.93,800 వద్ద ముగిసింది.
ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,860 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,480 వద్ద ఉంది.
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,860 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,480 ఉంది.
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,860 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,480 ఉంది.
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,860 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,480 వద్ద కొనసాగుతోంది.
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,860 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,480 ఉంది.
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,860 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,480 వద్ద నమోదైంది.
బంగారం ఒక ప్రధాన పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. వివాహాలు, పండుగలలో అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ సంఘటనలు, డిమాండ్, సరఫరా వంటి అనేక కారణాల వల్ల ఈ ధరలు మారుతూ ఉంటాయి. ప్రపంచ మార్కెట్‌లో ఒడిదుడుకుల కారణంగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఇందులో US ఎన్నికలు, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు వంటి పెద్ద కారణాలు ఉన్నాయి. గోల్డ్‌మన్ శాక్స్ ప్రకారం, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో సెంట్రల్ బ్యాంకుల ద్వారా బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఇది రాబోయే కాలంలో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Malware Attack: ఆండ్రాయిడ్ యూజర్లకు పెను ముప్పు.. మొబైళ్లలో మరో కొత్త మాల్వేర్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి