
ఉద్యోగ విరమణ తర్వాత విశ్రాంత జీవితం ప్రశాంతంగా, ఆర్థిక ఒడిదొడుకులు లేకుండా సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం వివిధ పింఛన్ పథకాల్లో పెట్టుబడి పెడతారు. రిటైర్మెంట్ సమయానికి పెద్ద మొత్తంలో డబ్బులు అందేలా ప్లాన్ చేసుకుంటారు. అలాగే అందరికీ తెలిసిన ఈపీఎఫ్ పథకం నుంచి కూడా రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంలో డబ్బులు పొందవచ్చు. తద్వారా విశ్రాంత జీవితాన్ని ఒత్తిడి లేకుండా హాయిగా గడపవచ్చు. దీనికి క్రమశిక్షణ, ప్రణాళిక చాలా అవసరం.
ఈపీఎఫ్ అనే పదవీ విరమణ పొదుపు పథకాన్ని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ ఓ) నిర్వహిస్తుంది. 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న కంపెనీలన్నీ దీనిలో రిజిస్టర్ చేసుకోవాలి. తద్వారా ఆయా కంపెనీ ఉద్యోగులకు ఈపీఎఫ్ పథకం అమలవుతుంది. ప్రతి నెలా ఉద్యోగుల జీతం, డీఏలో 12 శాతాన్ని ఈపీఎఫ్ లో జమ చేస్తారు. అదే మొత్తాన్ని కంపెనీ కూడా ఉద్యోగి పేరున చెల్లిస్తుంది. ఈ 12 శాతంలో 8.33 శాతాన్ని పెన్షన్ ఫండ్ అయిన ఈపీఎస్ లో, మిగిలిన 3.67 శాతాన్ని ఈపీఎఫ్ లో జమ చేస్తారు. ప్రస్తుతం దీనిపై 8.25 శాతం వార్షిక వడ్డీ అమలు చేస్తున్నారు.
ఈపీఎఫ్ చందాదారులు రిటైర్మెంట్ సమయానికి అధిక మొత్తంలో డబ్బులు పొందే అవకాశం ఉంది. అది ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి