ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం గణనీయంగా పెరిగింది. ఆర్థిక లావాదేవీల్లో అధిక శాతం క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారానే జరుగుతున్నాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డులపై ఆర్థిక సంస్థలు అందిస్తున్న ఆఫర్లు, క్యాష్ బ్యాక్ లు వినియోగదారులను వాటిని విరివిగా వినియోగించేలా ప్రోత్సహిస్తున్నాయి. ఫలితంగా ఒక్కొక్కరి దగ్గర ఒకటికి మించి క్రెడిట్ కార్డులుంటున్నాయి. రెండు మూడు ఆర్థిక సంస్థల నుంచి కార్డులను తీసుకొని వినియోగించే వారు ఉంటున్నారు. అయితే ఎప్పుడైనా అనుకోని సందర్భంలో మీ క్రెడిట్ కార్డు ఎక్కడైన పోగొట్టుకుంటే.. లేదా ఎవరైనా దొంగిలస్తే.. అప్పుడు ఏం చేయాలి? మీ కార్డును మీ ప్రమేయం లేకుండా లావాదేవీలు జరగకుండా ఎలా కాపాడుకోవాలి? తెలుసుకుందాం రండి..
దురదృష్టవశాత్తూ మీరు క్రెడిట్ కార్డు పోగొట్టుకున్నారనుకోండి.. ఆ సందర్భంలో వేరే వారు కార్డు ద్వారా లావాదేవీలు జరిపితే మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. అందుకే అటువంటి పరిస్థితిని అధిగమించేందుకు అవసరమైన టిప్స్ మీకోసం అందిస్తున్నాం. మొదటిగా మీరు కార్డు పొగొట్టుకొన్న సమయంలో మీరు చేయాల్సిందేంటి అంటే ఆ కార్డు జారీ చేసిన ఆర్థిక సంస్థకు తెలియజేయాలి. అవసరమైతే ఆ కార్డును పూర్తిగా బ్లాక్ చేయమని కోరాలి. అప్పుడు దాని ద్వారా ఎవరూ లావాదేవీలు జరపలేరు. మీకు కొన్ని రోజుల్లోనే కొత్తకార్డును ఆ సంస్థ జారీచేస్తుంది.
కార్డు పోయిన లేదా దొంగిలించబడిన సందర్భంలో మొదటిగా ఆ కార్డు జారీ చేసిన సంస్థకు తెలియజేసి దానిని బ్లాక్ చేయించడంతో పాటు అదనంగా దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం మంచిది. ఇది చర్య వల్ల మీ కార్డును భవిష్యత్తులో కూడా ఎవరూ వినియోగించినా ఇబ్బంది ఉండదు. అలాగే మీ క్రెడిట్ బిల్లును కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. మీ ప్రమేయం లేకుండా జరిగే లావాదేవీలు ఏమైనా ఉంటే అ ప్పుడు తెలుసిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ క్రెడిట్ పోగొట్టుకున్నా ఆర్థికంగా మీరు నష్టపోకుండా చూసుకొనే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..