Passport: ప్రపంచంలో అత్యంత పవర్‌ఫుల్‌ పాస్‌పోర్ట్‌ ఏదో తెలుసా? ర్యాంకింగ్‌లో భారత్‌ ఏ స్థానం..?

Henley Passport Index: ప్రపంచంలో కొన్ని దేశాల పాస్‌పోర్ట్‌లు అత్యంత శక్తివంతమైనవిగా పేరుంది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రపంచంలోని 199 పాస్‌పోర్ట్‌లు ఎంత బలంగా ఉన్నాయో ర్యాంకింగ్‌ ఇచ్చింది. మరి మన దేశం ఏ ర్యాకింగ్‌లో ఉందో తెలుసా?

Passport: ప్రపంచంలో అత్యంత పవర్‌ఫుల్‌ పాస్‌పోర్ట్‌ ఏదో తెలుసా? ర్యాంకింగ్‌లో భారత్‌ ఏ స్థానం..?
Follow us
Subhash Goud

|

Updated on: Nov 07, 2024 | 4:51 PM

ఏ దేశం ప్రపంచ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందో పాస్‌పోర్ట్ నుండి అంచనా వేయవచ్చు. వీసా రహిత ప్రవేశాన్ని ఎన్ని దేశాలు మంజూరు చేశాయన్నది బలమైన పాస్‌పోర్ట్ ద్వారా తెలిసిపోతుంది.హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రపంచంలోని 199 పాస్‌పోర్ట్‌లు ఎంత బలంగా ఉన్నాయో ర్యాంకింగ్‌ ఇచ్చింది. ప్రపంచంలోని టాప్ 5 శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల గురించి తెలుసుకుందాం. అలాగే 199 పాస్‌పోర్ట్‌ల జాబితాలో భారతదేశం ఏ నంబర్‌లో ఉందో కూడా చూద్దాం.

పాస్‌పోర్ట్‌లు ఎలా ర్యాంక్ చేస్తారు?

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో.. పాస్‌పోర్ట్‌ల ర్యాంకింగ్ సమగ్ర పద్దతిపై ఆధారపడి ఉంటుంది. ఇందులో చాలా విషయాలను గమనించారు. పాస్‌పోర్ట్ హోల్డర్ ఎన్ని దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీని పొందుతారనే దానిపై ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. పాస్‌పోర్ట్ సాధారణంగా దేశం దౌత్య సంబంధాలు, దాని అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా బలోపేతం అవుతుంది.

ఇవి కూడా చదవండి

సింగపూర్ పాస్‌పోర్ట్

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం, సింగపూర్ పాస్‌పోర్ట్ 2024 సంవత్సరంలో అత్యంత బలమైనది. మీరు సింగపూర్ పాస్‌పోర్ట్ హోల్డర్ అయితే, 195 దేశాలకు వెళ్లడానికి మీకు వీసా అవసరం లేదు.

ఈ ఐదు దేశాలు రెండో స్థానంలో..

శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల ర్యాంకింగ్‌లో ఐదు దేశాలు రెండవ స్థానాన్ని ఆక్రమించాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, స్పెయిన్. ఈ దేశాల పౌరులు వీసా లేకుండా 192 పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్‌లో ఏడు దేశాలు మూడో స్థానంలో ఉన్నాయి. వీటిలో ఆస్ట్రియా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ ఉన్నాయి. మీకు ఈ దేశాల పాస్‌పోర్ట్ ఉంటే మీరు 191 దేశాలలో వీసా రహిత ప్రవేశాన్ని పొందుతారు.

ఈ దేశాల ఆధిపత్యం కూడా..

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో బెల్జియం, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, బ్రిటన్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్‌తో 190 గమ్యస్థానాలను సందర్శించడానికి వీసా అవసరం ఉండదు.

ఆస్ట్రేలియా-పోర్చుగల్ బలంగా..

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో ఐదవ స్థానంలో ఆస్ట్రేలియా, పోర్చుగల్ పాస్‌పోర్ట్‌లు ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్‌లు కలిగిన వారు వీసా లేకుండా 189 దేశాలను సందర్శించవచ్చు.

భారతదేశ పాస్‌పోర్ట్ ఎంత శక్తివంతమైనది?

అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల ర్యాంకింగ్‌లో భారత్ 83వ స్థానంలో ఉంది. మౌరిటానియా, సెనెగల్, తజికిస్థాన్ కూడా అదే సంఖ్యలో ఉన్నాయి. భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు వీసా లేకుండా 58 దేశాలలోకి ప్రవేశించవచ్చు.

బలహీనమైన పాస్‌పోర్టు

ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన పాస్‌పోర్టు పాకిస్థాన్‌ది. ర్యాంకింగ్ ప్రకారం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాక్, యెమెన్, సోమాలియా ప్రపంచంలోనే అతి తక్కువ శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్నాయి. వారు చాలా పరిమిత దేశాలలో వీసా రహిత ప్రవేశాన్ని పొందుతారు.

ఇది కూడా చదవండి: School Holidays: వారం రోజుల పాటు పాఠశాలలు బంద్‌.. కీలక నిర్ణయం తీసుకోనున్న ఆ ప్రభుత్వం!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
విడాకుల నేపథ్యంలో.. రెహ్మాన్ మత మార్పిడే హాట్ టాపిక్.!
విడాకుల నేపథ్యంలో.. రెహ్మాన్ మత మార్పిడే హాట్ టాపిక్.!