Paytm Bank: పేటీఎం సేవలపై సందేహాలా? ఇవిగో ఆర్బీఐ సమాధానాలు..

పేటీఎం డిపాజిట్లు, వ్యాలెట్లు, ఫాస్ట్ ట్యాగ్, పేటీఎం పేమెంట్ బ్యాంక్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోతాయన్న సందేహాలు వారి మెదళ్లను తొలిచివేస్తున్నాయి. ఈ క్రమంలో కస్టమర్లు రిజర్వ్ బ్యాంక్ ఇండియాకు అనేక ప్రశ్నలను సంధించారు. దీంతో ఆర్బీఐ వినియోగదారులు తరచూ అడుగుతున్న ప్రశ్నలను జాబితా చేసి.. దానికి సమాధానాలను అందించింది. వాటి సారాంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Paytm Bank: పేటీఎం సేవలపై సందేహాలా? ఇవిగో ఆర్బీఐ సమాధానాలు..
Paytm

Updated on: Feb 18, 2024 | 8:53 AM

పేటీఎం వినియోగదారులు ఆందోళనలో ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల తీసుకున్న నిర్ణయంతో వారు కంగారు పడుతున్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ పై విధించిన వ్యాపార పరిమితుల కారణంగా తమ డబ్బులు ఏమవుతాయో అన్న ప్రశ్న వారిని ఆందోళనకు గురిచేస్తోంది. అలాగే పేటీఎం డిపాజిట్లు, వ్యాలెట్లు, ఫాస్ట్ ట్యాగ్, పేటీఎం పేమెంట్ బ్యాంక్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోతాయన్న సందేహాలు వారి మెదళ్లను తొలిచివేస్తున్నాయి. ఈ క్రమంలో కస్టమర్లు రిజర్వ్ బ్యాంక్ ఇండియాకు అనేక ప్రశ్నలను సంధించారు. దీంతో ఆర్బీఐ వినియోగదారులు తరచూ అడుగుతున్న ప్రశ్నలను జాబితా చేసి.. దానికి సమాధానాలను అందించింది. వాటి సారాంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం..

అసలేం జరిగిందంటే..

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌(పీపీబీఎల్)పై ఆర్బీఐ పరిమితులు విధించింది. ఫిబ్రవరి 29 తర్వాత ఏవైనా కస్టమర్ ఖాతాలు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, ఇతర సాధనాల్లో డిపాజిట్లు లేదా టాప్-అప్‌లను స్వీకరించడాన్ని నిలిపివేయాలని జనవరి 31 పీపీబీఎల్ ను ఆదేశించింది. అయితే ఆ తర్వాత తుది గడువును సెంట్రల్ బ్యాంక్ పొడిగించింది. మార్చి 15 వరకు అవకాశం కల్పించింది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలపై..

నగదు విత్ డ్రా అవుతుందా?: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్, కరెంట్ ఖాతా నుంచి మార్చి 15 తర్వాత కూడా నగదు ఉపసంహరణలు చేసుకోవచ్చు. మీ ఖాతాలో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ వరకు మీ నిధులను ఉపయోగించడం, ఉపసంహరించుకోవడం లేదా బదిలీ చేయడం కొనసాగించవచ్చు. అదేవిధంగా, మీరు మీ ఖాతాలో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ వరకు నిధులను ఉపసంహరించుకోవడానికి లేదా బదిలీ చేయడానికి మీ డెబిట్ కార్డ్‌ని కూడా ఉపయోగించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నగదు జమ చేయొచ్చా?: మార్చి 15, 2024 తర్వాత, మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో మీ ఖాతాలోకి డబ్బు జమ చేయలేరు. వడ్డీ, క్యాష్‌బ్యాక్‌లు, భాగస్వామ్య బ్యాంకుల నుంచి స్వీప్-ఇన్ లేదా రీఫండ్‌లు మినహా ఇతర క్రెడిట్‌లు లేదా డిపాజిట్లు క్రెడిట్ చేయడానికి అనుమతించరు

రీఫండ్స్ వస్తాయా?: రీఫండ్‌లు, క్యాష్‌బ్యాక్‌లు, భాగస్వామి బ్యాంకుల నుంచి స్వీప్-ఇన్ లేదా వడ్డీకి మార్చి 15, 2024 తర్వాత కూడా మీ ఖాతాలోకి క్రెడిట్‌లు అనుమతించబడతాయి.

శాలరీ అకౌంట్ అయితే?: మార్చి 15, 2024 తర్వాత, మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ ఖాతాలోకి ఎలాంటి క్రెడిట్‌లను స్వీకరించలేరు. అసౌకర్యాన్ని నివారించడానికి మీరు మార్చి 15, 2024లోపు మరొక బ్యాంకుతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రభుత్వ పథకాలకు ఉంటే.. ప్రభుత్వం అందించే వివిధ పథకాలు, సబ్సిడీ లేదా నిర్దిష్ట ప్రత్యక్ష ప్రయోజన బదిలీల స్వీకరించేందుకు పేటీఎం ఖాతా ఉంటే మార్చి 15లోపు దానిని మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత ఎలాంటి నగదు జమలను ఆ ఖాతా స్వీకరించదు. అందుకే ఈ లోపే ఆధార్ లింక్ చేసిన కొత్త ఖాతాను తీసుకోవడం ఉత్తమం.

పేమెంట్స్ బ్యాంక్ వాలెట్..

వ్యాలెట్ పనిచేస్తుందా?: మీరు వాలెట్‌లో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ వరకు ఉపయోగించడం, ఉపసంహరించుకోవడం లేదా మరొక వాలెట్ లేదా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయడం కొనసాగించవచ్చు.

వ్యాలెట్ రీచార్జ్ చేయొచ్చా?: మార్చి 15, 2024 తర్వాత మీరు ఈ వాలెట్‌లో క్యాష్‌బ్యాక్‌లు లేదా రీఫండ్‌లు కాకుండా మరే ఇతర క్రెడిట్‌లను టాప్-అప్ చేయలేరు. లేదా వ్యాలెట్ ను రీచార్జ్ చేయలేరు. రీఫండ్స్, క్యాష్ బ్యాక్ లు మాత్రం దానిలోకి క్రెడిట్ అవుతాయి.

ఫాస్టాగ్‌పై సందేహాలు..

టోల్ చెల్లింపు ఎలా?: ప్రస్తుతం మీ వ్యాలెట్ లో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ వరకు టోల్ చెల్లించడానికి మీ ఫాస్ట్‌ట్యాగ్‌ని ఉపయోగించడం కొనసాగించవచ్చు. అయితే, మార్చి 15, 2024 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్ట్‌ట్యాగ్‌లలో తదుపరి నిధులు లేదా టాప్ అప్‌లు అనుమతించబడవు. ఏదైనా అసౌకర్యాన్ని నివారించడానికి మీరు మార్చి 15 లోపు మరొక బ్యాంక్ జారీ చేసిన కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌ని పొందాల్సి ఉంటుంది.

ఫాస్టాగ్ రీచార్జ్ చేయొచ్చా?: మార్చి 15, 2024 తర్వాత మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన మీ ఫాస్ట్‌ట్యాగ్‌ని రీఛార్జ్ చేయలేరు. అందుకే మరొక బ్యాంక్ జారీ చేసిన కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌ని పొందాల్సి ఉంటుంది.

బ్యాలెన్స్ బదిలీ చేసుకోవచ్చా?: ప్రస్తుతానికి ఫాస్టాగ్ క్రెడిట్ బ్యాలెన్స్ బదిలీ ఫీచర్ అందుబాటులో లేదు. అవసరం అయితే పేటీఎం ఖాతా క్లోజ్ చేసి ఆ ఖాతా నుంచి మొత్తం నగదు రీఫండ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..