Gold Loan Interest Rates: లేటెస్ట్ గోల్డ్ లోన్లు వడ్డీ రేట్లు ఇవే.. ఏ బ్యాంకులో తక్కువుందంటే..

|

Sep 26, 2024 | 6:46 PM

మన వద్ద ఉన్న బంగారం విలువ ఆధారంగా లోన్లు ఇస్తారు. దీనికి సిబిల్ స్కోర్ తో కూడా పని ఉండదు. దీనిలో వడ్డీ రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇతర పర్సనల్ లోన్ వంటి వాటితో పోల్చితే చాలా తక్కువ ఉంటుంది. లోన్ తీసుకున్న తర్వాత ప్రీ క్లోజ్ కూడా చేసుకోవచ్చు. దానికి కూడా ఎలాంటి అదనపు రుసుము ఉండదు.

Gold Loan Interest Rates: లేటెస్ట్ గోల్డ్ లోన్లు వడ్డీ రేట్లు ఇవే.. ఏ బ్యాంకులో తక్కువుందంటే..
Gold Loans
Follow us on

అత్యవసర సమయాల్లో ఆర్థిక అవసరతలకు బాగా ఉపయోగ సురక్షితమైన మార్గం గోల్డ్ లోన్(బంగారంపై రుణాలు). ఇవి తక్షణమే మంజూరవుతాయి. ఎలాంటి వెయిటింగ్ అవసరం లేదు. ఎలాంటి పూచీ కత్తు అవసరం లేదు. మన వద్ద ఉన్న బంగారం విలువ ఆధారంగా లోన్లు ఇస్తారు. దీనికి సిబిల్ స్కోర్ తో కూడా పని ఉండదు. దీనిలో వడ్డీ రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇతర పర్సనల్ లోన్ వంటి వాటితో పోల్చితే చాలా తక్కువ ఉంటుంది. లోన్ తీసుకున్న తర్వాత ప్రీ క్లోజ్ కూడా చేసుకోవచ్చు. దానికి కూడా ఎలాంటి అదనపు రుసుము ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు దీనిని ముగించి, మన బంగారం మనం తిరిగి తెచ్చుకోవచ్చు. అయితే కొన్ని ప్రైవేటు బ్యాంకులు మాత్రం మినిమం చార్జ్ వసూలు చేస్తున్నాయి. కాగా ఇటీవల దేశంలోని ప్రధాన బ్యాంకులు గోల్డ్ లోన్లపై వడ్డీ రేట్లను సవరించాయి. కొత్త వడ్డీ రేట్ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

గోల్డ్ లోన్ తాజా వడ్డీ రేట్లు ఇవి..

  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గోల్డ్ లోన్ పై వడ్డీ రేటు 8.40శాతం నుంచి 9.25శాతం ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంపై 0.50శాతం ఉంటుంది.
  • యూకో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8.50శాతం వడ్డీ రేటు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ. 250 నుంచి రూ. 5000 వరకూ ఉంటుంది.
  • ఇండియన్ బ్యాంక్లో వడ్డీ రేటు 8.80శాతం నుంచి 9.00శాతం వరకూ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు మంజూరైన లోన్ మొత్తంలో 0.56శాతం ఉంటుంది.
  • ఫెడరల్ బ్యాంక్లో వడ్డీ రేటు 8.99శాతం నుంచి ప్రారంభమవుతుంది. ప్రాసెసింగ్ ఫీజు లేదు.
  • ఐసీఐసీఐ బ్యాంలో వడ్డీరేటు 9.00శాతం నుంచి 24శాతం వరకూ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు గరిష్టంగా తీసుకున్న రుణంలో 2శాతం ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తారు.
  • కోటక్ మహీంద్రా బ్యాంక్లో వడ్డీ రేటు 9.00 నుంచి 24.00శాతం వరకూ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు తీసుకున్న రుణంలో 2శాతం ప్లస్ జీఎస్టీ ఉంటుంది.
  • ఎస్బీఐలో గోల్డ్ లోన్ పై వడ్డీ రేటు 9.05శాతం నుంచి ప్రారంభమవుతుంది. ప్రాసెసింగ్ ఫీజు తీసుకున్న రుణంలో 0.50శాతం ప్లస్ జీఎస్టీ ఉంటుంది.
  • హెచ్డీఎఫ్సీలో వడ్డీ రేటు 9.10శాతం నుంచి 17.90శాతం ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు తీసుకున్న లోన్ మొత్తంలో 1శాతం ఉంటుంది.
  • బ్యాంక్ ఆఫ్ బరోడాలో వడ్డీ రేటు 9.15శాతం ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.
  • సౌత్ ఇండియన్ బ్యాంక్లో 9.20శాతం నుంచి 22.00శాతం వరకూ వడ్డీ రేటు ఉంటుంది.
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 9.20శాతం నుంచి 22.00 శాతం వరకూ వడ్డీ రేటు ఉంటుంది.
  • కెనరా బ్యాంక్లో 9.25శాతం వడ్డీ రేటు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ. 500 నుంచి రూ. 5000 వరకూ ఉంటుంది.
  • యూనియన్ బ్యాంక్లో గోల్డ్ లోన్ పై వడ్డీ రేటు 9.25శాతం నుంచి 9.85శాతం వరకూ ఉంటుంది.
  • బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో వడ్డీ రేటు 9.30శాతం ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజురూ. 500 నుంచి రూ. 2000 ప్లస్ జీఎస్టీ ఉంటుంది.
  • పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో వడ్డీ రేటు 9.35శాతం, ప్రాసెసింగ్ ఫీజు రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 10,000 వరకూ ఉంటుంది.
  • సిటీ యూనియన్ బ్యాంక్లో వడ్డీ రేటు 9.50శాతం ఉంటుంది. దీనిలో ప్రాసెసింగ్ ఫీజు లేదు.
  • ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో గోల్డ్ లోన్ పై వడ్డీ రేటు 9.50శాతం నుంచి 24శాతం వరకూ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు మాత్రం తీసుకున్న రుణంపై 1శాతం ప్లస్ జీఎస్టీ ఉంటుంది.
  • ఇండస్ ఇండ్ బ్యాంక్లో వడ్డ రేటు 10.35శాతం నుంచి 17.05శాతం వరకూ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 1శాతం ఉంటుంది.
  • బంధన్ బ్యాంక్లో వడ్డీ రేటు 10.50శాతం నుంచి 19.45శాతం వరకూ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 1శాతం ప్లస్ జీఎస్టీ ఉంటుంది.
  • కరూర్ వైశ్యా బ్యాంక్లో వడ్డీ రేటు 10.65శాతం ఉంటుంది. 0.50శాతం ప్రాసెసింగ్ చార్జీలు ఉంటాయి.
  • యాక్సిస్ బ్యాంక్లో గోల్డ్ లోన్ పై వడ్డీ రేటు 17.00శాతం ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజులు 0.5శాతం ప్లస్ జీఎస్టీ ఉంటుంది.
  • ముథూట్ ఫైనాన్స్ లో వడ్డీ రేటు మీరు 100శాతం వడ్డీ చెల్లించేటట్లు అయితే 2శాతం రీబేట్ తో కూడిన 22శాతం వార్షిక వడ్డీ విధిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..