AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tier-2 Cities: నెలకు రూ.1 లక్ష ఆదా.. ఈ నగరాల్లో ఇలాంటి సాలరీ ఉన్నా మహరాజులే..!

Tier-2 Cities: హైదరాబాద్ లాంటి నగరాలు సరైన ప్రణాళికాబద్ధమైన అభివృద్ధితో మెరుగైన ఫలితాలు సాధిస్తుంటే, ముంబై లాంటి పాత నగరాలు సామాన్యులకు భరించలేని ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. ప్రభుత్వాలు, విధాన నిర్ణేతలు ఈ మార్పును గమనించి టైర్-2 నగరాల్లో మౌలిక సదుపాయాలను..

Tier-2 Cities: నెలకు రూ.1 లక్ష ఆదా.. ఈ నగరాల్లో ఇలాంటి సాలరీ ఉన్నా మహరాజులే..!
Tier 2 Cities
Subhash Goud
|

Updated on: May 19, 2026 | 7:48 AM

Share

Tier-2 Cities: భారతీయుల ఆలోచనా విధానంలో ఇప్పుడు విప్లవాత్మక మార్పు వస్తోంది. ఒకప్పుడు ఉద్యోగం, వ్యాపారం అంటే ముంబై, బెంగళూరు, ఢిల్లీ లాంటి మహానగరాల వైపే చూసేవారు. కానీ ఇప్పుడు మెట్రో నగరాలను వదిలి, టైర్-2 నగరాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. టైర్-2 నగరాల్లో నివసించడం వల్ల నెలకు అక్షరాలా రూ.30 వేల నుండి రూ.1 లక్ష వరకు ఆదా చేసుకునే అవకాశం ఉండటమే. ముంబై లాంటి నగరాల్లో జీవన వ్యయం నెలకు రూ.2.4 లక్షలకు చేరడం ఈ మార్పు తీవ్రతను స్పష్టం చేస్తోంది.

మారిన యువత ఆలోచన:

గతంలో మెట్రో నగరాలకు వెళ్తేనే మంచి కెరీర్, మెరుగైన జీవన ప్రమాణాలు దొరుకుతాయని అంతా భావించేవారు. ఆర్థికంగా, మానసికంగా ఎంతో భారం పడినా సరే భవిష్యత్తు కోసం ఆ నగరాల్లోనే ఇరుకు గదుల్లో, ట్రాఫిక్ నరకంలో బతకడానికి ఇష్టపడేవారు. కానీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపడటం, రిమోట్ వర్క్ (Work from Home) విధానం పెరగడంతో ఇప్పుడు అవకాశాల కోసం కేవలం మహానగరాలపైనే ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది.

ఇది కూడా చదవండి: Petrol, Diesel Prices: వాహనదారులకు బిగ్‌ షాక్‌.. మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

ఇవి కూడా చదవండి

జీవన ప్రమాణాల సూచీ

తాజా గణాంకాలను పరిశీలిస్తే, జీవన నాణ్యత విషయంలో టైర్-2 నగరాలు మెట్రో నగరాలకు గట్టి పోటీ ఇస్తున్నాయి. చిన్న నగరాల్లో వసతులు ఉండవనే పాత అపోహను ఈ కొత్త గణాంకాలు పూర్తిగా చెరిపేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Big Alert: సామాన్యుడికి మరో షాక్.. పెట్రోల్, డీజిల్ తర్వాత ఇప్పుడు ఈ వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం..!

  • హైదరాబాద్: 176.46 స్కోరుతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
  • పుణె: 166.30 స్కోరుతో తర్వాతి స్థానాన్ని దక్కించుకుంది.
  • చెన్నై: 140.68 స్కోరు సాధించింది.

మెట్రోలకు పోటీగా నిలిచిన టైర్-2 నగరాలు:

  • భువనేశ్వర్: 143.40
  • సూరత్: 142.67
  • కోయంబత్తూరు: 136.17

నెలవారీ ఖర్చుల్లో భారీ వ్యత్యాసం:

జీవన ప్రమాణాలు దాదాపు సమానంగా ఉన్నప్పటికీ, నెలవారీ అయ్యే ఖర్చుల విషయంలో మాత్రం ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. ఒక సాధారణ కుటుంబం సౌకర్యవంతమైన జీవితం గడపడానికి వివిధ నగరాల్లో అయ్యే సగటు ఖర్చుల వివరాలు ఇలా ఉన్నాయి.

నగరం – సగటు నెలవారీ ఖర్చు

  • ముంబై – రూ.2.4 లక్షలు
  • బెంగళూరు – రూ.1.4 లక్షలు
  • ఢిల్లీ – రూ.1.2 లక్షలు
  • కొచ్చి- రూ.97 వేలు
  • చండీగఢ్ -రూ. 94 వేలు
  • సూరత్ -రూ. 88 వేలు

ఇది కూడా చదవండి: Gold Price Today: మరింత తగ్గుతున్న బంగారం ధరలు.. నాలుగు రోజుల్లో ఎంత తంగ్గిందంటే..

టైర్-2 నగరాల వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణాలు:

1. ఆర్థిక లబ్ధి: మెట్రో నగరాలతో పోలిస్తే ఇళ్ల అద్దెలు, నిత్యావసరాల ఖర్చులు తక్కువగా ఉండటంతో ప్రతి నెలా రూ.30,000 నుండి రూ.1,00,000 వరకు మిగులుతోంది.

2. ప్రశాంతమైన జీవనం: గంటల తరబడి వేధించే ట్రాఫిక్ కష్టాలు లేకపోవడం, స్వచ్ఛమైన వాతావరణం ఉండటం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతోంది.

3. సమయం ఆదా: ఆఫీసులకు వెళ్లే సమయం తగ్గడం వల్ల కుటుంబంతో గడపడానికి ఎక్కువ సమయం దొరుకుతోంది.

హైదరాబాద్ లాంటి నగరాలు సరైన ప్రణాళికాబద్ధమైన అభివృద్ధితో మెరుగైన ఫలితాలు సాధిస్తుంటే, ముంబై లాంటి పాత నగరాలు సామాన్యులకు భరించలేని ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. ప్రభుత్వాలు, విధాన నిర్ణేతలు ఈ మార్పును గమనించి టైర్-2 నగరాల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిస్తే.. అవే మన దేశ భవిష్యత్ ఆర్థిక కేంద్రాలుగా మారతాయి. భవిష్యత్తులో దేశ పట్టణాభివృద్ధి కేవలం కొన్ని పెద్ద నగరాలకే పరిమితం కాకుండా దేశమంతటా విస్తరించబోతోందని ఈ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us