పండుగలు, సెలవులు ఎక్కువగా వచ్చినప్పుడు సాధారణంగా మార్కెట్ కు జోష్ వస్తుంది. ఎందుకంటే ఆ సమయంలోనే అందరూ ఎక్కువగా షాపింగ్ లు చేస్తుంటారు. అది ఆన్లైన్ అయినా, ఆఫ్ లైన్ అయినా కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా అందరూ ఆన్ లైన్ బాట పడుతున్నారు. అందులోనూ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారాలు అన్నీ పలు ఫెస్టివల్ ఆఫర్లు ప్రకటిస్తుడటంతో ఎక్కువ వాటిల్లో కొనుగోళ్లు చేస్తున్నారు. అయితే ఇదే ఆన్ లైన్ స్కామర్లకు వరంలా మారింది. సులువుగా మోసం చేసేందుకు, వినియోగదారుల పర్సు ఖాళీ చేసేందుకు అవకాశం ఏర్పడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఆన్ లైన్లో షాపింగ్ చేసేటప్పుడు కొన్ని సేఫ్టీ టిప్స్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవి క్రమం తప్పకుండా పాటిస్తే ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..
నార్టన్స్ హాలీడే సైబర్ సేఫ్టీ ఇన్ సైట్స్ అనే సంస్థ హాలిడే సీజన్లో డిజిటల్ భద్రతకు సంబంధించి వినియోగదారుల అనుభవాలు, వారు అనుసరిస్తున్న విధానాలను విశ్లేషిస్తుంది. ఆ సంస్థ అందించిన నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 98% మంది వినియోగదారులు తమ హాలిడే షాపింగ్‌లో కొంత భాగాన్ని ఆన్‌లైన్‌లో చేయాలనే యోచనలో ఉన్నారు. అయితే వీరిలో సగం కంటే ఎక్కువ మంది (56%) సైబర్‌క్రైమ్, ఏఐ షాపింగ్ స్కామ్‌లు లేదా థర్డ్-పార్టీ రిటైలర్‌ల బారిన పడటం గురించి ఇంకా ఆందోళన చెందుతున్నారని వివరించింది.
సైబర్ నేరగాళ్లు ప్రధానంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు (41%), థర్డ్-పార్టీ వెబ్‌సైట్‌లు (35%), ఈ-మెయిల్‌లు (32%), ఫోన్ కాల్‌లు (28%), టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా కనెక్ట్ చేయడం(26%) ద్వారా హాలిడే సీజన్‌లో వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నారు. స్కామర్లు చేసే మోసాలు ఆన్‌లైన్ షాపింగ్ స్కామ్‌లు (40%), ఫిషింగ్ స్కామ్‌లు (37%) ఉన్నాయి. ప్రతివాదులు పోస్టల్ డెలివరీ స్కామ్‌లు (31%), గిఫ్ట్ కార్డ్ స్కామ్‌లు (30%) ఉన్నాయి.
ఈ సెలవు సీజన్‌లో సైబర్ నేరాల నుంచి తమను తాము రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..