Gold Investment: బంగారంపై పెట్టుబడులకు ఇవే బెస్ట్ ఆప్షన్లు.. అధిక రాబడితో పాటు పూర్తి భద్రత
చాలా మంది బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. బంగారంపై పెట్టుబడి పెట్టడం అనేది దీర్ఘకాలంలో ఎక్కువ ప్రయోజనాలను కలుగజేస్తుంది. బంగారం ధరలలో ప్రస్తుత అస్థిరతను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడిదారులు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. దానిని పోర్ట్‌ఫోలియో డైవర్సిఫైయర్‌గా పరిగణించాలి.

బంగారం రేటు అంతకంతకూ పెరుగుతూనే ఉంది. సాధారణంగా మార్కెట్లో ఏదైనా రేటు పెరిగితే దాని డిమాండ్ తగ్గుతూ వస్తుంది. అయితే ఒక్క బంగారం విషయంలోమాత్రమే దీనికి విరుద్ధంగా ఉంటుంది. రేటు ఎంత పెరుగుతున్న డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. మన దేశంలో అయితే బంగారం చాలా సెంటిమెంట్‌తో కూడుకున్నది. కొంత కాలం క్రితం వరకూ కేవలం అలంకరణ కోసం ఉపయోగించిన ఈ బంగారం ఇటీవల కాలంలో మంచి పెట్టుబడి సాధనంగా కూడా మారిపోయింది. ప్రస్తుతం గోల్డ్‌పై ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అందుకు ప్రధాన కారణంగా ఏటేటా గోల్డ్ రేట్లు సరికొత్త గరిష్టాలను తాకడమే. ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాభాలే తప్ప ఎలాంటి నష్టాలు ఉండవనే అంచనాకు ప్రజలు వచ్చారు. అయితే బంగారంపై పెట్టుబడి ఎలా పెట్టాలి? వాటిల్లో అధిక రాబడితో పాటు సురక్షితంగా ఉండే మార్గాలేంటి? నిపుణులు ఏం చెబుతున్నారు. తెలుసుకుందాం రండి.
గరిష్ట స్థాయికి బంగారం ధర..
బంగారం ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. పది గ్రాములకు బంగారం రూ. 67,000లను క్రాస్ చేసింది. గత ఏడాదిలో దేశీయంగా బంగారం ధరలు 15% పెరిగాయి. ఇక రెండు, మూడేళ్లలో వరుసగా 25% నుంచి 45% వరకూ పెరిగాయి. ఐదేళ్ల కాలానికి దేశీయ మార్కెట్‌లో బంగారం ధర రెండింతలు పెరిగింది. కనుక బంగారంలో పెట్టుబడి పెట్టడం అనేది ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా తీసుకునే రక్షణగా భావించవచ్చు. ప్రపంచ రాజకీయ, ఆర్థిక అనిశ్చితికి నిరోధంగా కూడా పనిచేస్తుంది.
పెట్టుబడులు పెరుగుతున్నాయ్..
చాలా మంది బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. బంగారంపై పెట్టుబడి పెట్టడం అనేది దీర్ఘకాలంలో ఎక్కువ ప్రయోజనాలను కలుగజేస్తుంది. బంగారం ధరలలో ప్రస్తుత అస్థిరతను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడిదారులు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. దానిని పోర్ట్‌ఫోలియో డైవర్సిఫైయర్‌గా పరిగణించాలి. పోర్ట్‌ఫోలియోలో 10% నుంచి 15% కేటాయింపును ఉంచడం మార్కెట్ల హెచ్చు తగ్గులను అధిగమించడానికి సహాయపడుతుంది. యూఎస్ ఆర్థిక విధానం, ఫెడ్‌పై స్పష్టత వెలువడే వరకు భవిష్యత్తులో ధరలలో అస్థిరతను కొనసాగుతుందని భావించవచ్చు. సాధారణంగా బంగారంపై పెట్టుబడులు అంటే భౌతిక బంగారం కొనడం, గోల్డ్ కాయిన్లు కొనడం, గోల్డ్ బాండ్లు తీసుకోవడం, డిజిటల్ గోల్డ్ కొనడం, గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) వంటివి ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడు గోల్డ్ బాండ్లు, ఈటీఎఫ్‌లలో పెట్టుబడుల వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం..
గోల్డ్ ఈటీఎఫ్‌లు..
బంగారం కోసం పెట్టబడి పెట్టడానికి గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లు అనుకూలంగా ఉంటాయి. పెట్టు బడిదారులు వీటికోసం అన్వేషించాలి. ఇవి 24 క్యారెట్ ఫిజికల్ గోల్డ్ స్కీమ్‌ల ద్వారా మద్దతు నిచ్చే ఓపెన్-ఎండ్ మ్యూచువల్ ఫండ్స్. ట్రాకింగ్ లోపాలకు లోబడి ఫిజికల్ గోల్డ్‌పై నిజమైన రాబడిపై రిటర్న్‌లు బెంచ్‌మార్క్ చేయబడతాయి. గోల్డ్ ఈటీఎఫ్ ల ద్వారా ఫిబ్రవరిలో రూ.997 కోట్టు పెట్టుబడులుగా వచ్చినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈక్విటీ మార్కెట్లు ఖరీదైనవి కావడంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వివిధ మార్గాల వైపు మళ్లించడం అనివార్యమవుతోంది. ఈ నేపథ్యంలో పారదర్శకత, లిక్విడిటీ, స్టోరేజ్ చార్జీలు లేకపోవడం వంటి కారణాలతో గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడం మంచింది.
సావరిన్ బంగారు బాండ్లు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చివరి విడతగా ఫిబ్రవరి 16న ముగిసిన సావరీన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)కు సంబంధించి ప్రాథమిక వివరాలను తెలుసుకోవాలి. ఈ బాండ్లు తగ్గింపుతో అందుబాటులో ఉంటే పెట్టుబడిదారులు వాటిని సెకండరీ మార్కెట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. సెకండరీ మార్కెట్‌లో ఈ బాండ్ల కోసం పోటీ తక్కువగా ఉంది. దీంతో కొనుగోలుదారులు తక్కువగా ఉన్నందున విక్రేతలు వాటిని తక్కువ ధరకు అందిస్తారు. ఎస్ జీబీలలో పెట్టుబడి పెట్టడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పెట్టుబడిదారులు ఏడాదికి 2.5% చొప్పున స్థిరమైన వడ్డీ రేటు పొందుతారు. పెట్టుబడిదారు ఆదాయాన్ని బట్టి పన్ను విధిస్తారు. ఎస్ జీబీల ప్రధాన పెట్టుబడిపై ప్రభుత్వం భద్రతను కల్పిస్తుంది. బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఎస్ జీబీలు మంచి మార్గాన్ని చూపిస్తాయి. స్థిర ఆదాయ ప్రయోజనాలను పొందేలా వీలు కల్పిస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








