AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Selling Cars: టాప్ గేర్లో కార్ల అమ్మకాలు.. అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లు ఏవంటే..

ఏ కారును కొనుగోలు చేయాలి? వాటిలో ఏ ప్రత్యేకతలు ఉండాలి? నూతనంగా మార్కెట్‌ లోకి విడుదలైన కార్లు ఏమిటి? అనే విషయాలపై కొనుగోలుదారులకు కొంత పరిజ్ఞానం అవసరం. అలాగే ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్న కార్ల వివరాలుకూడా తెలుసుకోవాలి. 2024 ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో వరుసగా వ్యాగన్ఆర్, బ్రెజ్జా, బాలెనో, డిజైర్, పంచ్ మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి.

Best Selling Cars: టాప్ గేర్లో కార్ల అమ్మకాలు.. అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లు ఏవంటే..
Maruti Suzuki
Madhu
|

Updated on: Mar 13, 2024 | 6:53 AM

Share

దేశంలో కార్ల అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు సైతం వీటిని కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. కరోనా అనంతర పరిణామాల్లో ప్రతి ఒక్కరూ సొంత కారునుకలిగి ఉండేందుకు మొగ్గుచూపుతున్నారు. అలాగే ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ప్రజల ఆదాయం పెరగడంతో పాటు కార్ల ధరలు కూడా అందుబాటులోకి రావడం దీనికి కారణమని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులందరూ ఒకేసారి ప్రయాణం చేయడం కోసం, తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకోవడం, భద్రత, సురక్షితం తదితర అంశాలు కూడా కార్ల విక్రయాలు పెరుగుతున్నాయి. అయితే ఏ కారును కొనుగోలు చేయాలి? వాటిలో ఏ ప్రత్యేకతలు ఉండాలి? నూతనంగా మార్కెట్‌ లోకి విడుదలైన కార్లు ఏమిటి? అనే విషయాలపై కొనుగోలుదారులకు కొంత పరిజ్ఞానం అవసరం. అలాగే ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్న కార్ల వివరాలుకూడా తెలుసుకోవాలి. 2024 ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో వరుసగా వ్యాగన్ఆర్, బ్రెజ్జా, బాలెనో, డిజైర్, పంచ్ మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. వీటిలో మొదటి నాలుగు కార్లు మారుతీ సుజుకీ కంపెనీకి, చివరి కారు టాటా మోటార్స్ కు చెందినవి.

ఫిబ్రవరిలో 3,72,178 కార్ల అమ్మకాలు..

దేశ వ్యాప్తంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 3,72,178 కార్లు అమ్ముడయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. గతేడాది ఇదే నెలలో 3,34,245 కార్లను ప్రజలు కొనుగోలు చేశారు. గతేడాదితో పోల్చితే ఈసారి 37,933 కార్లు అధికంగా అమ్ముడయ్యాయి. ఫలితంగా అమ్మకాల్లో 11.3 శాతం వృద్ధి నమోదైంది. అదే సమయంలో ఈ ఏడాది జనవరిలో 3,93,471 కార్లను వివిధ కంపెనీలు విక్రయించాయి. దానితో పోల్చుకుంటే అమ్మకాలు 5.4 శాతం తక్కువగా జరిగినట్టు తెలుస్తోంది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న వివిధ కంపెనీల కార్లు, వాటి ధరలు, ఇతర ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.

మారుతీ వ్యాగన్ఆర్..

వ్యాసింజర్ కార్ల విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్నమోడల్ మారుతీ వ్యాగన్ఆర్. గత కొన్ని నెలలుగా ఈ మోడల్ టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 19,412 కార్లను కంపెనీ విక్రయించింది. గతే ఏడాది ఇదే నెలలో 16,889 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ లెక్కల ప్రకారం కార్ల విక్రయాల్లో ఈ ఏడాది దాదాపు 15 శాతం వృద్ధి నమోదైంది. మారుతీ వ్యాగన్ఆర్ కారు ధర రూ.5.55 లక్షల నుంచి రూ. 7.38 లక్షలు వరకూ ఉంది. మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన కార్లలో ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్న మోడల్ ఇదేనని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

టాటా పంచ్..

టాటామోటార్స్ కంపెనీకి చెందిన టాటా పంచ్ కారుకు ప్రజల ఆదరణ బాగుంది. ఈ కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశ వ్యాప్తంగా 18,438 పంచ్ కార్లను పంపిణీ చేసింది. ఈ కార్లలో మైక్రో ఎస్ యూవీ 65 శాతం వైవోవై వృద్ధిని, 2.55 శాతం ఎమ్ వోఎమ్ వృద్ధిని సాధించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో మార్కెట్ లోకి విడుదలైన ఆల్ ఎలక్ట్రిక్ పంచ్.ఈవీ కారు కారణంగా ఈ కంపెనీ కార్ల అమ్మకాల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది.

మారుతీ బాలెనో..

మారుతీ బాలెనో కారు అమ్మకాలలో మూడో స్థానంలో నిలిచింది. మారుతీ కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరిలో 17,517 బాలెనో కార్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో మాత్రం 18,592 ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మోడళ్లు అమ్ముడయ్యాయి. ఆ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో అమ్మకాల్లో ఆరుశాతం తగ్గుదల కనిపించింది. బాలెనో మోడల్ కారు రూ.6.66 లక్షల నుంచి రూ. 9.38 లక్షల ధరలో మార్కెట్లో అందుబాటులో ఉంది.

మారుతీ డిజైర్..

ఈ ఏడాది ఫిబ్రవరిలో 15,837 మారుతీ డిజైర్ కార్లు అమ్ముడయ్యాయి. దీంతో ఈ కారు అమ్మకాలలో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే రాబోయే రోజుల్లో వీటి విక్రయాలు బాగా పెరుగుతాయని భావిస్తున్నారు. డిజైర్ తో పాటు స్విఫ్ట్ కార్లకు డిమాండ్ ఎక్కువయ్యే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం మారుతీ డిజైర్ కారు రూ. 6.56 లక్షల నుంచి 9.39 లక్షల ధరలో అందుబాటులో ఉంది.

మారుతీ బ్రెజ్జా..

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ కార్లు 15,765 అమ్ముడయ్యాయి. తద్వారా కార్ల అమ్మకాల్లో ఐదో స్థానం సాధించింది. అయితే సబ్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ అమ్మకాలు వైవోవై, ఎమ్‌వోఎమ్‌ రెండింటిలోనూ నిలిచిపోయాయి. ఈ కారు పెట్రోల్‌, సీఎన్‌జీ వెర్షన్లలో అందుబాటులో ఉంది. పస్తుతం మారుతీ బ్రెజ్జా కారు రూ.8.34 లక్షల నుంచి రూ.14 లక్షల ధరలో లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..