AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auto Tips: ట్రాఫిక్‌లో కారు 1 నిమిషం ఆగి ఉంటే పెట్రోల్ ఎంత ఖర్చవుతుందో తెలుసా?

Auto Tips: మీరు కారులో వెళ్తూ ట్రాఫిక్‌లో చిక్కుకుంటే ఎక్కువ సేపు ఆగాల్సి వస్తుంటుంది. అలాగే ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద కూడా ఎక్కువసేపు వాహనం నిలిపివేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో వాహనం ఇంజిన్‌ ఆఫ్‌ చేయడం మంచిదంటున్నారు నిపుణులు. ట్రాఫిక్‌లో ఆగినప్పుడు ఎంత పెట్రోల్‌ ఖర్చు అవుతుందో తెలుసా?

Auto Tips: ట్రాఫిక్‌లో కారు 1 నిమిషం ఆగి ఉంటే పెట్రోల్ ఎంత ఖర్చవుతుందో తెలుసా?
Subhash Goud
|

Updated on: Nov 07, 2024 | 7:15 PM

Share

మీరు మీ వాహనాన్ని డ్రైవింగ్‌ చేస్తూ ట్రాఫిక్‌లో చిక్కుకోవడం సర్వసాధారణం. ముఖ్యంగా బెంగళూరు ట్రాఫిక్‌లో కొన్నిసార్లు గంటల తరబడి ఆగిపోవాల్సి వస్తుంటుంది. కొంతమంది ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు వాహనాన్ని ఆఫ్‌ చేయకుండా ఆన్‌లోనే ఉంచేస్తుంటారు. అది కారు గానీ, బైక్‌ గానీ. అటువంటి పరిస్థితిలో మీ కారులో ఇంధన వినియోగం కూడా పెరుగుతుంది. కానీ, ఈ సందర్భంలో ఇంధన వినియోగం ఎంత ఉంటుందో మీరు ఎప్పుడైనా ఊహించారా?. కారును ట్రాఫిక్ ఉన్నప్పుడు ఆపడం, లేదా సిగ్నల్స్ వద్ద ఆపడం వల్ల ఇంధనం (పెట్రోల్/డీజిల్) వినియోగం కారు రకం, ఇంజిన్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మీ కారు ఇంజిన్ 1000 నుండి 2000 cc మధ్య ఉంటే, 1-నిమిషం స్టాప్‌కు 0.01 నుండి 0.02 లీటర్ల పెట్రోల్ ఖర్చవుతుంది.

చిన్న ఇంజన్లు (1000 నుండి 1200 సిసి): చిన్న ఇంజన్లు కలిగిన వాహనాలు 1 నిమిషంలో సుమారుగా 0.01 లీటర్ పెట్రోల్‌ను ఖర్చవుతుంది.

మధ్యస్థ ఇంజిన్‌లు (1500 cc వరకు): ఈ వాహనాలు నిమిషానికి 0.015 లీటర్లు వినియోగించుకుంటాయి.

ఇవి కూడా చదవండి

పెద్ద ఇంజన్లు (2000 cc పైన): పెద్ద ఇంజన్లు 1 నిమిషంలో 0.02 లీటర్ లేదా అంతకంటే ఎక్కువ ఇంధనాన్ని ఉపయోగించుకుంటాయి.

దీని ఆధారంగా మీ కారు నిరంతరం ట్రాఫిక్ సిగ్నల్స్‌ వద్ద ఆగాల్సి వస్తే ఒక నెలలో ఎంత ఇంధనం ఖర్చవుతుందో ఆలోచించండి.

ట్రాఫిక్ సిగ్నల్‌ వద్ద కారును ఆపివేయడం మంచిది:

ట్రాఫిక్ సిగ్నల్‌ వద్ద ఎక్కువ సేపు ఆగినప్పుడు వాహనం ఇంజన్ ఆఫ్ చేయడం వల్ల చాలా ఇంధనం ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆపే సమయం 30 సెకన్ల కంటే ఎక్కువ ఉంటే ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి ఇంజిన్ ఆఫ్ చేయడం ఉత్తమ మార్గం.

సిగ్నల్స్‌ వద్ద ఇంజిన్‌ ఆఫ్‌ చేస్తే ప్రయోజనాలు:

ఇంధన ఆర్థిక వ్యవస్థ: ఇంజిన్ నడుస్తున్నప్పుడు ఇంధనం నిరంతరం ఉపయోగించబడుతుంది. ఇంజిన్ ఆఫ్ చేయడం ద్వారా ఇంధన వినియోగం వెంటనే ఆగిపోతుంది. దీని ద్వారా ఇంధనం ఆదా చేసుకోవచ్చు.

కాలుష్యం తగ్గింపు: వాహన ఇంజన్ ఆఫ్ చేయడం వల్ల ఉద్గారాలు ఆగిపోతాయి. ఇది పర్యావరణంలో కాలుష్యాన్ని తగ్గిస్తుంది.

ఇంజిన్ డ్యూరబిలిటీని పెంచుతుంది: ఇంజిన్‌ను ఎక్కువసేపు రన్నింగ్‌లో ఉంచడం వల్ల దాని జీవితకాలం తగ్గుతుంది. అందుకే ఆఫ్ చేయడం వల్ల దాని సామర్థ్యం కూడా పెరుగుతుంది. మీరు ట్రాఫిక్ సిగ్నల్‌ వద్ద 30 సెకన్ల కంటే ఎక్కువసేపు ఆగవలసి వస్తే, ఇంజిన్ ఆఫ్ చేయడం మంచి నిర్ణయం.

ఇది కూడా చదవండి: Malware Attack: ఆండ్రాయిడ్‌ యూజర్లకు పెను ముప్పు.. మొబైళ్లలో మరో కొత్త మాల్వేర్‌!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి