Enforcement Directorate: ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను ఏం చేస్తారు? వాటిపై అధికారం ఎవరిది? పూర్తి వివరాలు

ఒకరి ఇంటిపై ఈడీ దాడి చేసినప్పుడు అక్కడ గుర్తించిన అన్ని వస్తువులను సీజ్ చేస్తారు. అక్కడ పంచనామా నిర్వహిస్తారు. అంటే అక్కడ సీజ్ చేసిన వస్తువుల వివరాలు నమోదు చేస్తారు. దీనిలో వాహనాలు, ఇళ్లు, కార్యాలయం, ఆస్తులు తదితర అన్ని వివరాలు ఉంటాయి. పంచనామాపై సదరు యజమాని వ్యక్తి సంతకం తీసుకుంటారు.

Enforcement Directorate: ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను ఏం చేస్తారు? వాటిపై అధికారం ఎవరిది? పూర్తి వివరాలు
Enforcement Directorate

Updated on: May 29, 2024 | 5:47 PM

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేరును అందరూ వినేవింటారు. ఆర్థిక నేరాలు, మనీలాండరింగ్, అవినీతి తదితర కేసులకు సంబంధించి వీరు అనేక ప్రాంతాలోని వ్యక్తులపై దాడులు నిర్వహిస్తారు. ఆ సమయంలో పూర్తిగా తనిఖీలు నిర్వహించి, లెక్కలలో చూపని సొమ్మును సీజ్ చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ వారు సీజ్ చేసిన సొమ్మును ఎక్కడ దాస్తారు. ఆ విషయంలో పాటించాల్సిన నిబంధనలు ఏమిటో తెలుసుకుందాం.

సీజ్ చేసిన వాటిని ఏమి చేయాలంటే..

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పలుచోట్ల రాజకీయ నాయకులు, అధికారుల ఇళ్లపై దాడులు నిర్వహిస్తుంది. అక్రమంగా ఉన్న నగదు, నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకుంటుంది. ఆ డబ్బును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,లేదా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా లో జమ చేస్తుంది. నిబంధనల ప్రకారం డబ్బును స్వాధీనం చేసుకునే అధికారం ఈడీకి ఉంది. కానీ ఈ సొమ్మును తన దగ్గర ఉంచుకోవడం కుదరదు.

పంచనామా..

ఒకరి ఇంటిపై ఈడీ దాడి చేసినప్పుడు అక్కడ గుర్తించిన అన్ని వస్తువులను సీజ్ చేస్తారు. అక్కడ పంచనామా నిర్వహిస్తారు. అంటే అక్కడ సీజ్ చేసిన వస్తువుల వివరాలు నమోదు చేస్తారు. దీనిలో వాహనాలు, ఇళ్లు, కార్యాలయం, ఆస్తులు తదితర అన్ని వివరాలు ఉంటాయి. పంచనామాపై సదరు యజమాని వ్యక్తి సంతకం తీసుకుంటారు.

నిబంధనలు..

దాడి సమయంలో అటాచ్ చేసిన వాహనాలను సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ యాజమాన్యంలోని గోడౌన్లకు పంపిస్తారు. అక్కడ వాహనాల పార్కింగ్ కోసం ఈడీ చెల్లింపులు జరపాలి. ఇక్కడ వాహనాలు పాడైపోకుండా, లేదా సీజ్ చేసిన నగదు చెడిపోకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకుంటారు. తాత్కాలిక అటాచ్ మెంట్ ఆర్డర్ ఆమోదించిన తర్వాత దాదాపు 180 రోజుల పాటు ఆ ఆస్తి ఈడీ ఆధీనంలో ఉంటుంది. ఈ సమయంలో ఒక వ్యక్తిని ఈడీ అరెస్టు చేస్తే, ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేయడానికి సుమారు 60 రోజుల సమయం లభిస్తుంది. మనీ లాండరింగ్ చట్టం (పీఎమ్ఎల్ఏ) కింద శిక్ష ఏడేళ్లకు మించి ఉండదు. అలాగే ఫారిన్ ఎక్స్ఛేంచ్ మేనేజ్ మెంట్ యాక్ట్ (ఎఫ్ఈఎమ్ఏ)తో పాటు పీఎమ్ఎల్ఏ పరిధిలో దేశంలోని ఏ వ్యక్తిపైనైనా చర్యలు తీసుకునే అధికారం ఈడీకి ఉంది.

అటాచ్ మాత్రమే.. సీజ్ కాదు..

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఏవైనా ఆస్తులను అటాచ్ చేసినప్పుడు వాటిని సీజ్ చేయడం కుదరదు. ఆ ఆస్తి వినియోగం కొనసాగుతుంది. ఉదాహరణకు ఈడీ అధికారులు ఒక ఇంటిని అటాచ్ చేస్తే.. ప్రజలు దానిలో నివసించవచ్చు. యజమాని దానిని అద్దెకు ఇవ్వవచ్చు. కార్యాలయాలు, ఫ్యాక్టరీలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. అయితే అటాచ్ అయిన ఆస్తిని విక్రయించడం కుదరదు. మరొకరికి బదిలీ చేయలేరు. అటాచ్ చేసిన వినియోగించుకోలేకపోవడం చాలా అరుదైన సందర్భాలలో జరుగుతుంది.

కోర్టు ఆదేశాల మేరకు..

ఆస్తి వినియోగం కోర్టు వినియోగం మేరకు కొనసాగుతుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఈ చర్యలను తీసుకుంటుంది. నిందితుడు తన ఆస్తిని అటాచ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలో ఆర్థిక చట్టాలను అమలు చేయడానికి, ఆర్థిక నేరాలను ఎదుర్కోవడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఏజెన్సీ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూశాఖ కింద పనిచేస్తుంది. ఇండియన్ రెవెన్యూ శాఖకు (ఐఆర్ఎస్) చెందిన అధికారి దీనిని పర్యవేక్షిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..