India Post Payments: వచ్చే ఏడాది జనవరి 1 నుంచి బ్యాంకింగ్ రంగంలో కొత్త నిబంధనలు అందుబాటులోకి రానున్నాయి. ఆర్బీఐ నిబంధల ప్రకారం ఈ కొత్త మార్పులు జరగనున్నాయి. ఇక ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఖాతా ఉన్న వారు ఈ ఏడాది నుంచి క్యాష్ విత్‌డ్రా చేసినా, డిపాజిట్ చేసినా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు జనవరి 1, 2022 నుంచి అమల్లోకి రానున్నాయి. డబ్బుల ఉపసంహరణ, డిపాజిట్ లావాదేవీలపై ఛార్జీలు ఉంటాయని ఇండియా పేమెంట్ బ్యాంక్ తెలిపింది. పరిమితి దాటితే ఛార్జీలు ఉంటాయని వెల్లడించింది.
వేర్వేరు ఛార్జీలు..
అయితే ఈ ఛార్జీలు అందరికి ఒకేలా ఉండవు. వేర్వేరు ఛార్జీలు ఉంటాయి. బేసిక్ సేవింగ్స్ ఖాతా ఉన్నవారికి నెలకు నాలుగు సార్లు డబ్బులను ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉపసంహరించకోవచ్చు. కానీ ఆ తర్వాత డబ్బులు ఉపసంహరించుకుంటే ఛార్జీలు తప్పవు. మొత్తంలో 0.50 శాతం లేదా కనీసం రూ.25 లావాదేవీకి ముట్టజెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఖాతా ఉన్నవారు క్యాష్ డిపాజిట్ చేసుకోవడం ఉచితం. ఎలాంటి ఛార్జీలు ఉండవు.
ఇతర పొదుపు ఖాతాలున్నవారు నెలకు రూ.25వేల వరకు విత్‌డ్రా చేసుకునేందుకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఇది పూర్తిగా ఉచితం. ఆ తర్వాత విత్‌డ్రా చేసుకుంటే మొత్తం 0.50 శాతం లేదా కనీసం రూ.25 వరకు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ ఖాతా కలిగిన వారు రూ.10వేల వరకు క్యాష్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఛార్జీలు ఉండవు. కానీ రూ.10వేలకుపైగా డిపాజిట్ చేసుకుంటే 0.50 శాతం లేదా రూ.25 ప్రతి లావాదేవీకి ఛార్జీలు ఉంటాయి. ఈ నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కస్టమర్ల ఈ విషయాలను గమనించడం తప్పనిసరి. లేకుంటే ఎక్కువ విత్‌డ్రాలు చేసుకుంటే అదనంగా ఛార్జీల బదులు తప్పనిసరి ఉంటుంది.
ఇవి కూడా చదవండి: