Gold Price Today: స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధరలు.. ఆ రెండు చోట్ల మాత్రం భారీగా తగ్గుదల.. ఒమిక్రాన్ భయాలతోనేనా?

|

Dec 03, 2021 | 6:41 AM

Gold Price Today: ప్రపంచానికి మరోసారి కరోనా భయం పట్టుకుంది. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఆర్థిక వ్యవస్థపై పంజా విసరడానికి సిద్ధమవుతోంది. దీంతో ప్రజలు ముందుగానే జాగ్రత్తపడుతూ...

Gold Price Today: స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధరలు.. ఆ రెండు చోట్ల మాత్రం భారీగా తగ్గుదల.. ఒమిక్రాన్ భయాలతోనేనా?
Gold Price
Follow us on

Gold Price Today: ప్రపంచానికి మరోసారి కరోనా భయం పట్టుకుంది. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఆర్థిక వ్యవస్థపై పంజా విసరడానికి సిద్ధమవుతోంది. దీంతో ప్రజలు ముందుగానే జాగ్రత్తపడుతూ నగదును పొదుపు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వెరసి ఇది బంగారం ధరలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. తాజాగా ఒమిక్రాన్‌ భయాల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తూ వస్తుంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది.

బంగారానికి డిమాండ్‌ తగ్గడం, ప్రజలు పొదుపు మంత్రం పాటించడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. దీంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం భారీగా తగ్గిన గోల్డ్‌ రేట్స్‌ శుక్రవారం మాత్రం స్థిరంగా కొనసాగాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం మళ్లీ తగ్గుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా ఈరోజు గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,000గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్‌ రూ. 46,750 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఈరోజు కూడా బంగారం భారీగా పతనమైంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,580 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 46,580 గా ఉంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలోనూ బంగారం తగ్గింది శుక్రవారం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,730గా నమోదుకాగా, 22 క్యారెట్ల గోల్డ్‌ రూ. 44,670 వద్ద కొనసాగుతోంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈరోజు బంగారం ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,650 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం రూ. 44,600గా ఉంది.

* దేశంలో మరో ముఖ్య నగరం పుణెలో కూడా బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. ఇక్కడ శుక్రవారం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 230 తగ్గి.. రూ. 49,070 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం రూ. 45,820గా ఉంది.

తెలుగు రాష్ట్రాల ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లోనూ ధరల్లో మార్పు లేదు. ఇక్కడ.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,650కాగా, 22 క్యారెట్ల బంగారం రూ. 44,600 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో శుక్రవారం 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,650గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ. 44,600 వద్ద కొనసాగుతోంది.

* సాగర తీరం విశాఖపట్నంలో 24 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,650గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ. 44,600 వద్ద కొనసాగుతోంది.

Also Read: Viral News: ఆ డాక్టర్‌ వల్లే నేను ఇలా పుట్టాల్సి వచ్చింది.. యువతి పిటిషన్.. కోర్టు సంచలన తీర్పు..!

Akhanda Movie: బాలకృష్ణ ‘అఖండ’ చిత్ర యూనిట్ ప్రెస్ మీట్.. లైవ్ వీడియో..

Zodiac Signs: ఈ 6 రాశులవారు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు.! ఏయే రాశులంటే?