Today Gold Price: వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు తులం గోల్డ్‌ రేట్‌ ఎలా ఉందంటే..?

|

Feb 18, 2021 | 7:21 AM

Today Gold Price: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే ఇదే సరైన సమయంలా అనిపిస్తోంది. ఎందుకంటే లాక్‌డౌన్‌ సమయంలో బంగారం ధరలు ఓ రేంజ్‌లో పెరిగిన సందర్భం చూశాం. అయితే ప్రస్తుతం..

Today Gold Price: వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు తులం గోల్డ్‌ రేట్‌ ఎలా ఉందంటే..?
Follow us on

Today Gold Price: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే ఇదే సరైన సమయంలా అనిపిస్తోంది. ఎందుకంటే లాక్‌డౌన్‌ సమయంలో బంగారం ధరలు ఓ రేంజ్‌లో పెరిగిన సందర్భం చూశాం. అయితే ప్రస్తుతం  బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. బుధవారం రూ.700 మేర తగ్గిన గోల్డ్‌ ధరలు.. గురువారం కూడా నేల చూపులు చూశాయి. ఈరోజు (ఫిబ్రవరి 18) దేశ రాజధాని ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రామలు బంగారం ధర నిన్నటితో పోల్చితే రూ.500 తగ్గి.. రూ.45,900 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ విషయానికొస్తే.. బుధవారంతో పోల్చితే రూ.550 తగ్గి రూ.50,070 వద్ద ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర నిన్నటితో పోల్చితే రూ.540 తగ్గి, రూ.45,690 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రూ.540 తగ్గి.. రూ.46,690 వద్ద కొనసాగుతోంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర బుధవారంతో పోలిస్తే రూ.500 తగ్గి, రూ.43,750 వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 560 తగ్గి, రూ.47,730 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం నిన్నటి కంటే.. రూ.500 తగ్గి రూ.43,750 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.47,730 వద్ద ఉంది.

Also Read: State Bank Of India: ఒక్క మిస్డ్ కాల్‌తో పర్సనల్ లోన్ పొందొచ్చు.. ఎస్‌బీఐ అదిరిపోయే ఆఫర్.!