పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్కరూ జూలై 31లోపు ఈ ఏడాది ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్(ఐటీఆర్) దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తతో, అప్రమత్తతో ఉండాల్సి ఉంటుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా డిఫాల్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మొదటి సారి ఐటీఆర్ దాఖలుచేసే వారు ఇంకా అప్రమత్తతతో ఉండాలి. ఈ నేపథ్యంలో ఐటీఆర్ దాఖలు చేసేవారు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ప్రధానమైన అంశాలను మీకు తెలియజేస్తున్నాం. అయితే అంతకన్నా ముందు మీరు ఫారం 16 గురించి తెలుసుకోవాలి. ఈ ఫారం 16 గురించి అవగాహన లేకపోతే ట్యాక్స్ రిటర్న్ విధానం అస్సలు అర్థం కాదు.
ఐటీఆర్ దాఖలుకు ఈ ఫారం 16 చాలా అవసరం. ప్రతి ఉద్యోగి సంపాదిస్తున్న జీతానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఫారం 16లో ఉంటాయి. ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్(టీడీఎస్), ఇతర డిడక్షన్స్, మీరు ఆర్జిస్తున్న మొత్తం ఆదాయానికి సంబంధించిన పూర్తి వివరాలు దీనిలో ఉంటాయి. జూన్ 15 నాటికి ప్రతి కంపెనీ తమ ఉద్యోగులకు ఫారం 16 అందివ్వాలని ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పేర్కొంది. ఇప్పుడు పన్ను చెల్లింపుదారులు గుర్తుంచుకోవాల్సిన ప్రధాన అంశాలు ఇప్పుడు చూద్దాం..
ట్యాక్స్ రెజీమ్.. ప్రతి పన్ను చెల్లింపు దారుడు మొదట సరిచూసుకోవాల్సింది వారికి వర్తించే పన్ను స్లాబ్. మీరు పనిచేస్తున్న కంపెనీ నుంచి ఫారం 16 తీసుకొని ట్యాక్స్ రెజీమ్ ను ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. పాత, కొత్త పన్ను చెల్లింపు విధానాలపై అవగాహన అవసరం. వాటిలో మీకు ప్రయోజనకరమైనది ఏదో దానిని ఎంపిక చేసుకోవాలి.
డిడక్షన్స్.. ఐటీఆర్ ఫైల్ చేసే మందు.. మీరు డిడక్షన్స్ కోసం మీ సమర్పణలన్నీ ఫారమ్ 16లో చేర్చారో లేదో తనిఖీ చేయాలి. ఒకవేళ దానిలో చేర్చి లేకపోతే ఈ డిడక్షన్స్ ను ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో చేర్చవచ్చు. సాధారణంగా ఈ ఫారమ్‌లు ఆటో జనరేటెడ్ గా ఉంటాయి. అనేక వెబ్‌సైట్‌లు ఐటీఆర్ ఆటో-పాపులేట్ చేయడానికి వాటిని అప్‌లోడ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. ఇది ఐటీఆర్ ఫైల్ చేయడం సులభంగా, వేగంగా చేయడానికి సహకరిస్తాయి.
పాన్ వివరాలు.. మీరు ఫారమ్ 16లో పేర్కొన్న పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్) సరైనదేనని కూడా ధృవీకరించాలి. అంతే కాకుండా, మీ పేరు, చిరునామా యజమాని టాన్, పాన్ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.
ఫారమ్ 16లోని పార్ట్ ఏ, పార్ట్ బీ.. మీరు పనిచేస్తున్న కంపెనీ టీడీఎస్ కట్ చేసి జమచేసిందా లేదా అన్నది సరిచూసుకోవాలి. ఫారం 16లోని పార్ట్ ఏలో ఉన్న పన్ను డిడక్షన్స్, అలాగే యాన్యువల్ ఇన్ ఫర్మేషన్ స్టేట్మెంట్(ఏఐఎస్)లోని ఫారం 26ఏఎస్ లోని డేటాతో కంపేర్ చేయాలి. అలాగే పార్ట్ బీ అనేది శాలరీ ఇన్ కమ్, మీరు క్లయిమ్ చేసుకున్న డిడక్షన్స్ ను సూచిస్తుంది. అవన్నీ సక్రమంగా క్లయిమ్ అయ్యాయో లేవో ఫారం 16లో సరిచూసుకోవాలి.
పన్ను మినహాయింపులు సరిచూసుకోవాలి.. మీ జీతం నుంచి తీసివేసిన పన్నును ఫారమ్ 16, ఫారం 26ఏఎస్ లోని పన్నులతో పోల్చాలి. ఒకవేళ మీరు ఏవైనా వ్యత్యాసాలను కనుగొంటే, వెంటనే మీ యజమానికి తెలియజేయాలి.
ఉద్యోగ మార్పులు.. బహుళ యజమానులు.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, మీరు ఉద్యోగాలు మారినట్లయితే, మీరు మీ యజమానులందరి నుండి ఫారమ్ 16ని సేకరించాలి. ఇది అసలు పన్ను విధించదగిన జీతంని నిర్ణయించడంలో, ఖచ్చితమైన రిపోర్టింగ్‌ని నిర్ధారించడంలో మీకు సహాయం చేస్తుంది. మీరు కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించినప్పుడు, సంభావ్య పన్ను చెల్లింపు సమస్యలను నివారించడానికి మునుపటి యజమాని నుండి సంపాదించిన ఆదాయం గురించి మీరు కొత్త యజమానికి తెలియజేయాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..