Fuel Cost Saving: వాహన ఖర్చు తగ్గించుకుని డబ్బు ఆదాచేయటం ఎలా అని ఆలోచిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే..

|

Feb 11, 2022 | 5:32 PM

Fuel Saving: ఒకపక్క దేశంలో వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు వాహనదారులకు మోయలేని భారంగా మారాయి. ఇటువంటి తరుణంలో వాహన ఖర్చు తగ్గించుకోవాలని ప్రతిఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రయత్నంలో కొందరు తమ వాహన వినియోగాన్ని...

Fuel Cost Saving: వాహన ఖర్చు తగ్గించుకుని డబ్బు ఆదాచేయటం ఎలా అని ఆలోచిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే..
Fuel Saving
Follow us on

Fuel Saving: ఒకపక్క దేశంలో వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు(Fuel rates) వాహనదారులకు మోయలేని భారంగా మారాయి. ఇటువంటి తరుణంలో వాహన ఖర్చు తగ్గించుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రయత్నంలో కొందరు తమ వాహన వినియోగాన్ని తగ్గించుకుంటుండగా.. మరికొందరు వాహనవినియోగాన్ని దాదాపు ఆపేస్తున్నారు. దీనికి సరైన పరిష్కారం ఇంధన ఖర్చును(Fuel cost) తగ్గించుకోవడమే. ఇలా గణనీయంగా వాహనదారులు లాభపడవచ్చు.

ఇందుకోసం పాటించాల్సిన కొన్ని నియమాలు..

1. మెుదటిది వాహన చోదకులు ఎక్కువ వేగంగా నడపడాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే వేగంగా వెళ్లేందుకు చేసే ప్రయత్నం వల్ల కారు, టూవీలర్ ఎక్కువ ఇంధనాన్ని వాడుకుంటుంది. ఇందువల్ల ఎల్లప్పుడూ వేగాన్ని అత్యధికంగా 80 నుంచి 100 కిలోమీటర్ల వేగానికి మించి వాహనాన్ని నడపకూడదు. వీలైనంతవరకు ఎకానమీలో వాహనాన్ని నడిపితే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు.

2. రెండోది అగ్రెసివ్ లేదా ర్యాష్ డ్రైవింగ్ కు దూరంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల వాహన ఇంజన్ పై అధికంగా పడే ఒత్తిడి తగ్గి ఇంధన వినియోగం తగ్గుతుంది.

3. కారును స్టార్ట్ చేసి ఎక్కువ సమయం ఖాళీగా ఉంచటం వల్ల ఇంధనం ఎక్కువగా వృధా అవుతుంది. కారు నడవకపోయినప్పటికీ ఇంధనం మాత్రం ఖర్చవుతుంది. ప్రస్తుతం ఆధునిక కార్లలో ఉండే ఏర్పాటు వల్ల ఇంజన్ అవసరాలను అనుగుణంగా ఇంధనం వెళుతుంది. కానీ.. అనేక సార్లు ఆన్, ఆఫ్ చేయడం వల్ల కారు ఎక్కువ ఇంధనాన్ని వాడుతుందని అనేక మంది పొరబడుతుంటారు. అది అవాస్తవం. అందువల్ల అనవసరంగా కారు ఆన్ లో ఉంచే పద్ధతికి వాహనదారులు విడిచిపెట్టాలి. దీని వల్ల వృధాగా అవుతున్న ఖర్చును వీనైనంత తగ్గించవచ్చు.

4. చాలా మందికి హడావిడికి బయలుదేరే కంగారులో కారు టైర్లలోని గాలి సరైన రీతిలో ఉందోలేదో గమనించరు. కారు సరైన వేగంలో ప్రయాణించడానికి టైర్లు సరిగా గాలితో నింపి ఉండాలి. అప్పుడే అవి రోడ్డుపై వెళ్లేటప్పుడు సరైన వేగంతో ప్రయాణించేందుకు వాహనం సహకరిస్తుంది. దీని వల్ల ఇంజిన్ నుంచి వచ్చే వేగాన్ని ఉత్తమంగా కారు వినియోగించుకుంటుంది.

5. వీటన్నింటికీ తోడు కారు సరిగా మెయింటెన్ చేయడం కూడా చాలా ముఖ్యం. సరైన సమయానికి వాహనానికి రిపేర్, మెయింటెనెన్స్ చేయించటం వల్ల దీర్ఘకాలంలో కారుకు అయ్యే ఖర్చును తగ్గించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంధనానికి చేసే ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుందని చెప్పుకోవచ్చు. సరైన సమయానికి ఇంజిన్ ఆయిల్ మార్చటం, జనరల్ సర్వీసింగ్ సరైన సమయంలో చేయించటం వల్ల ఖర్చును నియంత్రించవచ్చు. మీ ఇంజిన్ పనితీరు ఆప్టిమైజ్ చేయడానికి.. ఆక్సిజన్ సెన్సార్‌లు, స్పార్క్ ప్లగ్‌లు, ఇతర పరికరాలు సరిగా పనిచేసేలా చూసుకోవాలి.

ఇవీ చదవండి.. 

LIC Policy: రోజుకు కేవలం రూ. 262 ఇన్వేస్ట్ చేసి.. రూ. 20 లక్షలు పొందండి..

Nawab Family For 2600 Crores: పూర్వీకుల ఆస్తి కోసం 50 ఏళ్ల న్యాయపోరాటం.. రూ. 2600 కోట్ల ఆస్తి దక్కించికున్న వారసులు.. ఎలాగంటే..