Home loans: హోమ్ లోన్ లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే.. ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ అంటే..

అన్ని బ్యాంకులు హోమ్ లోన్లపై ఒకే వడ్డీ రేటును విధించవు. వాటిలో హెచ్చు తగ్గులు ఉంటాయి. వడ్డీ రేటును మీక్రెడిట్ స్కోర్, రుణ మొత్తం, వృత్తిపరమైన అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. హోమ్ లోన్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు మంజూరు చేస్తాయి. ప్రస్తుతం వివిధ ఆర్థిక సంస్థలు అందిస్తున్న గృహ రుణ రేట్లను ఇప్పుడు చూద్దాం.

Home loans: హోమ్ లోన్ లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే.. ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ అంటే..
Home Loan
Follow us

|

Updated on: Apr 22, 2024 | 6:14 PM

ఇల్లు అనేది ప్రతి ఒక్కరికీ కల. దాని సాకారం చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. సాధారణంగా ఇల్లు కొనాలంటే హోమ్ లోన్లపై ఆధారపడతారు. దానికోసం వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలను ఆశ్రయిస్తారు. అయితే అన్ని బ్యాంకులు హోమ్ లోన్లపై ఒకే వడ్డీ రేటును విధించవు. వాటిలో హెచ్చు తగ్గులు ఉంటాయి. వడ్డీ రేటును మీక్రెడిట్ స్కోర్, రుణ మొత్తం, వృత్తిపరమైన అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. హోమ్ లోన్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు మంజూరు చేస్తాయి. ప్రస్తుతం వివిధ ఆర్థిక సంస్థలు అందిస్తున్న గృహ రుణ రేట్లను ఇప్పుడు చూద్దాం.

ప్రభుత్వ రంగ బ్యాంకులు..

ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ హోమ్ లోన్ల ను తీసుకునేవారికి ఈ కింద తెలిపిన విధంగా వడ్డీ రేట్లు విధిస్తున్నాయి.

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే హోమ్ లోన్లపై వడ్డీరేటు 8.50 నుంచి 9.85 శాతం వసూలు చేస్తుంది.
  • బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.30 లక్షల వరకూ రుణాలపై 8.40 నుంచి 10.65 శాతం, రూ.75 లక్షల వరకూ 8.40 నుంచి 10.65 శాతం, ఆపై మొత్తాలకు రూ.8.40 నుంచి 10.90 వరకూ వడ్డీ విధిస్తుంది.
  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.30 లక్షల లోపు రుణాలకు 8.35 నుంచి 10.75 శాతం, రూ.75 లక్షల లోపు 8.35 నుంచి 10.90 శాతం, ఆపై 8.35 నుంచి 10.90 శాతం వరకూ విధించింది.
  • పంజాబ్ నేషనల్ బ్యాంకు వడ్డీ రేట్లు 8.45 నుంచి 10.25 (రూ.30 లక్షల లోపు), 8.40 నుంచి 10.15 (రూ.75 లక్షల వరకూ), 8.40 నుంచి 10.15 (ఆపై) శాతంగా ఉన్నాయి.
  • బ్యాంకు ఆఫ్ ఇండియా ఇచ్చే హోమ్ లోన్ల పై వడ్డీరేటు 8.40 నుంచి 10.85 శాతం వరకూ ఉంది.
  • కెనరాబ్యాంకు నుంచి తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లు 8.50 నుంచి 11.25 (రూ.30 లక్షల లోపు), 8.45 నుంచి 11.25 (రూ.75 లక్షల వరకూ), 8.40 నుంచి 11.15 (ఆపై) శాతంగా ఉన్నాయి.
  • యూకో బ్యాంకులో 8.45 నుంచి 10.30 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 8.35 నుంచి 11.15 శాతం, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో 8.50 నుంచి 10 శాతం, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకులో 8.40 నుంచి 10.60 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8.45 నుంచి 9.80 శాతం వసూలు చేస్తున్నారు.

ప్రైవేటు బ్యాంకులు..

  • కోటక్ మహీంద్రా బ్యాంకులో 8.70 శాతం నుంచి, ఐసీఐసీఐ బ్యాంకులో 8.75 నుంచి, హెచ్ ఎస్ బీసీలో 8.45 నుంచి ఫెడరల్ బ్యాంకులో 8.80 నుంచి ఆర్బీఎల్ లో 8.90 నుంచి హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో 9.40 నుంచి వడ్డీరేట్లు ప్రారంభమవుతున్నాయి.
  • కరూర్ వైశ్యాబ్యాంక్ లో 9 నుంచి 11.05 వరకూ, కర్ణాటక బ్యాంక్ లో 8.50 నుంచి 10.62 వరకూ, ధనలక్ష్మి బ్యాంకులో 9.35 నుంచి 10.50 వరకూ, తమిళ్ నాడు మర్కంటైల్ బ్యాంకులో 8.60 నుంచి 9.95 వరకూ, సీఎస్బీ లో 10.73 నుంచి 12.58 వరకూ వసూలు చేస్తున్నారు.
  • సౌత్ ఇండియన్ బ్యాంకులో రూ.30 లక్షల రుణాలపై 9.84 నుంచి 11.24 వరకూ, రూ.75 లక్షల లోపు 9.84 నుంచి 11.04 వరకూ, ఆపై రుణాలకు 9.84 నుంచి 11.69 వరకూ వసూలు చేస్తున్నాయి.

హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు..

  • బజాజ్ ఫైనాన్స్ కంపెనీలో 8.50 నుంచి, టాటా కేపిటల్ లో 8.75 నుంచి, జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లో 8.80 నుంచి, ఎస్ఎంఎఫ్ జీ ఇండియా హోమ్ ఫైనాన్స్ లో 10 నుంచి, ఇండియా బుల్స్ హౌసింగ్ లో 8.75 నుంచి, ఆదిత్య బిర్లా కెపిటర్ లో 8.60 నుంచి, ఐసీఐసీఐ హోమ్ ఫైనాన్స్ లో 9.20 నుంచి, గోద్రెజ్ హౌసింగ్ ఫైనాన్స్ లో 8.55 నుంచి వడ్డీ రేట్లు ప్రారంభమవుతున్నాయి.
  • పీఎన్ బీ హౌసింగ్ ఫైనాన్స్ లో 8.50 నుంచి 14.50 వరకూ విధిస్తున్నారు.
  • ఎల్ ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లో రూ.30 లక్షలపై 8.35 నుంచి 10.35 వరకూ, రూ.75 లక్షలపై 8.35 నుంచి 10.55 వరకూ, ఆపై 8.35 నుంచి 10.75 వరకూ విధిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..