Bank Loans: వ్యక్తిగత రుణాలపై తక్కువ వడ్డీ వసూలు చేస్తున్న ఆ ఐదు బ్యాంకులు..

|

Nov 28, 2021 | 12:11 PM

దీపావళి పండుగ ముగిసినా అనేక బ్యాంకులు రుణాలపై ఆఫర్లు అందిస్తూనే ఉన్నాయి. తక్కువ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపులు కూడా ఇస్తున్నాయి. తక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్న ఆ ఐదు బ్యాంకులు ఏమిటో చూద్దాం...

Bank Loans: వ్యక్తిగత రుణాలపై తక్కువ వడ్డీ వసూలు చేస్తున్న ఆ ఐదు బ్యాంకులు..
Bank
Follow us on

దీపావళి పండుగ ముగిసినా అనేక బ్యాంకులు రుణాలపై ఆఫర్లు అందిస్తూనే ఉన్నాయి. తక్కువ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపులు కూడా ఇస్తున్నాయి. తక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్న ఆ ఐదు బ్యాంకులు ఏమిటో చూద్దాం.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదేళ్ల కాలపరిమితితో రూ. 5 లక్షల వ్యక్తిగత రుణంపై 8.9 శాతం వడ్డీ వసూలు చేస్తుంది. ఈక్వేటెడ్ నెలవారీ వాయిదాలు (EMI) రూ. 10,355 కట్టాల్సి ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కూడా అదే వడ్డీ రేటును అందిస్తున్నాయి. ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు కూడా ఇస్తున్నాయి.

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ష IDBI బ్యాంక్ తమ ఖాతాదారులకు వ్యక్తిగత రుణాలపై 9.5 శాతం వడ్డీ వసూలు చేస్తుంది. మీరు ఈ బ్యాంకుల నుండి ఐదేళ్ల కాలవ్యవధితో రూ. 5 లక్షల వ్యక్తిగత రుణాన్ని తీసుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 10,501 ఈఎంఐని చెల్లించాల్సి ఉంటుంది.

దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్‎బీఐ కూడా ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు ఇస్తోంది. వ్యక్తిగత రుణాలపై 9.6 వడ్డీ రేటు వసూలు చేస్తోంది. మీరు ప్రతి నెల రూ. 10,525 EMIగా చెల్లించాల్సి ఉంటుంది. నవంబర్ 18, 2021 నాటికి సంబంధిత బ్యాంకుల వెబ్‌సైట్ నుండి సేకరించబడిన డేటా ఆధారంగా వడ్డీ రేట్లను పేర్కొన్నారు.

Read Also.. Sovereign Gold Bond Scheme: సోమవారం నుంచి గోల్డ్ బాండ్ అమ్మకాలు.. ఎలా కొనుగోలు చేయాలంటే..

SIP calculator: 25 సంవత్సరాల్లో రూ.10 కోట్లు రావాలంటే.. సిప్ ఎంత కట్టాలి..

Post Office Savings Scheme: పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాల్లో అధిక వడ్డీ వస్తున్న స్కీం ఏదంటే..