Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATM Withdrawal Charges: ఖాతాదారులపై ఏటీఎం ఉపసంహరణ చార్జీల పిడుగు.. ఆ బ్యాంకుల్లోనే అత్యధికం..

రెండు దశాబ్దాలుగా బ్యాంకింగ్‌ రంగంలో ఏటీఎం సేవలు విపరీతంగా ప్రజాదరణ పొందాయి. అయితే మొదట్లో ఈ సేవలను ఉచితంగా అందించిన బ్యాంకులు క్రమేపి చార్జీలు వసూలు చేయడం ప్రారంభించాయి. ప్రతి నెలా, బ్యాంకులు నిర్ణీత సంఖ్యలో ఉచిత ఏటీఎం లావాదేవీలను మాత్రమే అందిస్తాయి. అయితే ఎంచుకున్న పొదుపు ఖాతా రకాన్ని బట్టి కూడా ఇది మారుతుంది. నిర్ణీత పరిమితిని దాటినప్పుడు ఆర్థిక, ఆర్థికేతర సేవలతో సహా ఏవైనా అదనపు లావాదేవీలపై బ్యాంకులు రుసుము విధిస్తాయి.

ATM Withdrawal Charges: ఖాతాదారులపై ఏటీఎం ఉపసంహరణ చార్జీల పిడుగు.. ఆ బ్యాంకుల్లోనే అత్యధికం..
Atm
Follow us
Srinu

|

Updated on: Aug 04, 2023 | 4:15 PM

ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన టెక్నాలజీ కారణంగా వివిధ రంగాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగంలో చెప్పుకోదగిన మార్పులు వచ్చాయి. రెండు దశాబ్దాలుగా బ్యాంకింగ్‌ రంగంలో ఏటీఎం సేవలు విపరీతంగా ప్రజాదరణ పొందాయి. అయితే మొదట్లో ఈ సేవలను ఉచితంగా అందించిన బ్యాంకులు క్రమేపి చార్జీలు వసూలు చేయడం ప్రారంభించాయి. ప్రతి నెలా, బ్యాంకులు నిర్ణీత సంఖ్యలో ఉచిత ఏటీఎం లావాదేవీలను మాత్రమే అందిస్తాయి. అయితే ఎంచుకున్న పొదుపు ఖాతా రకాన్ని బట్టి కూడా ఇది మారుతుంది. నిర్ణీత పరిమితిని దాటినప్పుడు ఆర్థిక, ఆర్థికేతర సేవలతో సహా ఏవైనా అదనపు లావాదేవీలపై బ్యాంకులు రుసుము విధిస్తాయి. మరొక బ్యాంకు ఏటీఎంలో విత్‌డ్రా చేస్తే ఉచిత లావాదేవీలు, ఛార్జీలు మారుతూ ఉంటాయి.

గతేడాది జూన్‌లో ఆర్‌బీఐ బ్యాంకులు ఖాతాదారులకు అందించే నెలవారీ ఉచిత ఏటీఎం లావాదేవీలపై పరిమితి విధించింది. ఈ పరిమితి జనవరి 1, 2022 నుంచి అమల్లోకి వచ్చింది. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు బ్యాంకులు తమ ఖాతాదారులకు నెలకు 5 ఉచిత లావాదేవీలకు అనుమతినిచ్చింది. అయితే మెట్రో సిటీల్లోని ఏటీఎంల్లో అయితే మూడు లావాదేవీలు ఉచితంగా అందించాలని సూచించింది. అంతకు మించి లావాదేవీలు చేసే కస్టమర్లపై ఒక్కో లావాదేవిపై రూ.20 ప్లస్‌ ట్యాక్స్‌ విధించేలా వెసులుబాటును కల్పించింది. అధిక ఇంటర్‌చేంజ్ రుసుమును బ్యాంకులకు భర్తీ చేయడానికి, ఖర్చుల సాధారణ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని, ప్రతి లావాదేవీకి కస్టమర్ ఛార్జీలను వసూలు చేయడానికి ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ చార్జీలు గతేడాది నుంచి అమలులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఏయే బ్యాంకుల కస్టమర్లకు ఎంత మేర చార్జీలు వసూలు చేస్తున్నాయో? తెలుసుకుందాం.

ఎస్‌బీఐ ఏటీఎం ఉపసంహరణ ఛార్జీలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులు సగటు నెలవారీ బ్యాలెన్స్‌లు రూ. 25000 వరకు ఉంటే ఐదు ఏటీఎం ఉచిత లావాదేవీలను (ఆర్థిక, ఆర్థికేతర) అందిస్తుంది. అయితే నిర్ణీత పరిమితికి మించిన ఆర్థిక లావాదేవీలు చేస్తే ఎస్‌బీఐ ఏటీఎం వాడితే రూ. 10 + జీఎస్టీ, ఇతర బ్యాంక్ ఏటీఎంల్లో అయితే రూ. 20 + జీఎస్టీ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పీఎన్‌బీ బ్యాంక్‌ 

మెట్రో, నాన్-మెట్రో ప్రాంతాల్లో ఉన్న పీఎన్‌బీ ఏటీఎంల్లో నెలకు 5 ఉచిత లావాదేవీలను పొందవచ్చు. నిర్దేశించిన పరిమితి తర్వాత ప్రతి లావాదేవీకి రూ. 10 + జీఎస్టీను కస్టమర్ల నుంచి వసూలు చేస్తారు. అలాగే ఇతర బ్యాంక్‌ ఏటీఎంలను వాడితే రూ.21తో పాటుగా జీఎస్టీలు కస్టమర్ల నుంచి వసూలు చేస్తారు. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 

ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో ప్రముఖ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ తన ఏటీఎంలలో 5 ఉచిత లావాదేవీలను అందిస్తుంది. ఇతర బ్యాంకుల వద్ద బ్యాంకు మెట్రో స్థానాల్లో మూడు ఉచిత లావాదేవీలను అందిస్తుంది, ఆ తర్వాత నగదు ఉపసంహరణల కోసం రూ. 21 తో జీఎస్టీను వసూలు చేస్తుంది. 

ఐసీఐసీఐ బ్యాంక్‌ 

ఉచిత ఉపసంహరణల విషయానికి వస్తే ఐసీఐసీఐ బ్యాంక్ ఇతర బ్యాంకులు అనుసరిస్తున్న విధంగా మెట్రో సిటీల్లో 3, నాన్‌ మెట్రో సిటీల్లో 5 లావాదేవీలను ఉచితంగా అందిస్తుంది. ఈ పరిమితి దాటితే ఆర్థిక లావాదేవీకి రూ.20 ప్లస్‌ జీఎస్టీ, ఆర్థకేతర లావాదేవీకి రూ.8.50 ప్లస్‌ జీఎస్టీను ఖాతాదారుల నుంచి వసూలు చేస్తుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

హైవే హీరోస్ అంటే ఎవరు..? వారి ఆరోగ్యంపై టీవీ9 ప్రత్యేక శ్రద్ద
హైవే హీరోస్ అంటే ఎవరు..? వారి ఆరోగ్యంపై టీవీ9 ప్రత్యేక శ్రద్ద
రూ.223 కోట్ల ఆస్తులు.. రూ.48 కోట్లు విలువైన ప్రైవేట్ జెట్..
రూ.223 కోట్ల ఆస్తులు.. రూ.48 కోట్లు విలువైన ప్రైవేట్ జెట్..
ఎవరూ లేకుండానే బాలికల హాస్టల్ బాత్రూం నుంచి చప్పుళ్లు..
ఎవరూ లేకుండానే బాలికల హాస్టల్ బాత్రూం నుంచి చప్పుళ్లు..
ప్రపంచంలోనే మొట్టమొదటి తలకిందులుగా నడిచే కారు.. దీని ప్రత్యేకతలు!
ప్రపంచంలోనే మొట్టమొదటి తలకిందులుగా నడిచే కారు.. దీని ప్రత్యేకతలు!
ఆ నీలి ఆకాశమే ఈ సుకుమారి స్పర్శకై చీరగా మారింది.. గార్జియస్ రీతు.
ఆ నీలి ఆకాశమే ఈ సుకుమారి స్పర్శకై చీరగా మారింది.. గార్జియస్ రీతు.
గురువు కటాక్షం.. ఆ రాశుల వారి జీవితాల్లో శుభ కార్యాల వెల్లువ..!
గురువు కటాక్షం.. ఆ రాశుల వారి జీవితాల్లో శుభ కార్యాల వెల్లువ..!
అరే.. అషు రెడ్డికి ఏమైంది? ఆస్పత్రిలో బిగ్ బాస్ బ్యూటీ.. వీడియో
అరే.. అషు రెడ్డికి ఏమైంది? ఆస్పత్రిలో బిగ్ బాస్ బ్యూటీ.. వీడియో
చంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా వెతికిన తండ్రి.. ఏంటి మావా ఇది
చంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా వెతికిన తండ్రి.. ఏంటి మావా ఇది
చుండ్రు తగ్గాలన్నా.. జుట్టు పెరగాలన్నా.. టమాటాలను ఇలా వాడితే ..
చుండ్రు తగ్గాలన్నా.. జుట్టు పెరగాలన్నా.. టమాటాలను ఇలా వాడితే ..
హైదరాబాద్లో అత్యాధునిక చిన్న ఆయుధాల తయారీ కేంద్రం ప్రారంభం
హైదరాబాద్లో అత్యాధునిక చిన్న ఆయుధాల తయారీ కేంద్రం ప్రారంభం