Fuel Efficiency Bikes: బండి బయటకు తీయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. రోజురోజుకీ పెరుగుతోన్న పెట్రోల్ (Petrol Price) ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. లీటర్ పెట్రోల్ ఏకంగా రూ. 120కి చేరుకుంది. దీంతో బండి అంటేనే హడలెత్తి పోతున్నారు. అందులోనూ లీటర్‌కు కనీసం 50 కిమీల మైలేజ్ కూడా ఇవ్వని బైక్‌లతో జేబులకు చిల్లు పెట్టుకుంటున్నారు. అయితే ప్రస్తుతం పెరుగుతోన్న పెట్రోల్ ధరలను తట్టుకోవాలంటే మైలేజ్ ఎక్కువ ఇచ్చే బైక్‌లే బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. మరి మార్కెట్లో అలా ఎక్కువ మైలేజ్ ఇచ్చే కొన్ని బెస్ట్ బైక్స్ ఏంటో తెలుసుకుందామా.?
అత్యధికంగా మైలేజ్ ఇచ్చే బైక్స్‌లో బజాజ్ కంపెనీకి చెందిన సిటీ 100 తొలి స్థానంలో ఉంది. ఈ బైక్ లీటర్‌కు ఏకంగా 75 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. అంతేకాకుండా ఈ బైక్ ధర కూడా తక్కువ కావడం కలిసొచ్చే అంశం. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 51,800గా ఉంది.
టీవీఎస్ కంపెనీకి చెందిన స్పోర్ట్ బైక్ లీటర్ పెట్రోల్‌కు 73 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 10 లీటర్ల ఫ్యూయల్ కెపాసిటీ ట్యాంక్‌తో రూపొందించిన ఈ బ్యాక్ రూ. 58,900 నుంచి అందుబాటులో ఉంది. ఇందులో సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్‌ను ఇచ్చారు.
110 సీసీలో బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైక్స్‌లో ఇది మొదటి వరుసలో ఉంటుంది. ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 58,200గా ఉంది. 10.5 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ ఈ బైక్ సొంతం.
ఈ బైక్ లీటర్‌కు 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సింగిల్ సిలిండర్, ఫోర్ స్ట్రోక్ ఇంజన్‌తో కూడిన ఈ బైక్ ధర రూ. 63,300గా ఉంది. 11 లీటర్ల ఫ్యూయల్ కెపాసిటీ ఈ బైక్ సొంతం.
ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్‌లో టీవీఎస్ కంపెనీకి చెందిన టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ ఒకటి. ఈ బైక్ లీటర్‌కు 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సింగిల్ సిలండర్ ఎయిర్ కూల్, ఫోర్ స్ట్రోక్ ఇంజన్‌తో కూడిన ఈ బైక్ ప్రారంభం ధర రూ. 70,000గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: Rahul vs KCR: ఓయూలోకి రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరణ.. భావప్రకటన స్వేచ్ఛను సర్కార్ కాలరాస్తుందా?
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా !! కేవలం రూ. 915కే ఏసీ !!
Largest Bottle: బాహుబలి విస్కీ బాటిల్.. అందులో ఎంత మద్యం పడుతుందో తెలిస్తే ఫ్యూజుల్ ఔట్..!