Gold Price Today: చుక్కలు చూపిస్తోన్న బంగారం ధర.. మంగళవారం ఒక్క రోజే ఎంత పెరిగిందో తెలుసా.?

|

Jan 10, 2023 | 6:35 AM

దేశంలో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. గడిచిన కొన్ని రోజులుగా గోల్డ్‌ రేట్స్‌ దూసుకుపోతున్నాయి. ఆకాశమే హద్దుగా ధరలు పెరిగిపోతున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 56 వేల దాటేసింది. సోమవారం ఏకంగా రూ. 330 పెరగగా తాజాగా మంగళవారం అదే స్థాయిలో పెరిగింది. సోమవారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో...

Gold Price Today: చుక్కలు చూపిస్తోన్న బంగారం ధర.. మంగళవారం ఒక్క రోజే ఎంత పెరిగిందో తెలుసా.?
Gold Price Today
Follow us on

దేశంలో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. గడిచిన కొన్ని రోజులుగా గోల్డ్‌ రేట్స్‌ దూసుకుపోతున్నాయి. ఆకాశమే హద్దుగా ధరలు పెరిగిపోతున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 56 వేల దాటేసింది. సోమవారం ఏకంగా రూ. 330 పెరగగా తాజాగా మంగళవారం అదే స్థాయిలో పెరిగింది. సోమవారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ గోల్డ్‌ రేట్‌ రూ. 51,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,440 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,600 , 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 56,290 గా ఉంది.

ఇవి కూడా చదవండి

* తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,600 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్స్‌ బంగారం రూ. 57,380 గా ఉంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,650 కాగా, 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్‌ రూ. 56,340 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లోనూ బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. భాగ్యనగరంలో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్స్‌ గోల్డ్ రేట్‌ రూ. 51,600 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,290 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,600 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 56,290 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,600 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 56,290 గా ఉంది.

వెండి ధరలు ఇలా ఉన్నాయి..

వెండి ధరలో కూడా పెరుగుదల కనిపంచింది. సోమవారంలో దేశంలోని దాఆదాపు అన్ని నగరాల్లో వెండి ధర పెరిగింది. కిలో వెండిపై ఏకంగా రూ. 500 వరకు పెరిగింది. దేశవ్యాప్తంగా దేశంలో ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 71,800 , తమిళనాడు రాజధాని చెన్నైలో రూ. 74,900 కాగా, కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండి ధర రూ. 74,900 వద్ద కొనసాగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 74,900 కాగా విజయవాడలో వెండి ధర రూ. 74,900, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 74,900వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..