సంపాదించే డబ్బులో ఎంతో కొంత ఆదా చేసుకోవాలని ప్రతీ ఒక్కరూ ఆశిస్తుంటారు. వారి వారి ఆదాయ మార్గాలకు అనుగుణంగా సేవింగ్స్ చేస్తుంటారు. అయితే ఈ సేవింగ్స్‌ను మంచి పథకాల్లో పెట్టుబడిగా పెడితే వడ్డీ రూపంలో ఆదాయం సైతం పొందొచ్చు. అది కూడా ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడి పెడితే ఎలాంటి రిస్క్ లేకుండా మంచి ఆదాయం పొందొచ్చు. ఇలాంటి వాటిలో పోస్టాఫీస్ ఒకటి. పోస్టాఫీస్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎలాంటి రిస్క్ లేకుండా ఆదాయం పొందొచ్చు. అలాంటి కొన్ని పథకాలు, లభించే వడ్డీ రేట్లు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..
* పోస్టాఫీస్ అందుస్తోన్న పథకాల్లో ఎక్కువగా సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ పథకంపై 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. సుకన్య సమృద్ధి అకౌంట్‌పై 8 శాతం వడ్డీ లభిస్తుంది.
* ఇక పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‌లో 4 శాతం వడ్డీ లభిస్తోంది. ఇందులో వార్షిక ప్రాతిపదికన వడ్డీని లెక్కిస్తారు.
* పోస్టాఫీస్ అందిస్తున్న ఏడాది వ్యవధి టైమ్ డిపాజిట్‌పై త్రైమాసిక ప్రాతిపదికన 6.9 శాతం వడ్డీ లభిస్తుంది.
* ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌పై పోస్టాఫీస్‌లో ప్రతి 3 నెలలకు ఓసారి 7.5 శాతం వడ్డీ వస్తుంది. ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ పథకంపై 6.7 శాతం వడ్డీ ఉంది. ఇది త్రైమాసికానికి లెక్కిస్తారు.
* సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ పథకంలో అత్యధికంగా 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. ఇందులో ప్రతీ మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు.
* ఇక పోస్టాఫీస్ అందిస్తోన్న మంత్లీ ఇన్‌కం అకౌంట్‌లో 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ 7.7 శాతం వడ్డీ ఉంది. పీపీఎఫ్‌పై 7.10 శాతం వడ్డీ అందిస్తారు. కిసాన్ వికాస్ పత్రపై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది.
* మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీంపై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండ..