AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Insurance Scheme: రూ. 36తో రూ.2 లక్షల బీమా.. దరఖాస్తు చేయడం ఎలా?

ఈ పాలసీ తీసుకోవడానికి మీకు ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదు. బీమా పాలసీ సమ్మతి లేఖలో కొన్ని నిర్దిష్ట వ్యాధులు పేర్కొనాల్సి ఉంటుంది. మీరు ఆ వ్యాధులతో బాధపడటం లేదని డిక్లరేషన్‌లో ప్రకటించాలి. మీ డిక్లరేషన్ తప్పు అని నిరూపిస్తే, మీ కుటుంబానికి ఈ పథకం ప్రయోజనం ఉండదని గుర్తించుకోండి. నియమ నిబంధనలు పాటించడం తప్పనిసరి. ఇది కాకుండా, ఈ పథకంలో బీమా ప్రీమియంగా జమ చేసిన మొత్తంపై సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు..

Insurance Scheme: రూ. 36తో రూ.2 లక్షల బీమా.. దరఖాస్తు చేయడం ఎలా?
Insurance Scheme
Subhash Goud
|

Updated on: Feb 18, 2024 | 9:57 AM

Share

Insurance Scheme: కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఎప్పటికప్పుడు అనేక పథకాలను అమలు చేస్తుంది. ఇందులో ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలను అందించేందుకు అనేక పథకాలు ఉన్నాయి. అకాల మరణం ఏ మానవునికైనా ఎప్పుడైనా సంభవించవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కొత్త బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద కేవలం రూ.40 చెల్లించి రూ.2 లక్షల బీమా ఇస్తారు. మీరు ఈ పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవచ్చో తెలుసుకుందాం. అదే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం.

2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY)ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఏటా రూ.436 ప్రీమియం చెల్లించాలి. అంటే నెలవారీగా చూస్తే.. 436/12=36.3 అంటే ఒక వ్యక్తి ప్రతి నెలా దాదాపు రూ. 36 ఆదా చేస్తే సరిపోతుంది. దీంతో మీరు రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందుతారు. ఇందుకోసం జీవిత బీమా కార్పొరేషన్‌తో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ బీమా పథకం ప్రతి సంవత్సరం పునరుద్ధరించబడుతూనే ఉంటుంది. ఈ పథకం వ్యవధి మే 1 నుండి జూన్ 31 వరకు ఉంటుంది. ప్రమాదం కారణంగా ఆకస్మికంగా మరణిస్తే నామినీకి రూ. 2 లక్షలు అందజేస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి?

ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి దరఖాస్తుదారు వయస్సు 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు ఎవరైనా ఆన్‌లైన్‌లోకి వెళ్లి ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే దానిని పూరించిన తర్వాత మీరు దానిని మీ బ్యాంకులో డిపాజిట్ చేసి దాని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన గురించి మరింత సమాచారం పొందడానికి మీరు ఎల్‌ఐసీ, మీ బ్యాంక్ శాఖను కూడా సందర్శించవచ్చు.

వైద్య పరీక్ష అవసరం లేదు:

ఈ పాలసీ తీసుకోవడానికి మీకు ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదు. బీమా పాలసీ సమ్మతి లేఖలో కొన్ని నిర్దిష్ట వ్యాధులు పేర్కొనాల్సి ఉంటుంది. మీరు ఆ వ్యాధులతో బాధపడటం లేదని డిక్లరేషన్‌లో ప్రకటించాలి. మీ డిక్లరేషన్ తప్పు అని నిరూపిస్తే, మీ కుటుంబానికి ఈ పథకం ప్రయోజనం ఉండదని గుర్తించుకోండి. నియమ నిబంధనలు పాటించడం తప్పనిసరి. ఇది కాకుండా, ఈ పథకంలో బీమా ప్రీమియంగా జమ చేసిన మొత్తంపై సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు.

నమోదు నిబంధనలు:

  • మీరు భారత ప్రభుత్వం ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేయబోతున్నట్లయితే, మీరు ఆధార్ కార్డ్, గుర్తింపు కార్డు, బ్యాంక్ ఖాతా పాస్‌బుక్, మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అందించాలి.
  • మీ గుర్తింపు ఆధార్ ద్వారా ధృవీకరించబడినందున మీరు మీ బ్యాంక్ ఖాతా నంబర్‌ను ఆధార్ నంబర్‌తో లింక్‌ చేసి ఉండాలి.
  • మీరు ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రయోజనాలను కేవలం ఒక బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే పొందవచ్చు. ఈ విధానాన్ని మరే ఇతర ఖాతాకు లింక్ చేయడం సాధ్యం కాదు.
  • బీమా రక్షణ ప్రయోజనం పాలసీ తీసుకున్న 45 రోజుల తర్వాత మాత్రమే లభిస్తుంది.

నామినీ ఎలా క్లెయిమ్ చేయవచ్చు?

నామినీ సంబంధిత వ్యక్తి బీమా చేసిన బ్యాంకులో క్లెయిమ్ చేసుకోవాలి. మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి డిశ్చార్జ్ రసీదుతో పాటు ఇతర ముఖ్యమైన పత్రాలను ఇవ్వాలి. నిబంధనల ప్రకారం, ప్రమాదం జరిగిన 30 రోజుల్లోపు క్లెయిమ్ దాఖలు చేయాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇలాంటోళ్ల నుంచి మాత్రం అప్పు తీసుకోకండి!
ఇలాంటోళ్ల నుంచి మాత్రం అప్పు తీసుకోకండి!
విజయ్, త్రిష పెళ్లి..ఇద్దరి జాతకం చూస్తే కళ్లు చెదిరిపోవడమే..
విజయ్, త్రిష పెళ్లి..ఇద్దరి జాతకం చూస్తే కళ్లు చెదిరిపోవడమే..
స్పేస్ ఇంటర్నెట్ యుద్ధానికి జియో రెడీ..స్టార్‌లింక్‌కు అంబానీ చెక
స్పేస్ ఇంటర్నెట్ యుద్ధానికి జియో రెడీ..స్టార్‌లింక్‌కు అంబానీ చెక
శని జయంతి కేదార్ యోగం: ఈ 4 రాశులకు బంపర్ లక్, ధనయోగం మొదలు!
శని జయంతి కేదార్ యోగం: ఈ 4 రాశులకు బంపర్ లక్, ధనయోగం మొదలు!
అపార్ట్‌మెంట్ వర్సెస్ ఇండిపెండెంట్ హౌస్ ఏది కొంటే..
అపార్ట్‌మెంట్ వర్సెస్ ఇండిపెండెంట్ హౌస్ ఏది కొంటే..
హాస్పిటల్స్‎కి వేలు ఖర్చు చేయకుండా పల్లెటూరి బండ పచ్చడి
హాస్పిటల్స్‎కి వేలు ఖర్చు చేయకుండా పల్లెటూరి బండ పచ్చడి
విజయ్, త్రిష పెళ్లి చేసుకోవాలి.. హీరోయిన్ కామెంట్స్..
విజయ్, త్రిష పెళ్లి చేసుకోవాలి.. హీరోయిన్ కామెంట్స్..
చికెన్ వండేటప్పుడు మీరు చేసే పెద్ద తప్పు ఇదే.. ఏం జరుగుతుందో..
చికెన్ వండేటప్పుడు మీరు చేసే పెద్ద తప్పు ఇదే.. ఏం జరుగుతుందో..
పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్‌.. ఈ విషయాల్లో జాగ్రత్త!
పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్‌.. ఈ విషయాల్లో జాగ్రత్త!
ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా
ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌