Indian Railways: ఇదో రికార్డ్‌.. రైలులో టికెట్‌ లేకుండా ప్రయాణం.. ఏకంగా రూ.1.72 లక్షల జరిమానా

Indian Railways: కొందరు రైలులో ప్రయాణించేటప్పుడు టికెట్‌ లేకుండా ఎక్కుతారు. ఇలాంటి ప్రయాణికులకు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇలా టికెట్‌ లేకుండా ప్రయాణించడం నేరం. దీనికి జరిమానా, కేసులు అనుభవించాల్సి ఉంటుంది. అలాంటి ఓ రైలులో ప్రయాణికులకు షాకింగ్‌ ఘటన ఎదురైంది..

Indian Railways: ఇదో రికార్డ్‌.. రైలులో టికెట్‌ లేకుండా ప్రయాణం.. ఏకంగా రూ.1.72 లక్షల జరిమానా

Updated on: Jul 02, 2025 | 5:28 PM

ప్రతిరోజు లక్షలాది మంది భారతీయ రైల్వే ద్వారా ప్రయాణిస్తారు. ఇది చౌకైన, సౌకర్యవంతమైన ప్రయాణం ఉండటం కారణంగా సామాన్యుడి నుంచి ఉన్నతమైన వర్గాల వరకు రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. అయితే రైలు ప్రయాణం చేయాలంటే ముందుగా రైల్వేకు సంబంధించిన నియమాలు తెలిసి ఉండాలి. లేకుంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

కానీ చాలా సార్లు చాలా మంది ప్రయాణికులు రైల్వేలో ప్రయాణించేటప్పుడు టిక్కెట్లు తీసుకోరు. అటువంటి పరిస్థితిలో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. రైలులో ప్రయాణించేటప్పుడు టీటీఈ చెకింగ్‌లో పట్టుబడితో జరిమానా చెల్లించాల్సి ఉంటుందని గుర్తించుకోండి. ఇటీవల ఇలాంటి కేసు వెలుగులోకి వచ్చింది. దీనిలో తనిఖీ ప్రచారం కింద రైల్వే టీటీఈ ఒక రోజులో ప్రయాణికుల నుండి రూ. 1.72 లక్షల జరిమానా వసూలు చేశాడు. మరి ఇంత ఎలా వసూలు చేశారో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: HDFC: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. జూలై 3 నుంచి బ్యాంకు సేవల్లో అంతరాయం

నాగ్‌పూర్ చీఫ్ టికెట్ ఎగ్జామినర్ అలోక్ కుమార్ ఝా రైలు నంబర్ 03251లో తనిఖీలు చేపట్టారు. ఇందులో 220 మంది టికెట్‌ లేకుండా ప్రయాణించే ప్రయాణికుల నుంచి రూ.1.72 లక్షల వరకు జరిమానా వసూలు చేయడం ద్వారా ఒక రోజు ఆదాయంలో కొత్త రికార్డు సృష్టించారు. ఆయన అప్రమత్తత, అంకితభావం నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడంలో, అలాగే ఆదాయాన్ని పెంచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ హెడ్ టికెట్ ఎగ్జామినర్ అలోక్‌ కుమార్‌ ఝా నాగ్‌పూర్‌లో నియమితులయ్యారు.

ఇది కూడా చదవండి: Multibagger Stock: కళ్లు చెదిరిపోయే లాభం.. రూ. లక్ష పెట్టుబడితో రూ.85 లక్షల రాబడి.. ధనవంతులను చేసిన స్టాక్‌

ఏ రైలులో జరిమానా వసూలు చేశారు?

03251 రైలులో చెల్లుబాటు అయ్యే టిక్కెట్లు లేకుండా ప్రయాణించే 220 మంది ప్రయాణికుల నుండి హెడ్ టికెట్ ఎగ్జామినర్ అలోక్ కుమార్ ఝా రూ.1.72 లక్షలు వసూలు చేయడం ద్వారా రికార్డు సృష్టించారు. ఇది దానాపూర్ నుండి SMVT బెంగళూరుకు నడిచే DNR SMVB SPL రైలులో జరిగింది.

సోషల్ మీడియాలో ప్రజలు ప్రశంసలు:

టీటీఈపై సోషల్ మీడియాలో ప్రజలు ప్రశంసిస్తున్నారు. అలోక్ ఝా అంకితభావాన్ని ప్రతిచోటా ప్రశంసిస్తున్నారు. నిజాయితీని ప్రోత్సహించడానికి, అక్రమంగా ప్రయాణించే వారిని పట్టుకోవడానికి కొందరు టీటీఈకి సూచనలు కూడా ఇచ్చారు. గతంలో ఇటీవల సెంట్రల్ రైల్వేలోని ముంబై డివిజన్‌లో కూడా టికెట్ తనిఖీ ప్రచారం నిర్వహించారు. దీనిలో సబర్బన్ రైళ్లలోని ఫస్ట్ క్లాస్ కోచ్‌లలో 984 టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్న వారిపై కేసులు నమోదు అయ్యాయి. అలాగే వారిపై రూ.3.18 లక్షల జరిమానా వసూలు కూడా వసూలు చేశారు.

 


ఇది కూడా చదవండి: Viral Video: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. రీల్స్ చేద్దామని వెళ్తే.. చివరికి జరిగిందిదే

ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ 20వ విడత వచ్చేది అప్పుడే..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి