
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటుంటారు పెద్దలు. ఈ రెండూ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రత్యేకమైనవి, అవసరమైనవి. పైగా ఖర్చుతో కూడుకున్నవి. పెళ్లికైనా కట్నకానుకల రూపంలో ఏదో ఒక సపోర్టు ఉంటుంది. ఇంటి విషయంలో మాత్రం ఎవరైనా సొంతంగా కూడబెట్టుకొని కట్టుకోవాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. ఈ క్రమంలో సొంతిల్లు కావాలనుకునే ప్రతి ఒక్కరూ గృహ రుణాలను ఆశ్రయిస్తున్నారు. అనుకూలమైన వడ్డీ రేటుతో అధిక మొత్తంలో సులభంగా మంజూరు అవుతుండటంతో అందరూ వీటిని తీసుకుంటున్నారు. అయితే ఈ రుణం తీసుకునే ముందు కొన్ని అంశాలపై ముందే పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దీనిలో వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ చార్జీలు బ్యాంకుల బట్టి మారుతుంటుంది. ఈ నేపథ్యంలో ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ రేటు ఉందో ముందో పరిశీలన చేసుకొని ముందుకెళ్లాలి. అందుకే మీకు మన వద్ద ప్రధాన బ్యాంకుల్లో ఉన్న గృహ రుణాలపై ప్రస్తుత వడ్డీరేట్లను ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ బ్యాంకులో ప్రస్తుతం అత్యంత సరసమైన గృహ రుణాలను అందిస్తోంది. బ్యాంకులో వడ్డీ రేట్లు ఏడాదికి 8.30 శాతం నుంచి ప్రారంభమవుతాయి. కస్టమర్లు ఆస్తి విలువలో 90 శాతం వరకు రుణాలను పొందవచ్చు. తిరిగి చెల్లింపు 30 సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు. అదనంగా, బ్యాంక్ తన రుణగ్రహీతలకు ఓవర్‌డ్రాఫ్ట్, హోమ్ లోన్ బ్యాలెన్స్ బదిలీ సేవలను కూడా అందిస్తుంది.
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రయోజనకరమైన గృహ రుణ ఎంపికలను అందిస్తుంది. ఈ బ్యాంక్ రూ. 30 లక్షల నుంచి రూ. 75 లక్షల వరకు రుణ మొత్తాలకు గృహ రుణ వడ్డీ రేట్లు 8.35 శాతం నుంచి ప్రారంభమవుతాయి.
ప్రస్తుతం ఈ బ్యాంకు జీతం కలిగిన వారికి, జీతం లేని వ్యక్తులపై ఒకే విధమైన వడ్డీ రేట్లను వసూలు చేస్తోంది. బ్యాంకు గృహ రుణ వడ్డీ రేట్లు వార్షికంగా 8.40 శాతం నుంచి 10.60 శాతం వరకు ఉంటాయి. లోన్ మొత్తం.. దరఖాస్తుదారు సిబిల్ స్కోర్ వంటి అంశాలపై ఆధారపడి ఈ రేట్లు మారుతూ ఉంటాయి.
ఈ బ్యాంక్ ప్రస్తుతం సరసమైన గృహ రుణాలను అందిస్తోంది. బ్యాంకు గృహ రుణ వడ్డీ రేట్లు సంవత్సరానికి 8.40 శాతం నుంచి ప్రారంభమవుతాయి. కస్టమర్లు 30 సంవత్సరాల వరకు రుణ కాల వ్యవధిని ఎంచుకోవచ్చు. అదనంగా ఎస్‌బీఐ మహిళా రుణగ్రహీతలకు 0.05% వడ్డీ రాయితీని అందిస్తుంది.
రూ. 35లక్షల నుంచి రూ. 75 లక్షల మధ్య ఉన్న రుణ మొత్తాల కోసం ఈ బ్యాంక్ జీతం పొందే వ్యక్తులకు 9.5 నుంచి 9.8 శాతం వరకు, స్వయం ఉపాధి రుణగ్రహీతలకు 9.65 నుండి 9.95 శాతం వరకు వడ్డీ రేట్లు వసూలు చేస్తుంది. అయితే రూ. 75 లక్షలకు మించిన రుణ మొత్తాలకు, వడ్డీ రేట్లు స్వల్పంగా పెరుగుతాయి. జీతం పొందే వ్యక్తులకు 9.6 నుంచి 9.9 శాతం, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు 9.75 నుంచి 10.05 శాతం వరకు ఉంటాయి.
ఈ బ్యంక్ కూడా సరసమైన వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తోంది. 8.45 శాతం నుంచి 10.25 శాతం వార్షిక వడ్డీ రేటుతో రూ. 30 లక్షల నుంచి రూ. 75 లక్షల వరకు గృహ రుణాలను అందిస్తుంది. అధిక సిబిల్ స్కోర్‌లు ఉన్న రుణగ్రహీతలు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలకు అర్హత పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..