
Budget Bikes In India: కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ రేట్లను సవరించిన విషయం తెలిసిందే. వాహనాలపై జీఎస్టీ రేట్లను తగ్గించడంతో బైక్, కార్ల ధరలు భారీగా దిగొచ్చాయి. 350సీసీ కంటే తక్కువ ఇంజిన్ల కలిగిన బైక్‌లపై గతంలో 28 శాతం జీఎస్టీ ఉండేది. కానీ దీనిని 18 శాతానికి తగ్గించడంతో బైక్ ధరలు ఊహించని విధంగా పడిపోయాయి. దీని వల్ల బైక్‌లు కొనుగోలు చేయాలనుకునే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఊరట లభించింది. పెట్రోల్ ధరలు భగ్గుమంటుండటంతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్‌లను కొనుగోలు చేసేందుకు మధ్యతరగతి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తతం మార్కెట్లో తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్‌లు చాలానే ఉన్నాయి. రూ.80 వేల లోపు ధరలో లభిస్తున్న బెస్ట్ బైక్‌ల గురించి తెలుసుకుందామా..?
ఇండియాలో అత్యంత పాపులర్ అయిన 100cc బైక్‌లలో ఇది ఒకటి. 97.2cc ఇంజిన్‌తో ఉన్న ఈ బైక్.. 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోంది. దీనిలో ఉన్న హీరోకు చెందిన i3S టెక్నాలజీ ట్రాఫిక్‌లో పెట్రోల్‌ను ఆదా చేయడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.73,764గా ఉంది.
ఈ బైక్ 97.2cc ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది ఒక లీటర్‌కు 70 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 58,020గా ఉంది. ఇండియాలో ఎక్కువగా అమ్ముడుపోయే బైక్‌లలో ఇది ఒకటిగా ఉంది. తక్కువ తరకే లభించడం, ఎక్కువ మైలేజ్ వస్తుండటంతో మధ్యతరగతి ప్రజలు ఈ బైక్‌లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
98.98 సీసీ ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్ 65 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.63,441గా కొనసాగుతోంది.
ఈ బైక్ ఒక లీటర్‌కు 75 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది సుదీర్ఘ ప్రయాణాలు వెళ్లేవారికి ఇది మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.67,808గా ఉంది.
స్టైల్‌తో పాటు ప్రాక్టికాలిటీని కోరుకునే రైడర్లకు ఈ బైక్ మంచి ఎంపికగా చెప్పవచ్చు. 97.2cc ఇంజిన్‌తో ఉన్న ఈ బైక్.. సెమీ-డిజిటల్ కన్సోల్, USB ఛార్జర్ వంటి ఫీచర్లనువకలిి ఉంది. దాదాపు 60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తున్న ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.76,636గా ఉంది.